కివీస్ గెలిచి పాక్ ను ఇంటికి పంపించిందా?
x
ఇరు జట్ల ఆటగాళ్లు

కివీస్ గెలిచి పాక్ ను ఇంటికి పంపించిందా?

సూపర్ 8 లో ఆతిథ్య లంకకు షాక్ ఇచ్చిన న్యూజిలాండ్


Click the Play button to hear this message in audio format

టీ20 ప్రపంచకప్ లో పాక్ కు దారులు మూసుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ లో సూపర్ ఎయిట్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక చిత్తయింది. దీనితో ఈ గ్రూపు లో ఉన్న పాక్ కు సెమీస్ కు చేరడం కష్టంగా మారింది.

కివీస్ ఏకంగా 61 పరుగుల తేడాతో మట్టికరిపించి సెమీస్ రేస్ ను ఆసక్తికరంగా మార్చింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శనక బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అది తప్పని తేలింది.

పతనం అంచు నుంచి..

మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 168/7 పరుగులు చేసింది. ఒక దశలో న్యూజిలాండ్ 75/2 నుంచి 84/6 కు చేరింది. ఆ జట్టు ఆడే తీరు చూస్తే కనీసం వంద అయినా దాటుతుందా అనిపించింది. కానీ కెప్టెన్ మిచెల్ సాంటర్న్(47) లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కెప్టెన్ మరో యువ ఆటగాడు కోలే మెక్ కాంచీ(31) తో కలిసి ఏడో వికెట్ కు 84 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఇక్కడే మ్యాచ్ కివీస్ చేతికి వచ్చింది. లంక బౌలర్లలో స్పిన్నర్ తీక్షణ, చమీరా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

చేతులేత్తెసిన శ్రీలంక..

స్లో పిచ్ పై 169 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు మొదటి బంతికే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న పాథుమ్ నిశాంకను మ్యాట్ హెన్రీ క్లీన్ బౌల్డ్ చేశాడు. పవర్ ప్లే ముగిసే నాటికి 20/2 తో ఓటమి వైపు ప్రయాణించింది. ఇక స్పిన్నర్లు బరిలోకి దిగడంతో లంక ఏ దిశలోనే లక్ష్యం వైపు కదలలేదు. కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించుకోవడానికే ఆడినట్లు అనిపించింది.
కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. లంక జట్టులో కమిందు మెండిస్ మాత్రమే 31 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీనితో ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు మెరుగుపరుచుకోగా, పాక్ అవకాశాలు క్లిష్టంగా మారాయి.
Read More
Next Story