టీ20 జట్టులోకి ఢిల్లీ ఎక్స్ ప్రెస్.. మిస్టరీ స్పిన్నర్
x

టీ20 జట్టులోకి ఢిల్లీ ఎక్స్ ప్రెస్.. మిస్టరీ స్పిన్నర్

బంగ్లాదేశ్ తో త్వరలో ప్రారంభం కాబోతున్న మూడు టీ20 సిరీస్ కు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఇందులో ఐపీఎల్ లో తన వేగంతో మెరుపులు మెరిపించిన మయాంక్ యాదవ్ ..


బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరగనున్న టీ20 స్క్వాడ్ లోకి తొలిసారిగా భారత ఫాస్టెస్ బౌలర్ గా గుర్తింపు పొందిన మయాంక్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) లో దాదాపు ఐదు నెలల శిక్షణ తరువాత అతను ఫిట్ నెస్ సాధించి జట్టులో చేరాడు.

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టులో అందరూ యువ ఆటగాళ్లే ఉన్నారు. ఒక్క హర్డిక్ పాండ్యా మాత్రమే జట్టులో సీనియర్ సభ్యుడు. మిగిలిన వాళ్లంతా ఐపీఎల్ లో ఉత్తమ ప్రదర్శన చేసిన వాళ్లే. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా చాలా కాలం తరువాత జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2021లో UAEలో జరిగిన T20 ప్రపంచ కప్ జరిగిన మూడేళ్లకు గానీ అతడికి చోటు దక్కలేదు.
పాండ్యా, శివమ్ దూబే తర్వాత బ్యాక్-అప్ సీమర్ ఆల్ రౌండర్ అయిన నితీష్ రెడ్డిని కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవలి జింబాబ్వే టూర్‌కు ఎంపికయిన నితీష్ పొత్తి కడుపులో హెర్నియా తో టూర్ కు చివరి క్షణంలో దూరమయ్యాడు.
రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు 15 మంది సభ్యుల జట్టులో చోటు సంపాదించారు, సంజూ శాంసన్, జితేష్ శర్మ వికెట్ కీపర్ కోటాలో జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే బీసీసీఐ ని కాదని దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్థాంతరంగా తప్పుకున్న ఇషాన్ కిషన్ కు జట్టులో చోటు దక్కలేదు.
ఫాస్టెస్ట్ బౌలింగ్..
గత ఐపీఎల్ లో నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించిన మయాంక్ యాదవ్, తాను ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. వేగానికి తోడు కచ్చితత్వం, నిలకడగా బంతుల వేసి అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ కు గడగడలాడించాడు. తరువాత ఐపిఎల్ మధ్యలో మయాంక్ పొత్తికడుపు ఒత్తిడి కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. తరువాత బెంగళూర్ లోని ఎన్సీఏ లో చేరిన మయాంక్ అక్కడ చికిత్స తీసుకున్నాడు. కొన్ని నెలల అనంతరం NCAలో రోజుకు 14-15 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు.
అయితే, రంజీ ట్రోఫీలో రెడ్ బాల్ ఫార్మాట్‌లోకి ప్రవేశించే ముందు, బంగ్లాదేశ్ సిరీస్ జాతీయ సెలక్షన్ కమిటీ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అంతర్జాతీయ స్థాయిలో అతను బౌలింగ్ చేయడానికి కంఫర్ట్ గా ఉన్నాడా లేదా అని పరీక్షించడానికే ఈ సిరీస్ కు ఎంపిక చేశారా అన్నది తెలియాల్సి ఉంది. అతని శరీరం బాగా సహకరిస్తే, అతనిని నెమ్మదిగా సుదీర్ఘ ఫార్మాట్లలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే అతను ఎక్కువ కాలం భారత క్రికెట్‌కు సేవ చేసే అవకాశంగా పరిగణించబడుతుంది.
గంభీర్ మార్గదర్శకత్వంలో ఐపీఎల్ లో కేకేఆర్ విజయవంతమైంది. ఈ టీంలో మిస్టరీ స్పిన్నర్ గా వరుణ్ కు పేరుంది. అందుకే గంభీర్ ఇప్పుడు జట్టులోకి తీసుకొచ్చాడని క్రీడా విశ్లేషకులు చెబుతున్న మాట. ఏది ఏమైనప్పటికీ, గంభీర్ చక్రవర్తి కోసం చాలా ఆసక్తిగా ఉన్నాడని అర్థం అవుతుంది, అతను ప్రధానంగా తెలివిగా బ్యాట్స్ మెన్లను బొల్తా కొట్టిస్తాడు. వేగంగా లెగ్-బ్రేక్‌లను బౌలింగ్ చేస్తాడు. బంగ్లాదేశ్‌తో గ్వాలియర్ (అక్టోబర్ 6), న్యూఢిల్లీ (అక్టోబర్ 9), హైదరాబాద్ (అక్టోబర్ 12)లో భారత్ మూడు టీ20లు ఆడనుంది.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (wk), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.


Read More
Next Story