
మరో 48 గంటల్లో ఐపిఎల్ ఆరంభం IPL Countdown-9
2025 మార్చి 22 తారీఖున మొదలయ్యే 18 వ సీజన్(ఎడిషన్), మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.
రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. జట్లు, ప్రేక్షకులు కూడా ఉత్సాహం తో ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ఒకసారి గెలిచిన జట్టు, రెండో కప్పు కోసం సిద్ధమవుతున్నారు. . ఒక్కసారి కూడా గెలవని జట్లు, ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలని పట్టుదలతో ఉన్నాయి. ఇంతవరకు ఐపీఎల్ ఒక్కసారి గెలిచిన జట్లు రాజస్థాన్ రాయల్స్(2008), డెక్కన్ చార్జర్స్(2009), (ఇప్పుడు ఆడడం లేదు), సన్రైజర్స్ హైదరాబాద్(2016), గుజరాత్ టైటాన్స్(2022). ఇంతవరకు ఐపీఎల్ గెలవని జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్
రెండోసారి కప్పు గెలవాలనుకున్న రాజస్థాన్ రాయల్స్.
2008 మొదటి సీజన్ లో కప్పు గెలుచుకున్న రాజస్థాన్ రాయల్ ప్రదర్శన నిరాశజనకంగా ఉంది. మొదట కనిపించిన ఊపు మిగతా సీజన్లో కనిపించలేదు. మొత్తం 16 సీజన్లలో ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరింది. అనూహ్యంగా 2022 మొదటిసారి ఐపీఎల్ ఆడిన గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఈసారి కప్పు గెలవాలని కృత నిశ్చయంతో ఉంది. ఈసారి కోచ్ గా భారత జట్టు కోచ్ గా పని చేసిన రాహుల్ ద్రవిడ్ ని నియమించుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. అది కొంతవరకు జట్టులో ఉత్సాహం నింపవచ్చు, గెలిచే అవకాశాల్ని పెంచవచ్చు.
బ్యాటింగ్ కు సంబంధించినంత వరకు జట్టు లో ప్రతిభావంతుడైన యువ క్రికెటర్ జైస్వాల్, కెప్టెన్ సంజు శాంసన్ , శుభం దూబే కొంతవరకు పర్వాలేదు. హిట్ మేయర్ మంచి హిట్టర్. బౌలర్లలో సందీప్ శర్మ వారి బలం, రెండో బలం శ్రీలంక బౌలర్ మహేష్ తీక్షణ, వైభవ్ సూర్య వంశీ ఆశ్చర్యకరంగా జట్టులో ఉన్నాడు.13 ఏళ్ల ఈ యువ ప్రతిభ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జట్టులో తీసుకున్నారు. ఈ సీజన్లో అరంగేట్రం చేయడం కష్టమే. గత సీజన్లో మంచి బ్యాటింగ్ చేసిన పరాగ్ కూడా రాజస్థాన్ రాయల్స్ బలమే. దీని బలహీనత డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే బౌలర్లు లేకపోవడం. ఇక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ శాంసన్ గురించి చెప్పనవసరం లేదు. అయితే జట్టు కెప్టెన్ గా జట్టు ను ఎలా నడిపిస్తాడు అన్నది చూడాలి.
ఇంకొక కప్పు కోసం ఎదురుచూస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్
2016 లో మొదటిసారి ఐపీఎల్ కప్ గెలిచిన తర్వాత మరో రెండు సార్లు (2018,2024) ఫైనల్ చేరినప్పటికీ, ఒకసారి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో, మరోసారి క్రితం సీజన్లో, కోల్కతా నైట్ రైడర్ చేతిలో ఓడిపోయింది.
నిజానికి పేపర్ మీద చాలా బలమైన జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. ఒక్క సీజన్లో(2024) మూడుసార్లు 250 దాటిన స్కోరు తో పాటు ఐపీఎల్ చరిత్రలో మూడు వికెట్లు కోల్పోయి 287 పరుగులు సాధించడం. సన్రైజర్స్ వేలంలో కాకుండా తెలివిగా ముందే క్లాసిన్, కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితిన్ రెడ్డి లాంటి ఆటగాళ్లను రిటైన్(అట్టే పెట్టుకోవడం) చేసింది. గత సీజన్లో అంతగా రాణించని మార్క్రం, షాబాజ్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్ లాంటి ఆటగాళ్లని వదిలేసింది. జట్టులోకి ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, రాహుల్ చౌహార్ వంటి వారితో జట్టును బలోపేతం చేసుకుంది. ఈసారి కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్న జట్లలో ఇది ఒకటి.
