ఐపీఎల్ లో  బద్దలైన బ్యాటింగ్ రికార్డులు, ఐపీఎల్ కౌంట్ డౌన్ 5
x

ఐపీఎల్ లో బద్దలైన బ్యాటింగ్ రికార్డులు, ఐపీఎల్ కౌంట్ డౌన్ 5

2025 మార్చి 22 తారీఖున మొదలయ్యే 18 వ సీజన్(ఎడిషన్), మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.


ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో బ్యాటింగ్ సంబంధించి కొన్ని, బౌలింగ్ కు సంబంధించి కొన్ని, ఫీల్డింగ్ ఇంకో సంబంధించి కొన్ని ఉన్నాయి. చాలా రికార్డులు బద్దలయ్యాయి . కొన్ని రికార్డులు స్థాపించబడ్డాయి

ఐపీఎల్ లో మొదటిసారి...

* ఐపీఎల్ టోర్నమెంట్లో మొదటి బంతిని ఆడిన బ్యాట్స్మెన్ కోల్కత్తా నైట్ రైడర్స్ సౌరవ్ గంగూలీ. అలాగే మొదటి బంతిని వేసిన వాడు రాజస్థాన్ రాయల్స్ కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్యలో జరిగిన మ్యాచ్లో ప్రవీణ్ కుమార్ రాజస్థాన్ రాయల్స్ తరఫున చేశాడు మొదటి బంతి వేసిన వాడు. మొదటి వికెట్ తీసుకున్న వాడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జహీర్ ఖాన్. విశేషం ఏమిటంటే మొదటి బంతిని ఎదుర్కొన్న గంగోలి వికెట్ నే జహీర్ ఖాన్ తీసుకున్నాడు.

* ఐపీఎల్ లో మొదటి సెంచరీ కొట్టిన వాడు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కోల్కత్తా నైట్ రైడర్ బ్యాట్స్మెన్ గా బ్రిండన్

మెకల్లం 158 పరుగులు చేశాడు అందులో పది బౌండరీలు 13 సిక్సులు ఉన్నాయి. మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 22 పరుగులు చేసింది మూడు వికెట్లు కోల్పోయి తర్వాత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ కేవలం 84 పరుగులు చేశారు అంటే మెకల్లం చేసిన పరుగుల్లో సగం పరుగులను కూడా చేయలేకపోయారు.

బ్యాటింగ్ బాదుషాలు

*రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు కోహ్లీ ఐపిఎల్ హిస్టరీలో ఇంతవరకు 8004 పరుగులు చేశాడు అందులో 8 సెంచరీలు ఉన్నాయి 50 అర్థ శతకాలు ఉన్నాయి. మొత్తం 244 ఇన్నింగ్స్ లో ఆ పరుగులు చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాట్స్మెన్ గా అవతరించాడు.

* బ్యాటింగ్కు సంబంధించి ఇంతవరకు ఎక్కువ సిక్స్ లు కొట్టిన వాడు క్రిష్ గేల్స్. వెస్టిండీస్ కి చెందిన ఈ ఆటగాడు ఇప్పుడు ఐపీఎల్ లో ఆడటం లేదు. అతను ఆడకపోయినా అతని రికార్డ్ ఇంతవరకు బ్రేక్ కాలేదు మొత్తం 141 ఇన్నింగ్స్ లో క్రిష్ గేల్స్ 357 సిక్స్ లు కొట్టాడు అతని తరువాత 250 ఇన్నింగ్స్ లో 276 సిక్స్ లు కొట్టిన ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. బ్యాటింగ్ లో ఎక్కువ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 264 సిక్సులు కొట్టాడు

* సిక్స్ లు కొట్టడం ఒక ఎత్తు. బంతిని ఎంత దూరం పంపించారనేది మరో ఎత్తు. చాలా దూరం బంతి వెళ్లిన సిక్సు కొట్టిన వాడు, చెన్నై సూపర్ కింగ్స్, కెప్టెన్ సూపర్ బ్యాట్స్మెన్ మహేందర్ సింగ్ ధోని. రికార్డు ప్రకారం 110 మీటర్ల సిక్స్ కొట్టాడు.

