
మరో నాలుగు రోజుల్లో అలరించబోతున్న IPL Countdown-7
2025 మార్చి 22 తారీఖున మొదలయ్యే 18 వ సీజన్(ఎడిషన్), మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.
మరో నాలుగు రోజుల్లో.. క్రికెట్లో అతిపెద్ద టోర్నమెంట్ గా భావించే " ఐపీఎల్" మొదలు కాబోతుంది. ఇది ఒకటి రెండు రోజుల్లో అయిపోయే పండగ కాదు.. 74 రోజులు పాటు నడిచే మెగా క్రికెట్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని రోజులపాటు జరిగే క్రికెట్ టోర్నమెంట్ ఇంకోటి లేదు. మొత్తం మీద ఐపీఎల్ అన్న ఒక్క టోర్నమెంట్ భారతదేశంతో పాటు, ఇతర దేశాల్లో కూడా హడావిడిని సృష్టించింది.
భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ వర్గాల్లో సన్నాహాలు, హడావిడి మొదలయ్యాయి. జట్లకు సంబంధించి, వ్యూహాలు, ప్రాక్టీస్ లు ఇప్పటికే మొదలయ్యాయి.
ప్రేక్షకులకు సంబంధించి టికెట్లు కొనడం ఎప్పుడో మొదలైంది. అభిమానుల హడావిడి మొదలైంది. చిన్న టీవీ ఉన్నవాళ్లు పెద్ద టివి కొనడానికి సంసిద్ధమవుతున్నారు. టీవీల అమ్మకం పెరిగింది. డిస్కౌంట్లు పెరిగాయి. ప్రసార రంగాలు కూడా తమ తమ ఏర్పాటల్లో మునిగి ఉన్నాయి. వ్యాఖ్యాతలు గొంతులు సవరించుకుంటున్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు కూడా తమ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.
ఐపీఎల్ 2025 మ్యాచ్ ల ఫార్మాట్..
దాదాపు ఒక్క రోజు కూడా సెలవు లేకుండా, ప్రతిరోజు ఒక మ్యాచ్ తో(శని ఆదివారాల్లో రెండు మ్యాచ్లతో) ప్రేక్షకులను అలరించబోతున్న ఐపీఎల్ 20 25
మొత్తం 74 మ్యాచ్లు. అందులో 70 లీగ్ మ్యాచ్ లు, రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, చివరకు ఫైనల్.
* 70 రోజుల పాటు ప్రతిరోజు ఒక మ్యాచ్ జరుగుతుంది. అది సాయంత్రం 7:30 మొదలవుతుంది
* 12 రోజుల పాటు మాత్రం రోజుకి రెండు మ్యాచ్లు జరుగుతాయి. అంటే శనివారం, ఆదివారం మ్యాచ్లు ఉంటాయి. అవి మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతాయి
13 స్టేడియం లలో జరిగే పండగ
మ్యాచ్ ల కోసం మొత్తం భారతదేశంలోని వివిధ నగరాల్లో ఉన్న 13 స్టేడియం లను సిద్ధం చేశారు. . ఇక్కడ ఒక విషయం ఉంది ప్రతి జట్టుకి ఒక సొంత స్టేడియం ఉంటుంది. ఇందులో అతి పెద్ద స్టేడియం. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం. దాదాపు లక్షన్నర మంది మ్యాచ్ తిలకించే అవకాశం ఉంది. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇదే. గుజరాత్ టైటాన్స్ హోమ్ స్టేడియం ఇదే. ఇవే ఆ స్టేడియంలు.. ప్రేక్షకుల కెపాసిటీ.
