
రొమారియో షెఫర్డ్
ఆ ఒక్క బాల్ కి షెపర్డ్ 22 రన్స్ ఎలా చేశారంటే..
ఆశ్చర్యపోకండి.. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ (Romario Shepherd) ఒక్క బంతికి 22 పరుగులు చేశారు
అందుకే దీన్ని క్రికెట్ అంటారేమో.. అద్భుతాలు ఈ ఆటకే సాధ్యమనుకుంటా.. చివరి దాకా గెలిచే వాళ్లు ఓడుతుంటారు, ఓడే వాళ్లు గెలుస్తుంటారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో భాగంగా బుధవారం గయానా అమెజాన్ వారియర్స్ జట్టు, సెయింట్ లూసియా జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఓ అద్భుతం జరిగింది.
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ (Romario Shepherd) ఈ అద్భుతాన్ని చేశాడు. ఒక్క బంతికి 22 పరుగులు రాబట్టారు. ఆశ్చర్యపోకండి.. ఇదెలాగంటే..
15వ ఓవర్‌లో 7వ బ్యాటర్ గా వచ్చిన రొమారియో షెఫర్డ్ కి బౌలర్ థామస్ వేసిన మూడో బంతి నోబాల్ అయింది. అయితే ఈ బాల్ కి పరుగులేమీ రాలేదు. ఆ తర్వాతి ఫ్రీహిట్.. వైడ్‌గా వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఫ్రీహిట్ వచ్చింది. ఆ బాల్ ను షెఫర్డ్ భారీ సిక్స్ కొట్టాడు. అయితే అది కూడా నోబాలే. దీంతో ఆ తర్వాతి బంతినీ బ్యాటర్ బౌండరీ లైన్ ఆవలకు తరలించాడు. ఇక్కడ దురదృష్టం మరోసారి బౌలర్‌ని వెంటాడింది. అది కూడా నోబాల్‌గా తేలింది. దీంతో మూడో ఫ్రీహిట్‌నూ షెఫర్డ్ ఉపయోగించుకుని.. సునాయాసంగా సిక్స్ బాదాడు. దీంతో ఒక్క బాల్ కి మొత్తం 22 పరుగులు వచ్చినట్లైంది. ఇలా షెఫర్డ్ 34 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్స్‌లు ఉన్నాయి.
రోమారియో షెఫర్డ్ గత ఐపీఎల్ (IPL)లో ఆర్సీబీ (Royal Challengers Bengaluru) తరఫున ఆడారు. చెన్నైతో జరిగిన ఓ మ్యాచ్‌లో 14 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇది. యశస్వి జైస్వాల్ 13 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.
ఒక్క బాల్ కి 22 పరుగులు చేసి రొమారియో షెఫర్డ్ ను క్రీడాభిమానులు అభినందలనతో ముంచెత్తారు. ఇప్పుడా వీడియో క్రీడా ప్రపంచంలో బాగా వైరల్ అవుతోంది.
Next Story