* అలాగే ఎక్కువసార్లు బౌండరీ లు కొట్టిన ఆటగాడు శిఖర్ ధావన్ మొత్తం 768 బౌండరీలు కొట్టాడు. సూపర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 705 బౌండరీలు మాత్రమే కొట్టాడు

* ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 8 సెంచరీలు కొట్టాడు అతని తర్వాత స్థానంలో ఇంగ్లాండ్కు చెందిన బ్యాట్స్మెన్ బట్లర్ ఉన్నాడు. సెంచరీలు కొట్టాడు. సిక్సులు ఎడాపెడా బాదేసిన క్రిస్ గేల్ కేవలం ఆరుసెంచరీలు మాత్రమే కొట్టగలిగాడు

* ఐపీఎల్ లో ఎక్కువ అర్థ శతకాలు సాధించిన వాడు ఆస్ట్రేలియా కు చెందిన డేవిడ్ వార్నర్. 62 అర్థ శతకాలు చేశాడు. సూపర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 55 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు

* ఐపీఎల్ లో అత్యంత వేగంగా అర్థ శతకాన్ని సాధించిన వాడు యశస్వి జైస్వాల్ 13 పరుగులు బంతుల్లో 50 పరుగులు సాధించాడు

* ఒక్క ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన వాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెందిన క్రిష్ కేల్. 2013 లో జరిగిన 31 మ్యాచ్లో గేల్ 17 సిక్స్ లు కొట్టాడు. ఆ ఇన్నింగ్స్ లో 66 బంతుల్లో 175 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.

*ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన వాడు క్రిస్ గేల్.2013లో పూణే వారియర్స్ ఇండియా తో జరిగిన మ్యాచ్లో 66 బంతుల్లో అజేయంగా 175 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అందులో 17 సిక్సర్లు 13 బౌండరీలు ఉన్నాయి. ఈ రికార్డు ఇంతవరకు బ్రేక్ కాలేదు.

ఇంతవరకు బ్యాటింగ్లో అత్యధిక స్ట్రైక్ రేటు ఉన్న వాడు న్యూజిలాండ్ కు చెందిన బ్యాట్స్మెన్ ఫిల్ సాల్ట్ 21 ఇన్నింగ్స్ లో 175 పరుగుల స్ట్రైక్ రేట్ తో బుక్ చేశాడు 653 పరుగులు చేశాడు.

ఎక్కువ పరుగులు సాధించిన భాగస్వామ్యం రాజస్థాన్ రాయల్స్ చెందిన విరాట్ కోహ్లీ, ఏబి డివిలర్స్ మధ్యలో జరిగింది. 2016 ఎడిషన్లో గుజరాత్ లయన్స్ లో జరిగిన మ్యాచ్ లో వీరిద్దరు రెండో వికెట్ కి 229 పరుగులు చేశారు . ఆ మ్యాచ్లో ఇద్దరు శతకాన్ని బాదేశారు. ఏబి డివిలర్స్ 52 బంతుల్లో 12 సిక్స్ లు 10 బౌండరీ లతో 129 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 109 పరుగులు చేశాడు.ఇంతవరకు ఐపీఎల్ లో ఏ వికెట్ కైనా ఇదే అతిపెద్ద భాగస్వామ్యం.

ఐపిఎల్ లో ఇంతవరకు బ్యాటింగ్ బాదుషాల లిస్టులో, విరాట్ కోహ్లీ, మహేందర్ సింగ్ ధోని, ఆండ్రీ రసల్, లాంటి వారు ముందు వరుసలో ఉంటారు. ఏ బీ డీవీలర్స్, బంతులను నిర్దాక్షిణ్యంగా బాదే క్రిష్ గెల్ ఇప్పుడు ఐపీఎల్ లో ఆడటం లేదు.

ఇంకా కొంతమంది బాదుషాలు ఐపీఎల్ 2025 లో ఆడబోతున్నారు

(సశేషం)

Read More
Next Story