ఛాంపియన్స్ ట్రోఫీలో బౌలింగ్ చేసి తన సామర్థ్యం తగ్గలేదని రుజువు చేసిన ఫాస్ట్ బౌలర్ షమీ ఈ జట్టు బౌలింగ్ ను బలోపేతం చేస్తాడు. ఇక ఆడం జంపా, రాహుల్ చౌహాన్, మలింగా లాంటివాళ్ళు శమీ కి సపోర్ట్ గా ఉంటారు. బ్యాటింగ్ కు సంబంధించి వేగంగా పరుగులు సాధించి జట్టు స్కోరును పెంచే ప్లేయర్లు చాలామంది ఉన్నారు. అయితే నిలకడగా అలాంటి వాళ్లకి మరో ఎండ్ బ్యాటింగ్ చేసే బ్యాట్స్మెన్ లు లేకపోవడం, సన్ రైజర్స్ బలహీనత.
అరంగేట్రంలోనే అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్
2022 ఐపీఎల్ లో లక్నో సూపర్ జెంట్స్ తో పాటు అడుగుపెట్టిన, గుజరాత్ టైటాన్స్ పెద్ద పెద్ద టీములను ఆశ్చర్యపరుస్తూ కప్పు ఎగిరేసుకుపోయింది. ఇది ఎవరు ఊహించనిది. 2023 లో కూడా ఫైనల్ చేరినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. మూడో సీజన్ ఆడినప్పటికీ 2024 లో ఎనిమిదో స్థానం పొంది లీగ్ దశలోనే, నిష్క్రమించింది.
2022 లో 70 శాతం విజయాలతో, హార్థిక్ పాండ్యా నేతృత్వంలో జట్టు కప్పు గెలుచుకుంది. రషీద్ ఖాన్ నేతృత్వంలోని జట్టు 50% విజయాలతో ఫైనల్ చేరినప్పటికీ, కప్పు గెలవలేకపోయింది. 37% విజయాలతో లీగ్ దశలో నే వెళ్ళిపోయింది.
ఇప్పుడు రెండోసారి కెప్టెన్ గా జట్టును నడిపించాల్సిన బాధ్యత శుభమన్ గిల్ దే. ఐసిసి ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం పొందిన గిల్ మంచి బ్యాట్స్మెన్. వేగంగా స్కోర్ చేయగలడు. కానీ కెప్టెన్ గా చిన్న వయసు కాబట్టి మంచి వ్యూహాలు లేక పోవడం, ఇతర వైఫల్యాలతో జట్టును విజయపతంలోకి తీసుకెళ్లలేకపోయాడు. ఆరంభంలోనే అదరగొట్టి, క్రమేణ కిందికి దిగజారిపోయిన గుజరాత్ టైటాన్స్ లయన్ లాగా గర్జించాలంటే, అత్యుత్తమ స్థాయి ప్రదర్శన చేయాల్సిందే. పేపర్ మీద బ్యాటింగ్ చూస్తే అదిరిపోతుంది. గిల్ తోపాటు, జోష్ బట్లర్, రాహుల్ తివాతియా, రషీద్ ఖాన్ లాంటి బ్యాట్స్మెన్లు తమదైన రోజు మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలరు. అన్ని సవ్యంగా జరిగితే, రెండోసారి కప్పు గెలిచే అవకాశం ఉన్న జట్టు ఇది.
ఈసారి కప్పు గెలవాలని పట్టుదలతో ఉన్న పంత్
లఖ్ నవ్ సూపర్ జైంట్స్(ఎల్.ఎస్.జీ) కూడా గుజరాత్ టైటాన్స్ తో పాటు, 2022 లో ఐపీఎల్ లో అడుగు పెట్టింది. భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ నేతృత్వంలో వరుసగా రెండు సంవత్సరాలు ప్లే ఆఫ్స్ కు చేరింది. 2024 లో ఏడో స్థానం లో నిలిచింది. సహజంగానే జట్టు యాజమాన్యం రాహుల్ ను కెప్టెన్ గా వద్దనుకుంది. దాంతో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కు జట్టు పగ్గాలు అందించింది. 27 కోట్లతో వేలంలో పంత్ ను కొనుక్కుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఇతనే.
జట్టులో మిల్లర్ లాంటి మంచి లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు, ఆల్రౌండర్లు, మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని లాంటివాళ్ళ తో పాటు, అత్యంత వేగంగా బౌలింగ్ చేసే మయాంక్ యాదవ్ తో పాటు ప్రతిభవంతుడైన స్పిన్నర్ రవి బిష్నోయి ఈ జట్టుకు బలాలు. పంత్ ధాటిగా ఆడే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ, కెప్టెన్ గా జట్టును సమర్థవంతంగా నడపగలుగుతాడా లేదా అన్నది చెప్పలేం. బ్యాట్స్మెన్ గా వికెట్ కీపర్ గా మంచి టాలెంట్ ఉన్న ఆటగాడు. కానీ ఇప్పుడు ఈసారి కొంత ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టే కాబట్టి, కొన్ని జట్ల ఫలితాలను తారుమారు చేసే అవకాశం అయితే ఉంది. గెలిచే అవకాశాలు 50 నుంచి 60 శాతం మాత్రమే.
