మూడు రోజుల్లో ఐపీఎల్18 వ సీజన్ ప్రారంభం IPL Countdown-8
x

మూడు రోజుల్లో ఐపీఎల్18 వ సీజన్ ప్రారంభం IPL Countdown-8

2025 మార్చి 22 తారీఖున మొదలయ్యే 18 వ సీజన్(ఎడిషన్), మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.


ఒక సంవత్సరం, ఒక నెల, ఒక వారం నుంచి రోజుల్లోకి వచ్చేసింది ఐపీఎల్ ప్రారంభం. కోచ్, కెప్టెన్, ఆటగాళ్ల గుండెల్లో గుబులు మొదలైంది. ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్సాహం పెరిగిపోయింది. అన్ని వర్గాల వారు గత సంవత్సరం ఐపీఎల్ ను మర్చిపోయి మళ్ళీ ఐపీఎల్ సీజన్ 18 ను ఆస్వాదించడానికి సమాయత్తమవుతున్నారు.

బలమైన జట్లు.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ లో ఇంతవరకు 17 సీజన్లు జరిగాయి. అందులో పది సార్లు ( ఒక్కొక్కరు ఐదుసార్లు) ఐపీఎల్ కప్ గెలిచిన జట్లు రెండు. ఒకటి ముంబై ఇండియన్స్. రెండు చెన్నై సూపర్ కింగ్స్. ఏ రకంగా చూసిన ఈ రెండే బలమైన జట్లు. మూడుసార్లు కప్పు గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ మూడో స్థానంలో ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ చార్జర్స్(ఐపీఎల్ లో ఆడడం లేదు), సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తరువాత స్థానాల్లో ఉంటాయి.

ఇక పాత రికార్డులు, నమోదు చేసిన గణాంకాలు, ఓటములు, చివరి ఓవర్ విజయాలు, వ్యక్తిగత వైఫల్యాలు, బౌలింగ్లో చేసిన వ్యూహాత్మక తప్పిదాలు, బ్యాటింగ్లో తారుమారైన అంచనాలు, అలా జరిగి ఉంటే గెలిచేవాళ్ళం, ఇలా జరగకుండా ఉంటే గెలిచే వాళ్ళం అన్న విశ్లేషణలు పక్కన పెట్టి, ఇదివరకు గెలిచిన జట్లు, ఇంత వరకు గెలవని జట్లు కూడా కొత్త రకమైన వ్యూహాలు, జట్టుకూర్పు వంటి వాటితో బిజీగా ఉంటారు. కోచ్ లు జట్టు మీటింగ్ లతో తలమునకలై ఉంటారు. ఇంకా ఆట గురించి తప్ప వేరే అంశాలు ఏవి ముఖ్యం కాదని తెలుస్తుంది.

ఇప్పుడు వ్యాఖ్యాతలు, విశ్లేషకులు,అనలిస్టులు, ప్రేక్షకులు ఏ జట్టు గెలుస్తుంది అన్న దానిమీద ప్రధాన చర్చలు చేసుకుంటారు. ఇప్పుడు అంచనాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ముందుగా ఇంతవరకు గెలిచిన జట్ల గురించి ఒకసారి పరిశీలిస్తే ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయన్న దానిమీద కొంతవరకు అంచనా వేయవచ్చు.

ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య Rivalry(స్పర్ధ)

మొత్తం మీద ముంబై ఇండియన్స్ రెండుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ నీ ఫైనల్స్ లో ఓడిస్తే, చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కసారి మాత్రమే ముంబై ఇండియన్స్ ఫైనల్స్ లో ఓడించింది. అయితే ఇంతకుముందు మొత్తం 17 ఫైనల్స్ లో పది సార్లు ఫైనల్స్ చేరిన జట్లు ఈ రెండు మాత్రమే. ఐపీఎల్ కు సంబంధించినంత వరకు ఈ రెండే బలమైన జట్లు. బ్యాటింగ్ పరంగా చూసిన, బౌలింగ్ పరంగా చూసిన, మొత్తం ఐపీఎల్ విజయాల పరంగా చూసిన, ఈ రెండు జట్లే ప్రధానంగా కనపడతాయి

ఆరో ఐపీఎల్ కప్ పై గురిపెట్టిన ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ ఇప్పుడు 6 సంఖ్య మీద ఆసక్తి ఉంది అంటే ఆరో సారి గెలవడం గురించి తీసుకోవలసిన చర్యల గురించి ముఖ్యంగా జట్టు కూర్పు, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ వ్యూహాల గురించి మాత్రమే జట్టు కోచ్... కెప్టెన్ హార్దిక్ పాండ్యా(ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్ ఆడకపోవచ్చు). అయితే అది మైదానంలో సిక్స్ కొట్టినంత సులభం కాదని జట్టు కోచ్ తో సహా అందరికీ తెలుసు. ముఖ్యంగా భారీ సిక్స్ లు. అలవోకగా కొట్టే హార్దిక్ పాండ్యా కు ఈ విషయం బాగా తెలుసు.

గతంలో ఐదు సార్లు కప్ గెలిచిన ముంబై ఇండియన్స్ ప్రదర్శన, జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందో చూద్దాం...

ముంబై ఇండియన్స్ ఎత్తుపల్లాలు

ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచింది. అందులో రెండు సార్లు ఒక పరుగు తేడాతో ప్రత్యర్థి జట్లను ఓడించడం విశేషం.

