
చివరి బంతికి సంచలన విజయాల సమాహారం ఐపీఎల్…ఐపీఎల్ కౌంట్ డౌన్
2025 మార్చి 22 తారీఖున మొదలయ్యే 18 వ సీజన్(ఎడిషన్), మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.
ప్రేక్షకాఅభిమానులను ఉర్రూతలూగించే అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలు , నివ్వెరపరిచే క్యాచ్ లు, ఎవరు గెలుస్తారో ఊహించలేని విధంగా చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా నడిచిన మ్యాచుల సమాహరమే ఐపిఎల్ అంటే. ప్రేక్షకులకు ప్రతి రోజు సాయంత్రం పండగే. గత 17 ఎడిషన్లలో ఇలాంటి సంచలనాలు, ఊహించని ముగింపులు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం.
No match is over until the last ball is bowled. చివరి బంతి వేసేంతవరకు మ్యాచ్ అయిపోయినట్లు కాదు. అన్నది క్రికెట్ రంగంలో, ముఖ్యంగా వన్డేలు t20 లో ఒక నానుడి
చివరి మ్యాచ్ లో(ఫైనల్).. చివరి బంతికి విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్
2008 మొదటి సీజన్ లో, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చివరి బంతికి ఒక్క పరుగు తీసి చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి, కప్పు గెలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 163 పరుగులు చేసింది. 8 కి పైగా రన్ రేట్ తో ఉన్న లక్ష్యాన్ని సాధించడానికి రాజస్థాన్ రాయల్స్ మొదట్లో బాగానే పోరాడింది. బౌలింగ్లో మూడు వికెట్లు తీసిన యూసుఫ్ పఠాన్ 56 పరుగులు చేసి మంచి పునాది వేశాడు.
అయితే మ్యాచ్ చివరికి వచ్చేసరికి 20 వ ఓవర్లో అంటే ఆరు బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు రాజస్థాన్ రాయల్ కెప్టెన్ ఆస్ట్రేలియా కు చెందిన ప్రముఖ స్పిన్నర్ షేన్ వార్న్, పాకిస్తాన్ కు చెందిన తన్వీర్ సోహెల్ బ్యాటింగ్ చేస్తున్నారు.
మణికట్టుతో స్పిన్ మాయాజాలాన్ని చూపించే షేన్ వార్న్, 49 ఓవర్ చివరి బంతి ని అదే మణికట్టుతో బ్యాట్ ను తిప్పి కవర్స్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత జరిగిన డ్రామా ప్రేక్షకుల ఉత్కంఠతకు పరాకాష్ట గా మారింది. 6 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన పరిస్థితి. నరాలు తెగే ఉత్కంఠత. ఇప్పుడు 50 ఓవర్ ఐదు బంతుల్లోవచ్చిన స్కోరు ఇలా ఉంది.1,0,1,2(వైడ్ తో కలిపి)1,2. స్కోరు సమం అయింది. చివరి బంతికి ఒక పరుగు చేస్తే రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుంది. లేకపోతే మ్యాచ్ టై అవుతుంది. చివరికి పాకిస్తాన్ కు చెందిన బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ తన్వీర్ సుహేల్ ఒక పొరుగు సాధించాడు. సంచలనాత్మక చివరి బంతి విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ మొదటి సీజన్ మొదటి కప్ ను గెలిచింది. ఆ తర్వాత ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడు సార్లు చివరి బంతికి విజయం సాధించింది.
ఎక్కువసార్లు చివరి బంతికి విజయం అందుకున్న జట్లు
1.చివరి బంతికి ఎక్కువ విజయాలను సాధించినది చెన్నై సూపర్ కింగ్స్. ఆరుసార్లు చివరి బంతికి విజయాన్ని సాధించింది అందులో ధోని మూడుసార్లు జడేజా రెండుసార్లు సాంట్నర్ ఒకసారి ఆ విజయాలను అందించారు
2. దాని తర్వాత స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది ఐదు సార్లు చివరి బంతికి విజయాలను సాధించింది. ఫైనల్స్ లో ముంబై ఇండియన్స్ బౌలర్ మలింగా శార్దూల్ ఠాకూర్ ని లెగ్ బిఫోర్ అవుట్ చేయడంతో లాస్ట్ బంతికి విజయంతో పాటు ట్రోఫీని కూడా అందుకుంది.
3. మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది చివరి బంతికి 2008 మొదటి సీజన్లో చివరి బంతికి విజయాన్ని అందుకోగా మరో మూడు సార్లు కూడా చివరి బంతికి విజయాలను అందుకుంది.
4. నాలుగో స్థానంలో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఉంది అది మూడుసార్లు చివరి బంతి విజయాలను సాధించింది.