చెన్నై సూపర్ కింగ్స్ (ఎమ్మే చిదంబరం స్టేడియం, చెన్నై) కెపాసిటీ 38,000
కోల్కత్తా నైట్ రైడర్స్ (ఈడెన్ గార్డెన్స్, కోల్కతా) కెపాసిటీ 68,000
పంజాబ్ కింగ్స్ (ఐఎస్పిబి అసోసియేషన్ స్టేడియం, మొహాలి) కెపాసిటీ 27,000
రాజస్థాన్ రాయల్స్( సవాయి మాన్సింగ్ స్టేడియం, జైపూర్) కెపాసిటీ 24,000
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు( చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు) కెపాసిటీ 32,000
ఢిల్లీ క్యాపిటల్స్(అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ) కెపాసిటీ 35,200
గుజరాత్ టైటాన్స్(నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్)కెపాసిటీ 1,32,000
లక్నో సూపర్ జెంట్స్(ఇకన క్రికెట్ స్టేడియం, లక్నో)కెపాసిటీ 50,100
ముంబై ఇండియన్స్ (వాంకాడే స్టేడియం, ముంబై)కెపాసిటీ 33,100
సన్రైజర్స్ హైదరాబాద్(రాజీవ్ గాంధీ స్టేడియం, హైదరాబాద్)కెపాసిటీ 55,000
ఢిల్లీ క్యాపిటల్స్ తన కొన్ని మ్యాచ్ లను( తన సొంత స్టేడియంలో ఆడవలసిన మ్యాచులు) విశాఖపట్నం లో ఆడుతుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా కొన్ని మ్యాచ్లను గౌహతిలో ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ 11 తన కొన్ని మ్యాచ్లను ధర్మశాలలో ఆడుతుంది
ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్న మొత్తం పది జట్లను A, B అనే రెండు గ్రూపులుగా విభజించారు
గ్రూప్ ఏ
చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
గ్రూప్ బి
ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెంట్స్, ముంబై ఇండియన్స్
సన్రైజర్స్ హైదరాబాద్
ఆ స్టేడియం లో ప్రతి జట్టు తన A గ్రూపులో ఉన్న మిగతా నాలుగు జట్లతో ఒక మ్యాచ్ సొంత స్టేడియం లలో ఆడుతుంది, తరువాత వారి సొంత స్టేడియంలలో ప్రతి జట్టుతో ఒక మ్యాచ్ ఆడుతుంది. దాంతో గ్రూప్ ఏ లో ఉన్న జట్టు ఒక్కొక్కటి మొత్తం ఎనిమిది మ్యాచ్ లు ఆడతాయి.
తరువాత B గ్రూపులో ఉన్న 5 జట్లతో వారి సొంత స్టేడియం లలో ఒక మ్యాచ్ ఆడుతుంది, తర్వాత తన సొంత స్టేడియంలో 5 మ్యాచ్లు ఆడుతుంది. మొత్తం పది మ్యాచ్ లు. అంటే ప్రతి జట్టు మొత్తం 13 మ్యాచ్లు ఆడుతుంది. అలా ప్రతి జట్టు ఆడుతుంది కాబట్టే మొత్తం 74 మ్యాచులు జరుగుతాయి.
ప్లే ఆఫ్స్ (play offs)
మే 18 వ తారీకు తో లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి. తర్వాత మొత్తం పది జట్లలో మొదటి నాలుగు స్థానాల్లో వచ్చిన వారు ప్లే ఆఫ్స్ కి వెళ్తారు. 1,2 స్థానాల్లో వచ్చిన వారు క్వాలిఫైయర్ 1 ఆడుతారు. అందులో గెలిచినవారు నేరుగా 25.5.25 తేదీన జరిగే ఫైనల్స్ కి వెళ్తారు.
3,4 స్థానాల్లో వచ్చిన వారు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతారు. అందులో గెలిచినవారు క్వాలిఫైయర్ 1 ఓడిన వారితో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడతారు. అందులో గెలిచినవారు ఫైనల్ లో క్వాలిఫైయర్ వన్ లో గెలిచిన వారితో ఫైనల్స్ మ్యాచ్ ఆడతారు.
ఉదాహరణకు 2024 ప్లే ఆఫ్స్ చూస్తే. మొదటి నాలుగు స్థానాల్లో వచ్చిన వారు వీరే.
