కొత్త అవతారంలోకి దినేష్ కార్తీక్.. ఇక నుంచి ఐపీఎల్లో
x

కొత్త అవతారంలోకి దినేష్ కార్తీక్.. ఇక నుంచి ఐపీఎల్లో

మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ దినేష్ కార్తీక్ మరోసారి ఐపీఎల్ లో తన సేవలు కొనసాగించబోతున్నాడు. తనను బ్యాటింగ్ కోచ్ గా నియమించుకున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది


ఐపీఎల్ నుంచి తాజాగా రిటైర్ మెంట్ ప్రకటించిన భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ దినేష్ కార్తీక్ ఇప్పుడు కొత్త అవతారంలోకి మారిపోయాడు. ఇక నుంచి ఐపీఎల్ లోనే బెంగళూర్ టీమ్ కు బ్యాటింగ్ కోచ్, మెంటార్ గా వ్యవహరించబోతున్నాడని ఫ్రాంచైజీ ప్రకటించింది. RCB తరపున ఆడిన కార్తీక్, మేలో IPL 2024 పూర్తయిన తర్వాత రిటైరయ్యాడు.

"మా కీపర్ దినేష్ కార్తీని ఇప్పుడు కొత్త కోణంలోనూ స్వాగతించండి, సరికొత్త అవతార్‌లో RCBలోకి తిరిగి రావాలి. RCB పురుషుల జట్టుకు డీకే బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా ఉంటారు. మనం మనిషిని క్రికెట్ నుంచి తీయచ్చు కానీ అతని నుంచి క్రికెట్‌ను తీయలేం’’ అని ఆర్సీబీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.
కార్తీక్ స్పందన..
ఇది ఒక సువర్ణ అవకాశంగా దినేష్ కార్తీక్ అన్నాడు. ‘ ఇది నా జీవితంలో కొత్త అధ్యాయం, ప్రొఫెషనల్ స్థాయిలో కోచింగ్ చేయడం నాకు చాలా సంతోషానిస్తోంది. నేను ఈ కొత్త అవతారం కోసం సంతోషంగా వేచి చూస్తున్నాను. ఆటగాడిగా నా అనుభవం ఇందుకు దోహాదపడుతుందని ఆశిస్తున్నా’ అని అన్నాడు.
"క్రికెట్ లో విజయం సాంకేతిక నైపుణ్యంపైనే కాకుండా మ్యాచ్ తెలివితేటలు, ప్రశాంతతపై కూడా ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. మా బ్యాటింగ్ గ్రూప్‌కు కోచ్, మెంటార్‌గా ఉండటానికి నేను ఎదురుచూస్తున్నాను. బ్యాటింగ్ పద్ధతిని మెరుగుపరచడమే కాకుండా రాణించడానికి అవసరమైన మ్యాచ్ అవగాహనను పెంపొందించడానికి, ఒత్తిడిలో ఉన్న వారికి సాయపడతాను.
ఆర్సీబీతో ఉన్న నా అనుబంధాన్ని కొనసాగించడం గొప్ప విషయం అని ఆర్సీబీ విడుదల చేసిన ప్రకటనలో కార్తీక్ పేర్కొన్నాడు. గత సీజన్ లో వ్యాఖ్యాతగా, ఆటగాడిగా వ్యవహరించిన దినేష్ కార్తీక్ ఆర్సీబీకి ఫినిషింగ్ పాత్రను పోషించాడు.
187.36 భారీ స్ట్రైక్ రేట్‌తో 36.22 సగటుతో 326 పరుగులు చేశాడు. IPL 2024 ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో RCB ఓడిపోయిన తర్వాత రిటైర్ అయ్యాడు.
మొత్తంమీద, వికెట్ కీపర్-బ్యాటర్ ఐపిఎల్‌లో ఐదు ఫ్రాంచైజీలు, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, RCB ప్రాతినిధ్యం వహిస్తూ 257 మ్యాచ్‌లు ఆడాడు. 26.32 సగటుతో 4,842 పరుగులు చేశాడు.
భారత్ తరఫున కార్తీక్ 94 ODI మ్యాచ్‌లలో 1,752 పరుగులు సాధించాడు. అందులో తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. 26 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి, బంగ్లాదేశ్‌పై సెంచరీతో సహా 1,025 పరుగులు చేశాడు. 60 T20Iలలో, 142 స్ట్రైక్-రేట్‌తో 26.38 సగటుతో 686 పరుగులు చేశాడు.
కార్తీక్ నియామకం గురించి RCB క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ మాట్లాడుతూ, అతను కోచ్‌గా కూడా అంతే ప్రభావం చూపుతాడని చెప్పాడు. "ఆటగాడిగా అతని ట్రాక్ రికార్డ్, నైపుణ్యం, అంకితభావం గురించి మాట్లాడుతుంది. ఈ కొత్త వృత్తిపరమైన అధ్యాయానికి అతను అదే నిబద్ధతను తీసుకువస్తాడని నాకు తెలుసు" అని బోబాట్ చెప్పారు.
"అంతర్జాతీయ క్రికెట్, IPL రెండింటిలోనూ DK అనుభవాలు, RCBకి అతనిని ఒక పెద్ద ఆస్తిగా మార్చాయి. అతని నైపుణ్యం వల్ల మా ఆటగాళ్లు ఎంతో ప్రయోజనం పొందుతారనడంలో నాకు సందేహం లేదు." అని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 17 సీజన్లలో RCB ఇంకా IPL టైటిల్ గెలవలేదు.

Read More
Next Story