5.ఐదో స్థానంలో రైసింగ్ పూణే సూపర్ జెంట్స్ రెండు సార్లు చివరి బంతికి విజయాన్ని సాధించిన జాబితాలో ఉంది అందులో నమ్మశక్యం కాని మహేందర్ సింగ్ ధోని ఇన్నింగ్స్ ఉంది. చివరి ఓవర్లో అంటే ఆరు పరుగులకు 23 పరుగులుసాధించాల్సిన పరిస్థితిలో ధోని ఆ పరుగులు సాధించడమే కాకుండా లాస్ట్ బాల్ కు ఒక సిక్స్ కొట్టి ఒక అసాధారణ విజయాన్ని టీం కి అందించాడు.
చివరి బంతికి "సిక్స్" కొట్టి మ్యాచ్ గెలిపించినవారు
మ్యాచ్లో చివరి బంతికి సిక్సర్ తో కానీ, బౌండరీ తో గాని మ్యాచ్ గెలిచిన జట్టు ఆనందం ద్విగుణీకృతం అవుతుంది చేసుకుంటుంది. ప్రేక్షకుల కు కావాల్సినంత ఉత్కంఠత, వినోదం ఉంటాయి. ఐపీఎల్ లో చివరి బంతికి బ్యాట్స్మెన్ సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఐపీఎల్ లో సంచలనకు, అసాధ్యమైన ప్రదర్శనలకు కొదవలేదు. చివరి బంతికి విజయం సాధించడం ఒకే అయితే, దాన్ని ఒక సిక్స్ తో సాధించడం మరింత ఉత్కంఠ భరితం. చివరి బంతికి సిక్స్ కొట్టి మరీ విజయాన్ని అందించిన బ్యాట్స్మెన్లు వీరే
1.రింకు సింగ్ వరస సిక్సర్లతో అందించిన అద్భుతమైన విజయం
2023లో కోల్కత్తా నైట్ రైడర్స్ గుజరాత్ టైటిల్స్ ఓడించింది. అదేం పెద్ద విషయం కాదు కానీ చివరి ఓవర్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు 29 పరుగులు కావాలి అప్పుడు కోల్కత్తా నైట్ రైడర్స్ తరఫున దయాల్ చివరి ఓవర్ వేశాడు. కోల్కత్తా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్లు రింకు సింగ్, ఉమేష్ యాదవ్ మైదానం లో ఉన్నారు. మొదటి బంతికి ఉమేష్ యాదవ్ ఒక పరుగు తీసి మిగతా బాధ్యతను రింకు సింకు అప్పగించాడు. అప్పుడు రింకు సింగ్ జట్టు గెలిపించాలంటే ఐదు బంతులలో 28 పరుగులు చేయాలి. ఎవరు ఊహించని విధంగా రింకు సింగ్ వరసగా 5 సార్లు బంతిని ప్రేక్షకుల్లోకి పంపించి జట్టును గెలిపించాడు. ఇది ఒక అద్భుతమైన విజయం
2. 2011 సీజన్లో కోల్కత్తా నైట్ రైడర్స్ కు ముంబై ఇండియన్స్ కు జరిగిన 70వ మ్యాచ్లో కేకేఆర్ 175 పరుగులు సాధించింది. 19 ఓవర్ వరకు 155 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ కు చివరి ఓవర్ లో 21 పరుగులు సాధించాల్సిన పరిస్థితి ఉంది. బరిలో బ్యాట్స్మెన్లు జేమ్స్ ఫ్రాంక్లిన్ అంబటి రాయుడు ఉన్నారు. ఫ్రాంక్లిన్ నాలుగు ఫ్లోర్లు కొట్టిన తర్వాత ఒక పరుగు తీసి అంబటి రాయుడికి బ్యాటింగ్ ఇచ్చాడు, చివరి బంతికి 4 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని ప్రేక్షకుల్లోకి పంపి అంబటి రాయుడు ముంబై ఇండియన్స్ గెలిపించాడు
3. గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ 11 మధ్య జరిగిన మ్యాచ్ లో సంచలనాత్మక బ్యాటింగ్ ప్రేక్షకులు చూశారు పంజాబ్ కింగ్స్ లెవెన్ 108 పరుగులు చేయగా గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్ వరకు మూడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఇంకా 19 పరుగులు చేయవలసిన స్థితిలో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్మెన్ రాహుల్ దివాతియా ఒక పరుగు తీశాడు, తర్వాత మిల్లర్ ఒక ఫోర్ కొట్టి ఒక సింగిల్ తీశాడు. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే రెండు బంతుల్లో 12 పరుగులు చేయాలి. అప్పుడు జరిగిందో ఒక అద్భుతం తివాతియా మైదానంలో ప్రేక్షకులకు ఒక అద్భుతాన్ని చూపించాడు వరుసగా రెండు బాళ్లలో రెండు సిక్స్ లు కొట్టి జట్టును గెలిపించాడు.
(సశేషం)