ఒక్కసారైనా కప్పు గెలవాలని కృత నిశ్చయంతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఇదే. చాలామంది అభిమానులకు బాధాకరమైన విషయం కూడా అదే. ఇంతవరకు 17 సీజన్లలో ఒకసారి కూడా కప్పు గెలవని జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. . ఏ జట్టైనా సరే కప్పు గెలవకపోవడం పెద్ద విషయం కాదు. కానీ కోహ్లీ, డి డివిల్లియర్స్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు, బౌలర్లను చీల్చి చెండాడే వెస్టిండీస్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా కప్పు గెలవకపోవడం అభిమానులతో సహా, అనలిస్టులను కూడా ఆశ్చర్యపరుస్తున్న విషయం.
మూడుసార్లు ఫైనల్స్ చేరినప్పటికీ, కప్పు చేజిక్కలేదు. 2009 లో డెక్కన్ చార్జర్స్ చేతిలో ఫైనల్స్ ఓడిపోయిన తర్వాత, 2011 లో ఫైనల్స్ వెళ్లినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ కప్పు ఎగిరేసుకుపోయింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ 2016 లో కూడా ఫైనల్ చేరినప్పటికీ, కప్పు గెలవలేకపోయింది. సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. డెక్కన్ చార్జర్స్ ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ గా మారిన విషయం తెలిసిందే.
నాలుగో కప్పు కోసం ప్రయత్నం చేస్తున్న కేకేఆర్ జట్టు
కేకేఆర్ జట్టును, కింగ్ ఖాన్ రైడర్స్ జట్టుగా చెప్పుకుంటారు. అయితే షారుఖ్ ఖాన్ సక్సెస్ అయినట్లు, షారుక్ ఖాన్ జట్టు సక్సెస్ కాలేదు. బలమైన జట్టుగా పేరు పొందినప్పటికీ, మూడుసార్లు మాత్రమే గెలిచింది.
ఈసారి కప్పు గెలవడానికి బరిలో ఉన్న బలమైన జట్టు కోల్కత్తా నైట్ రైడర్స్. 2004 కప్పు సాధించిన కేకేఆర్ జట్టు, కెప్టెన్ ప్రముఖ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును వదిలేసి వెళ్ళిపోయాడు. అది కేకేఆర్ ను ఓరకంగా బలహీనపరిచే అవకాశం ఉంది. అయ్యర్ పంజాబ్ కింగ్స్ కు వెళ్లాడు, పంజాబ్ కింగ్స్ ను బలమైన జట్టుగా తీర్చిదిద్దడం అంత సులువైన పని కాదు. అజీంక్యా రహానే ఇప్పుడు కేకేఆర్ కెప్టెన్. దేశవాళీ టోర్నమెంట్లలో తన బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్న రహానే, కేకేఆర్ జట్టును గెలిపించడం అంత సులభం కాదు.
అయినప్పటికీ నాలుగోసారి కప్పు కోసం ప్రయత్నం చేసే క్రమంలో కేకేఆర్ కొంతవరకు సఫలం కావచ్చు అని అనిపిస్తుంది
మొదటి కప్పు కోసం ప్రయత్నం చేసే దిశగా ఢిల్లీ క్యాపిటల్స్(ఢిల్లీ డేర్ డెవిల్స్)
ఒక్కసారి కూడా కప్పు గెలవని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉంది. మొదటి రెండు సీజన్లలో (అప్పుడది ఢిల్లీ డేర్ డెవిల్స్) ప్రతిభను చూపిన ఢిల్లీ క్యాపిటల్స్, తర్వాత పేలవమైన ప్రదర్శన చేసింది. కానీ తర్వాత 2020 లో ఫైనల్స్ వరకు వెళ్ళింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. ఇప్పుడు అక్షర పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్యం తీసుకున్నాడు. లెఫ్ట్ అండ్ స్పిన్నర్ గా ప్రతిభావంతుడైన బౌలర్ అక్షర్ పటేల్. అయితే సారథ్యం లో ఎంత నిలకడగా ఉంటాడో చెప్పలేం. గౌతమ్ గంభీర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ కొంతవరకు పర్వాలేదనిపించాడు. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ గా మారిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కొంత మెరుగైన ప్రదర్శననే చేసిందని చెప్పాలి. ఈ జట్టులో డూప్లెస్సీస్, కేఎల్ రాహుల్ చేరడం ఢిల్లీ క్యాపిటల్స్ కు కొంత బలం. బౌలింగ్లో లెఫ్ట్ అండ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పెసర్ మోహిత్ శర్మ జట్టులో ప్రతిభావంతమైన బౌలర్లు.