
భారత క్రికెట్ జట్టు
టీమ్ ఇండియా స్పాన్సర్ షిప్ నుంచి వైదొలిగిన ‘డ్రీమ్ 11’
పార్లమెంట్ లో ఆన్ లైన్ గేమింగ్ ఆమోదం పొందటంతో తప్పుకున్న కంపెనీ
పార్లమెంట్ ‘ఆన్ లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యూలేషన్ బిల్లు 2025’ ఆమోదించిన తరువాత ఫాంటసీ స్పోర్ట్స్ దిగ్గజం డ్రీమ్ 11 భారత క్రికెట్ కు టైటిల్ స్పాన్సర్ షిప్ ను కొనసాగించలేమని బీసీసీఐకి తెలియజేసింది. తమ ఆదాయ మార్గాలు పూర్తిగా మూసుకుపోవడంతో వేరే దారి లేదని తెలిపినట్లు సమాచారం.
క్రికెట్ ఆదాయంపై ప్రభావం..
ఈ బిల్లు కారణంగా కొత్త బిల్లు క్రికెట్ ఆదాయ ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే డ్రీమ్ 11, మై11 సర్కిల్ సంయుక్తంగా భారత క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ షిప్ ద్వారా బీసీసీఐకి సుమారు రూ. 1000 కోట్లు చెల్లిస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్ గా ఉండటానికి డ్రీమ్ 11 కంపెనీ 2023- 26 సంవత్సరానికి 44 మిలియన్ యూఎస్ డాలర్లు(రూ. 358 కోట్లు) ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇది ఇండియన్ సూపర్ లీగ్ అధికారిక ఫాంటసీ భాగస్వామి కూడా. అయితే ఎవరూ ఆన్ లైన్ మనీ గేమింగ్ సేవలను అందించడంలో సాయం, ప్రొత్సాహం, ప్రేరేపించడం, పాల్గొనడం, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆన్ లైన్ మనీ గేమ్ ఆడటానికి ప్రొత్సహించే ప్రకటనలో పాల్గొనకూడదు’’ అని పేర్కొంటూ ప్రభుత్వం బిల్లు ఆమోదించింది. ఇది గేమింగ్ కంపెనీలకు చెక్ పెట్టినట్లు అయింది.
డ్రీమ్ 11 ఇకపై భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్ ఉండబోవట్లేదని ప్రకటించడంతో బీసీసీఐ స్పాన్సర్ల వేటను ప్రారంభించింది. వచ్చే ఆసియా కప్ నాటికి ఇది ఖరారు అయ్యే అవకాశం కనిపించడం లేదు.
ఇటీవల ఆమోదించిన ఆన్ లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యూలేషన్ చట్టం కింద ప్రభుత్వం రియల్ మనీ గేమింగ్ ను నిషేధించిన తరువాత పురుషుల ఆసియా కప్ నుంచి భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్ గా డ్రీమ్ 11 కొనసాగట్లేదు.
వార్తలను ధృవీకరించిన బీసీసీఐ
డ్రీమ్ 11 తో ఒప్పందం ముగిసినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధృవీకరించారు. వివిధ జాతీయ జట్లకు కొత్త టైటిల్ స్పాన్సర్ ను తీసుకోవడానికి బీసీసీఐ ప్రక్రియను ప్రారంభిస్తుంది.
‘‘మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ప్రభుత్వ నిబంధనలు అమలులో ఉన్నందున బీసీసీఐ డ్రీమ్ 11 లేదా అలాంటి ఇతర గేమింగ్ కంపెనీతో తన స్పాన్సర్ షిప్ సంబంధాన్ని కొనసాగించదు. కొత్త పరిమితుల ప్రకారం.. అటువంటి అవకాశం లేదు. డ్రీమ్ 11 తో మేము రోడ్ బ్లాక్ ను ఎదుర్కొంటున్నాము’’ అని సైకియా పిటీఐకి చెప్పారు.
‘‘కాబట్టి మేము వారితో కొనసాగలేము. అందువల్ల కొన్ని ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది. స్పాన్సర్ ఖాళీ స్థానాన్ని మేము భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పటి వరకూ ఏదీ పూర్తి కాలేదు. ఏదైన జరిగితే మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తాము’’ అని చెప్పారు.
ఫాంటసీ క్రీడలకు దెబ్బ..
ఈ నిషేధం అన్ని ఫాంటసీ గేమింగ్ కంపెనీల ఆదాయా మార్గాలను ప్రభావితం చేసింది. ‘‘ఎవరూ ఆన్ లైన్ మనీ గేమింగ్ సేవలను అందించడంలో సాయం చేయకూడదు, ప్రొత్సహించకూడదు, పాల్గొనకూడదు లేదా ఏదైనా ఆన్ లైన్ మనీ గేమ్ ఆడటానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రొత్సహించే ఏ ప్రకటనలోనూ పాల్గొనకూడదు’’ అని చట్టం పేర్కొంది.
ఉల్లంఘనకు పాల్పడితే కోటి రూపాయల వరకూ ఆర్థిక జరిమానా లేదా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని చట్టం స్పష్టం చేసింది. డ్రీమ్ 11 నిష్క్రమణతో మరో కంపెనీ మై11 సర్కిల్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫాంటసీ స్పోర్స్ట్ భాగస్వామిగా కొనసాగలేదు. మై 11 సర్కిల్ ఐదేళ్ల కాలానికి రూ. 625 కోట్లు చెల్లిస్తామని హమీ ఇచ్చింది.
Next Story