అగ్రస్థానానికి చేరుకున్న టీమిండియా ఆల్ రౌండర్
x

అగ్రస్థానానికి చేరుకున్న టీమిండియా ఆల్ రౌండర్

టీ20 వరల్డ్ కప్ లో అదరగొట్టిన వైస్ కెప్టెన్ హార్డిక్ పాండ్యా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్ లో అదరగొట్టాడు. పాండ్యాతో పాటు మరో భారత ఆటగాడు కూడా ఏకంగా పది స్థానాలు


టీమిండియా వైస్ కెప్టెన్, టీ20 వరల్డ్ కప్ లో అదరగొట్టిన హర్డిక్ పాండ్యా తన కెరీర్ లో అత్యున్నత ర్యాంక్ అందుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్, ఆల్ రౌండర్ల విభాగంలో నెంబర్ వన్ ర్యాంక్ ను అందుకున్నాడు. శ్రీలంక కెప్టెన్ వాయినీడు హసరంగ తో కలిసి పాండ్యా సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. ఇద్దరి ఖాతాలో 222 పాయింట్లు ఉన్నాయి. భారత్ నుంచి అనేక మంది ఆటగాళ్లు కూడా తమ ర్యాంక్ లను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు.

జులై 29న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో హాఫ్ సెంచరీలు చేసిన హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌లను ఔట్ చేయడం ద్వారా దక్షిణాఫ్రికాకు కు కళ్లెం వేయడంలో సఫలీకృతుడయ్యాడు. ఫైనల్లో పాండ్యా 3/20 తో ఉత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. దీంతో రెండు స్థానాలు ఎగబాకీ అల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత అభిమానుల చేత తీవ్రంగా ట్రోలింగ్ కు గురయ్యాడు. తన ఆటతీరు కూడా ఐపీఎల్ లో మారిపోయింది. పాండ్యాను వరల్డ్ కప్ లో తీసుకోవడం అవసరమా అన్న చర్చ కూడా జరిగింది. కానీ పాండ్యా ఒక్కసారి తన బ్లూ జెర్సీ వేసుకోగానే తన ఆటతీరు మొత్తం మారిపోయింది. కరేబియన్ దీవుల్లో 17 ఏళ్ల తరువాత కప్ గెలవడంలో పాండ్యా కీలక పాత్ర పోషించాడు.
పాండ్యా బ్యాట్‌తో ప్రభావవంతమైన పాత్రలు పోషించాడు. జట్టుకు అవసరమైనప్పుడు బంతితో రాణించాడు. అతను 150 కంటే ఎక్కువ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు సాధించాడు. టోర్నమెంట్‌లో 11 వికెట్లు కూడా తీసుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్లో క్లాసెన్ బ్యాట్ చెలరేగిపోయినప్పుడు భారత్ బౌలింగ్ మొత్తం చెల్లాచెదురు అయింది.
దక్షిణాఫ్రికా కేవలం 30 బంతుల్లో 30 పరుగులు చేస్తే చాలు.. కప్ వారి సొంతమవుతుంది. ఈ సందర్భంలో బౌలింగ్ కు దిగిన పాండ్యా ఆఫ్ సైడ్ లో స్లో బాల్ సంధించి క్లాసెన్ బొల్తా కొట్టించి పెవిలియన్ పంపాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా టర్న్ అయింది. అలాగే చివరి ఓవర్ లో 16 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గెలుస్తుంది. క్రీజులో ప్రమాదకర డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. కానీ పాండ్యా వేసిన ఫుల్ టాస్ బౌండరీ లైన్ దాటించే సమయంలో సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్బుత క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. అదే ఓవర్లో రబాడాను సైతం వెనక్కి పంపి కప్ ను అందించాడు.
బూమ్రా ఎన్ని స్థానాలు..
టీ20 ప్రపంచకప్‌లో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 12 స్థానాలు ఎగబాకి టాప్-10కి చేరాడు. T20I ఆల్-రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మొదటి 10 స్థానాల్లో కూడా మార్పులు ఉన్నాయి. మార్కస్ స్టోయినిస్, సికందర్ రజా, షకీబ్ అల్ హసన్ లియామ్ లివింగ్‌స్టోన్ ఒక్కో స్థానంతో ఎగబాకారు. మహ్మద్ నబీ నాలుగు స్థానాలు దిగజారాడు.
T20I బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో, దక్షిణాఫ్రికా ఆటగాడు అన్రిచ్ నార్ట్జే ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమంగా రెండవ స్థానానికి చేరుకున్నాడు. ఆదిల్ రషీద్ 675 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
Read More
Next Story