సూపర్ ఎయిట్ లో భాగంగా రేపు భారత్, దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పైనే అందరి దృష్టి నిలిచింది. ప్రోటీస్ జట్టులో కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రామ్‌లతో కూడిన బలమైన బౌలింగ్ లైనప్ ఉంది. వీటిని మన బ్యాటింగ్ లైనప్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లలో ఒపెనర్ ఇషాన్ కిషన్ తప్ప ఎవరూ పెద్దగా రాణించిన దాఖలా లేదు. ఇప్పటి వరకూ జరిగిన మూడు మ్యాచ్ లలో అభిషేక్ శర్మ మూడు డకౌట్లు అయ్యాడు. అయితే హార్దిక్ పాండ్యా (స్ట్రైక్ రేట్ 155) శివం దూబే (స్ట్రైక్ రేట్ 178) మాత్రమే కాస్త బ్యాట్ ఝలిపించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అందరికంటే అభిషేక్ వర్మ ఫామే అందరి కలవరపెడుతోంది. అభిషేక్ మూడు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లలో ఆఫ్ స్పిన్నర్లకే తన వికెట్ సమర్పించుకున్నాడు.
మరో వైపు తిలక్ వర్మ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ పై అతను 24 బంతుల్లో 25 పరుగులు చేశాడు. నమీబియాపై 21 బంతుల్లో 25 పరుగులు చేశాడు. నెదర్లాండ్ పై ఇది 27 బంతుల్లో 31 పరుగులు చేశాడు. టోర్నమెంట్ లో అతని స్ట్రైక్ రేట్ 120 మాత్రమే.
ఇది అతని కెరీర్ స్ట్రైక్ రేట్ 141 కంటే చాలా తక్కువ. మరో వైపు సూర్యకుమార్ యాదవ్ కూడా తన ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. యూఎస్ఏ తో జరిగిన తొలి మ్యాచ్ మినహ మిగిలిన మ్యాచ్ లలో తనకు అవకాశాలు వచ్చిన అంతంత మాత్రంగానే పరుగులు సాధించాడు. కెప్టెన్ టోర్నమెంట్ స్ట్రైక్ రేట్ 136 ప్లస్ అయితే అతని కెరీర్ స్ట్రైక్ రేట్ 163 ప్లస్ కంటే చాలా తక్కువ.
మరో వైపు లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సరైన పరుగులు సాధించడం లేదు. గత రెండు మ్యాచ్ లలో భారత్ చివరి వరుస బ్యాట్స్ మెన్ భారీ షాట్లు ఆడే క్రమంలో వికెట్లు సమర్పించుకున్నారు.
బౌలింగ్ దళం
ఈ టోర్నమెంట్ లో భారత్ బ్యాటింగ్ బాగా లేకపోయిన బౌలింగ్ దళం మాత్రం బాగానే కష్టపడుతోంది. ఆరంభ ఓవర్లలోనే వికెట్లు సాధిస్తూ ప్రత్యర్థులకు కళ్లెం వేస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తూనే వికెట్లు పడగొడుతున్నారు.
నాలుగు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి 5.16 ఎకానమీ రేటుతో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో ఎప్పుడూ లేనంతగా ఓవర్‌కు ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే క్వింటన్ డి కాక్, మార్క్రామ్, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికిల్టన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్ వంటి ఆటగాళ్లు ఉన్న దక్షిణాఫ్రికా జట్టును వీరు ఎలా అడ్డుకుంటారో చూడాలి.
తుది జట్టు..
తుది జట్టు విషయానికొస్తే, అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను భారత్ జట్టులోకి తీసుకుంటుందని, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ తిరిగి వస్తారని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా విషయానికొస్తే, యుఎఇపై జరిగిన మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చిన జాన్సెన్, ఎన్‌గిడి , మహారాజ్ తిరిగి జట్టులోకి రానున్నారు. జట్లు:
ఇండియా: సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రికిల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, లుంగి న్గిడి, కేశవ్ మహారాజ్, కార్బిన్ బాష్, అన్రిచ్ నార్ట్జే, క్వేనా మఫాకా, జార్జ్ లిండే, జాసన్ స్మిత్.
మ్యాచ్ ప్రారంభం: సాయంత్రం 7 గంటలు