2008లో మొదటి సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ ప్రదర్శన అంత ఆసక్తికరంగా లేదు 2010 మాత్రం ఒక్కసారి ఫైనల్స్ చేరినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. 2013 లో మొదటిసారి కప్పు గెలిచినప్పటి నుంచి, ముంబై విజయం గ్రాఫ్ పైకి వెళ్ళింది.2015,17,19,20 సీజన్లలో గెలిచింది. మళ్లీ 2021,22,23,24 ఒకసారి కూడా ఫైనల్ చేరలేదు. ఇది ముంబై ఇండియన్స్ విజయప్రస్థానం.

ముంబై ఇండియన్స్ జట్టు ఆరుసార్లు (2010,13,15,17,19,20) ఫైనల్స్ లోకి వెళ్ళింది. ఐదు సార్లు కప్పు గెలుచుకుంది. మొదటిసారి 2010లో కప్పు గెలవలేకపోయింది. మిగతా ఐదు సార్లు ఫైనల్స్ లో గెలిచి కప్పు సాధించింది 2010 తన ప్రధాన ప్రత్యర్థి అయిన చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. అయితే 2013,15,19 లో ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించి, బదులు తీర్చుకుంది. 2020 లో మొదటిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించి ఐదో ఐపీఎల్ కప్ ను గెలుచుకుంది, గత నాలుగేళ్లలో ఒకసారి కూడా ఫైనల్ కి చేరలేదు. 2023 మాత్రం ప్లే ఆఫ్ లో ఆడింది. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెంట్స్ చేతిలో గెలిచినప్పటికీ క్వాలిఫైయర్ 2 లో ముంబై గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది రెండోసారి బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో గెలిచింది.

ఫైనల్స్ లో ముంబై ఇండియన్స్

2010 లో 22 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది

2013 లో 23 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచింది

2015 లో 41 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచింది

2017 లో 1 పరుగు తేడాతో పూణే సూపర్ జెంట్స్ పై గెలిచింది

2019 లో మళ్లీ 1 పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచింది

2020 లో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిచింది

ఐపిఎల్ లో ఇంతవరకు 261 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు 142 మ్యాచ్లలో గెలిచింది. 115 మ్యాచ్లలో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసి ప్రత్యర్థికి లక్ష్యాన్ని నిర్దేశించిన ముంబై ఇండియన్స్ 71 మ్యాచులు గెలిచింది. మిగతా 71 ప్రత్యర్థి ఇచ్చిన లక్ష్యాన్ని సాధించి గెలిచింది. .ఈ ఫలితాలు చూస్తే ముంబై ఇండియన్స్ బౌలింగ్ కొంచెం బలహీనంగా కనబడుతుంది.

అయితే ఫైనల్స్ లో మాత్రం, అతి కష్టం మీద లక్ష్యాన్ని కాపాడుకోగలిగిందంటే, బౌలర్లు చివరి ఓవర్లలో వికెట్లు తీయలేకపోయారు అని తెలుస్తోంది. 2017,19,20 ఫైనల్స్ లో ముంబై ఇండియన్స్ 1,1,5 పరుగుల తేడాతో విజయం సాధించింది అంటే అర్థం చేసుకోవచ్చు. ముంబై బౌలింగ్ విభాగంపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.

ఆరోసారి గెలుపు కోసం ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్లో బలమైన జట్లలో ఇది ఒకటి. ముంబై ఇండియన్స్ లాగే ఇంతవరకు ఐదు కప్పులు సాధించింది. మహేందర్ సింగ్ ధోని నేతృత్వంలో ఇది జరిగింది.

మూడుసార్లు ముంబై ఇండియన్స్ చేతులు ఓడిపోయినప్పటికీ, ఐదు సార్లు కప్పు సాధించిన జట్టు ఇది. 8సార్లు ఫైనల్ చేరినప్పటికీ ఐదు సార్లు మాత్రమే కప్పు గెలిచింది. మొదటి సీజన్ 2008, ఫైనల్ చేరినప్పటికీ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దరిమిలా మరో ఏడు సార్లు ఫైనల్ చేరి ఐదు సార్లు విజయం సాధించింది. అయితే 2015 స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో 2016,2017 సీజన్ల నిషేధం పొందిన చెన్నై సూపర్ కింగ్స్ 2018లో పునరాగం మనం చేసి కప్పు సాధించడం విశేషం.

చెన్నై సూపర్ కింగ్స్. రెండు కూడా ఈసారి ఆరో కప్పు కోసం శాయశక్తులా ప్రయత్నం చేయడం మాత్రం ఖాయం.

ఈ రెండు జట్లు వేరే వేరే గ్రూపుల్లో ఉన్నాయి కనక ఫైనల్స్ లో మరోసారి తలపడే అవకాశం లేకపోలేదు. ఆ గ్రూపు లలో ఉన్న ఇతర జట్లకు ఇబ్బంది కలిగించే జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. రెండు కూడా ఈసారి ఆరో కప్పు కోసం శాయశక్తులా ప్రయత్నం చేయడం మాత్రం ఖాయం.

వీటితోపాటు మూడుసార్లు గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ మూడో కప్పు కోసం , ఒక్కోసారి గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా రెండో కప్పు కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంది.

Read More
Next Story