1. కోల్కత్తా నైట్ రైడర్స్
2. సన్రైజర్స్ హైదరాబాద్
3. రాజస్థాన్ రాయల్స్
4. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
క్వాలిఫైయర్ 1
కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో కోల్కత్తా నైట్ రైడర్స్ గెలిచి ఫైనల్ కి వెళ్ళింది
ఎలిమినేటర్
రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. అందులో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది
క్వాలిఫైయర్ 2
క్వాలిఫైయర్ 1 ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ తో ఎలిమినేటర్ లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఆడింది.
అందులో సన్రైజర్స్ హైదరాబాద్ గెలిచింది
ఫైనల్స్ 2024
క్వాలిఫైయర్ వన్ లో గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్, క్వాలిఫైయర్ 2 లో గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ తో తలపడింది. కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ పై గెలిచి 2024 ఐపీఎల్ ఛాంపియన్ అయింది.
ఇంతవరకు గెలిచినవారు- గెలవలేకపోయిన వారు
ఇంతవరకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్షిప్ గెలిచారు. ఈసారి ఇద్దరూ ఆరో ట్రోఫీ కోసం గట్టి ప్రయత్నం చేయబోతున్నారు. తర్వాత కోల్కత్తా నైట్ రైడర్స్ మూడుసార్లు ట్రోఫీ గెలిచింది. ఈసారి ఈ మూడు జట్లు మరో ట్రోఫీ కోసం వ్యూహాలు పన్నుతున్నారు.
ఒక్కసారి ట్రోఫీ గెలిచిన వాళ్లలో, మొదటి ఐపీఎల్ ట్రోఫీ (2008) గెలిచిన రాజస్థాన్ రాయల్స్, తర్వాత 2009 ట్రోఫీని సాధించిన డెక్కన్ చార్జర్స్(ఇప్పుడు డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ లో లేదు), సన్రైజర్స్ హైదరాబాద్(2016) కూడా రేసులో ఉన్నారు.
ఈ రేసులో ఉన్న మరో జట్టు గుజరాత్ టైటాన్స్.2022 లో మొదటిసారి ఐపీఎల్ లో అడుగుపెట్టి ఆ సంవత్సరం ట్రోఫీ గెలిచిన జట్టు ఇదే. 2023 కూడా ఫైనల్ చేరినప్పటికీ, ట్రోఫీ గెలవలేకపోయింది.
ఇంతకుముందు ఐపీఎల్ ఆడిన కేరళ టస్కర్స్, డెక్కన్ చార్జర్స్, రైజింగ్ పూణే సూపర్ జాయింట్, గుజరాత్ లయన్స్,పూణే వారియర్స్ ఇండియా వివిధ కారణాలవల్ల ఈ ఐపీఎల్లో ఆడటం లేదు. ఆ జట్లు కూడా ఇప్పుడు మనుగడలో లేవు.
ఇంతవరకు గెలవలేకపోయిన జట్లు
ఇప్పుడు ఐపీఎల్ 2025 ఆడుతున్న జట్లలో 4 జట్లు ఇంతవరకు ఒకసారి కూడా ట్రోఫీ గెలవలేదు. అందులో మినహాయింపు లక్నౌ సూపర్ జైంట్స్. ఈ జట్టు 2022 లో అడుగు పెట్టింది. 2008 నుంచి ఇంతవరకు ఐపీఎల్ అన్ని సీజన్ లలో ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్(ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇదివరకు), పంజాబ్ కింగ్స్ లెవెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీములు ఒకసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయాయి.
సత్తా ఉన్నప్పటికీ గెలవలేకపోయిన జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఇందులో ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఒకప్పుడు గేల్స్, దీవిల్లీయర్స్ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ కప్పు గెలవలేకపోయాయి. ఇంకా కోహ్లీ గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఆ జట్టు ఈసారి తీవ్రంగా కప్పు కోసం ట్రై చేయొచ్చు. గతంలో మూడు సార్లు ఫైనల్స్ కి వెళ్లినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ కప్పు గెలవలేకపోయింది. 9సార్లు ప్లే ఆఫ్ కి, క్వాలిఫై అయినా కప్పు చివరిదాకా వెళ్లలేకపోయింది. ఈసారి కోహ్లీ కప్పు గెలవడానికి శాయశక్తుల కృషి చేసే అవకాశం ఉంది.