షేక్ హ్యాండ్ వివాదం: పాక్ ఫిర్యాదును తిరస్కరించిన ఐసీసీ
x
టాస్ వేస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్

షేక్ హ్యాండ్ వివాదం: పాక్ ఫిర్యాదును తిరస్కరించిన ఐసీసీ

పాక్ క్రికెట్ మరో తీవ్ర అవమానం


భారత్ ఆటగాళ్లు, పాక్ ఆటగాళ్లలో కరచాలనం చేయకుండా ఉండటంపై పాక్ చేసిన పెడబొబ్బలకు ఐసీసీ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. మ్యాచ్ రిఫరీ గా వ్యవహరించిన ఆండ్రీ పైక్రాప్ట్ ను తొలగించాలని దాని డిమాండ్ ను క్రికెట్ కౌన్సిల్ తిరస్కరించింది. టోర్నీ నుంచి వైదొలుగుతానని వ్యవహరించినప్పటికీ ఐసీసీ ఏ మాత్రం లెక్క చేయలేదు.

ఆదివారం దుబాయ్ వేదికగా ఆసియా కప్ లో భారత్- పాకిస్తాన్ తలపడ్డాయి. టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కరచాలనం చేయవద్దని పైక్రాప్ట్ తన కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను కోరినట్లు పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు ను తిరస్కరించినట్లు ఐసీసీ పేర్కొంది. ‘‘నిన్న రాత్రి ఐసీసీ పైక్రాప్ట్ ను తొలగించబోమని, పాక్ విజ్ఞప్తిని తిరస్కరించామని పేర్కొంటై పీసీబీకి సమాధానం పంపించాము’’ అని ఐసీసీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. పైక్రాప్ట్ బుధవారం యూఏఈతో పాక్ ఆడే చివరి మ్యాచ్ లో అంపైర్ గా వ్యవహరించబోతున్నాడు.
పాక్ జట్టు మేనేజర్ ఫిర్యాదు..
పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవేద్ చీమా కూడా ఆసియా క్రికెట్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు. పైక్రాప్ట్ పట్టుబట్టడం వల్ల ఆదివారం ఇద్దరు కెప్టెన్ల మధ్య షీట్లు మార్పిడి జరగలేదని ఆరోపించారు. భారత్ ఈ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
ఈ విజయాన్ని పహల్గామ్ ఉగ్రవాద దాడి, బాధిత కుటుంబాలకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంకితం చేశారు. అలాగే ప్రత్యర్థి దేశం ఆటగాళ్లతో కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. తదపరి పాక్ తో జరిగే అన్ని మ్యాచ్ లలో ఇలాగే ఇది కొనసాగుతుందని జట్టు మేనేజ్ మెంట్ ప్రకటించింది.
పైక్రాప్ట్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ లోని సీనియర్ మ్యాచ్ రిఫరీలలో ఒకరు. ఆయన ఇప్పటి వరకూ 695 అంతర్జాతీయ మ్యాచ్ లు ఉన్నాయి. టోర్నమెంట్ సమయంలో పాటించాల్సిన నియమాలు, నిబంధనల గురించి పీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఉస్మాన్ వాల్హా తన సొంత కెప్టెన్ కు తెలియజేయకపోవడంపై వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తరువాత తెలిసింది.
పీసీబీ అధికారిపై వేటు..
జాతీయ క్రికెట్ జట్టు, కెప్టెన్ కు జరిగిన అవమానానికి కారణమైన వాల్హాను తొలగించాలని పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మొహ్ సిన్ నఖ్వీ ఆదేశించారు. ‘‘హ్యాండ్ షేక్ నో’’ విధానం గురించి సల్మాన్ కు తెలియజేయడం వాల్హా విధి. కానీ అతను అలా చేయలేదు. పాకిస్తాన్ కెప్టెన్ జరిగిన సంఘటన గురించి తెలిసి ఆశ్చర్యపోయాడు.
టాస్ సమయంలోనే వాల్హా ఒక ప్రకటన విడుదల చేసి ఉండాల్సింది. ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు. నఖ్వీ దానిని సరిగ్గా నిర్వహించకపోవడంతో అతను కోపంగా ఉన్నాడని పీసీబీ వర్గాలు తెలిపాయి.
పీసీబీ లక్ష్యం..
పైక్రాప్ట్ ను టోర్నీ నుంచి తొలగించాలని పీసీబీ కోరుకుంది. కానీ ఇప్పుడు ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉన్నారు. పాక్ డిమాండ్ ను ఐసీసీ తిరస్కరించింది. ఇక వారు ఆడటం కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. పైక్రాప్ట్ తమ మ్యాచ్ లో అంపైరింగ్ చేయడానికి పీసీబీ ఒక గౌరవనీయమైన పరిష్కరం చూపడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.
ఎక్స్ పోస్ట్ తొలగింపు..
ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మెహ్ సిన్ నఖ్వీ ఎక్స్ లో తన పోస్ట్ ను తొలగించడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. పాకిస్తాన్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాప్ట్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కి అధికారికంగా ఫిర్యాదు చేసిందని నఖ్వీ అందులో ఆరోపించారు.
మ్యాచ్ కు ముందు ఇద్దరు కెప్టెన్లు షేక్ హ్యాండ్ చేయవద్దని పైక్రాప్ట్ ఆదేశించారని, ఈ చర్య ఐసీసీ ప్రవర్తనా నియామవళి, ఎంసీసీ చట్టాలలో పేర్కొన్న క్రికెట్ స్ఫూర్తిని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు.
ఆసియా కప్ 2025 మిగిలిన ఆటకు సంబంధించి పైక్రాప్ట్ ను వెంటనే తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసినట్లు నఖ్వీ చెప్పారు. కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ ను ఆయన డిలీట్ చేశారు.
Read More
Next Story