బుమ్రా బౌలింగులో గవాస్కర్ సలహా పాటిస్తే తిరుగుండదు
x
Jaspreet Bumra

బుమ్రా బౌలింగులో గవాస్కర్ సలహా పాటిస్తే తిరుగుండదు

ఇపుడు జరుగుతున్న టీ20 టోర్నమెంటులో మూడు మ్యాచుల నుండి బుమ్రా మొదటి ఛేంజ్ బౌలర్ గా వస్తున్నాడు


గురువారం ఇంగ్లాండుతో జరగబోయే భారత్ సెమీఫైనల్స్ మ్యాచ్ కు వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మంచి సలహా ఇచ్చాడు. అదేమిటంటే మీడియం పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. మామూలుగా అయితే బుమ్రా కొత్తబంతితో బౌలింగ్ మొదలుపెడతాడు. అయితే ఇపుడు జరుగుతున్న టీ20 టోర్నమెంటులో మాత్రం బుమ్రా మొదటి ఛేంజ్ బౌలర్ గా వస్తున్నాడు. అంటే మ్యాచ్ ప్రారంభంలో చెరో ఎండ్ నుండి ఒక స్పిన్నర్ మరో పేస్ బౌలర్ బౌలింగ్ దాడిని మొదలుపెడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని మార్చాలంటే అప్పుడు బుమ్రా బౌలింగ్ లోకి దిగుతున్నాడు.

బుమ్రా బౌలింగులోకి దిగేటప్పటికి బ్యాట్స్ మెన్ కనీసం 6 ఓవర్లు ఆడేసుంటున్నారు. దాంతో అప్పటికే పిచ్ కి అలివాటు పడిన బ్యాట్స్ మెన్ బుమ్రాను చాలా ఈజీగా ఆడేస్తున్నారు. ఇక్కడే గవాస్కర్ మేనేజ్మెంట్ కు సలహా ఇచ్చాడు. అదేమిటంటే బుమ్రాను ఛేంజ్ బౌలర్ గా కాకుండా కొత్తబంతితో మొదట్లోనే బౌలింగ్ చేయించాలని. కొత్తబంతితో బౌలింగ్ వేయటంలో బుమ్రా రూటే సపరేటుగా ఉంటుందని అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన బౌలింగ్ తో ఎక్కువగా యార్కర్ బంతులతో బ్యాట్స్ మెన్ ను బుమ్రా బాగా ఇబ్బంది పెట్టగలడు. ఈ విషయం తెలిసికూడా మేనేజ్మెంట్ ఎందుకనో సడెన్ గా బుమ్రాను ఛేంజ్ బౌలర్ గా మార్చేసింది. ఇదే విషయంలో గవాస్కర్ తన ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశాడు.


నిజానికి టీ20 టోర్నమెంటు అంటేనే బ్యాటర్ల కోసం రూపొందించిన టోర్నమెంట్ అన్న విషయం తెలిసిందే. ఇలాంటి టోర్నమెంటులో బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయాలని, పరుగులు ఇవ్వకుండా వికెట్లు తీసుకోవాలని ఆశించటం అత్యాసే అవుతుంది. ఈ టోర్నమెంటులో బుమ్రా మొదటి మ్యాచుల్లో కొత్త బంతితో బౌలింగ్ చేసినా పెద్దగా వికెట్లు తీసుకోలేదు. అయితే కొత్తబంతితో అయితేనే బుమ్రా బాగా బౌలింగ్ చేయగలడు అన్న విషయాన్ని మరచిపోకూడదు. ఈమధ్య జరిగిన కొన్ని సర్జరీలు కూడా బుమ్రా బౌలింగ్ యాక్షన్ ను మార్చేసింది. అయినా సరే కొత్తబంతితో బుమ్రా చేసే బౌలింగే బెస్ట్ అని చెప్పక తప్పదు.

బుమ్రా గనుక మొదట్లోనే బౌలింగుకు దిగితే బ్యాట్స్ మెన్ వైవిధ్యమైన బంతులను ఎదుర్కోవటంలో ఇబ్బందులు పడటం ఖాయమని గవాస్కర్ అంచనా వేశాడు. కొత్తబంతితో అందులోను బుమ్రావేసే పదునైన యార్కర్లను ఎదుర్కోవటం ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని గవాస్కర్ చెప్పాడు. కాబట్టి ఛేంజ్ బౌలర్ గా కాకుండా కొత్తబంతితో బుమ్రాతోనే బౌలింగ్ దాడి మొదలుపెట్టించాలన్నది గవాస్కర్ మేనేజ్మెంట్ కు ఇచ్చిన సూచన. గవాస్కర్ ఇచ్చిన సూచన నిజంగానే చాలా బాగుంది. బుమ్రా బౌలింగ్ మొదలుపెట్టకపోవటంతో అభిమానులు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మేనేజ్మెంట్ ఇలా ఎందుకు బౌలింగ్ మార్చేసిందో ఇప్పటికీ అర్ధంకావటంలేదు. మరి గవాస్కర్ సూచనను మేనేజ్మెంట్ పరిగణలోకి తీసుకుంటుందా ?

Read More
Next Story