సూపర్ ఎయిట్ కు చేరిన భారత్, ఇంటి ముఖం పట్టిన పాక్..
x

సూపర్ ఎయిట్ కు చేరిన భారత్, ఇంటి ముఖం పట్టిన పాక్..

అమెరికా- వెస్టీండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ లో భారత్ సూపర్ ఎయిట్ దశకు చేరింది. మరోవైపు పాక్, న్యూజిలాండ్ జట్లు ఈ టోర్నీ నుంచి..


యూఎస్ఏ- వెస్టీండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ నుంచి శుక్రవారం మాజీ చాంఫియన్ పాకిస్తాన్, న్యూజిలాండ్ నిష్క్రమించాయి. అమెరికా- ఐర్లాండ్ మధ్య జరిగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సూపర్ ఎయిట్ కు యూఎస్ఏ అర్హత సాధించింది. దీనితో పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లాయి.

అమెరికా చేతిలో పాకిస్థాన్ సూపర్ ఓవర్ లో ఓడిపోయింది. తరువాత జరిగిన మ్యాచ్ లో పాక్ గెలిచినప్పటికీ నెట్ రన్ విషయంలో అమెరికా కంటే వెనకబడి ఉండటంతో దాయాదీ జట్టు ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. పాకిస్తాన్ 2009 లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. గత ఎడిషన్ లో పాకిస్థాన్ రన్నరప్ గా నిలిచింది. అయినప్పటికీ ఈ సీజన్ లో నిరాశజనకంగా ఆడి గ్రూప్ దశ లోనే నిష్ర్కమించింది.
గ్రూప్ దశలో అమెరికా ఐదు పాయింట్లతో గ్రూప్ దశను ముగించింది. పాకిస్తాన్ కు ఐర్లాండ్ తో మరో మ్యాచ్ మిగిలే ఉన్నప్పటికీ ఆ మ్యాచ్ గెలిచిన ఆ జట్టు ఖాతాలో కేవలం నాలుగు పాయింట్లే ఉంటాయి. దీనితో గ్రూప్ దశలోనే ఆజట్టు వెనక్కి తిరగాల్సి వచ్చింది .
గత ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 120 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో చతికిల పడింది. అంతకుముందు డల్లాస్ లో అమెరికా చేతిలో కూడా పాకిస్తాన్ ఓడింది. అయితే అమెరికాలో బాస్కెట్ బాల్ లాంటి గేమ్ లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే ఎన్బీఏ వంటి టోర్నీలు నిర్వహిస్తున్నారు. వాటి తో పాటు క్రికెట్ కు ఆదరణ లభిస్తుందనే ఉద్దేశంతో పొట్టి క్రికెట్ ను ఐసీసీ అమెరికాలో నిర్వహిస్తోంది.
అమెరికా, కెనడాపై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా గ్రాండ్ గా టోర్నీలోకి అడుగుపెట్టింది. అదే ఊపులో పాకిస్తాన్ ను మట్టికరిపించింది. అంతకుముందు బంగ్లాదేశ్ పై టీ20 సిరీస్ ను కూడా అమెరికా గెలుచుకుంది. దాంతో యూఎస్ఏ ధైర్యంగా టోర్నీలోకి అడుగుపెట్టింది.
US టీమ్‌లో ఎనిమిది మంది భారతీయ సంతతికి చెందిన క్రికెటర్లు ఉన్నారు, వారిలో ఎక్కువ మంది తాత్కాలిక H1-B వీసాలపై అమెరికా కంపెనీలలో పని చేయడానికి వచ్చిన వారే. USA లో 180 సంవత్సరాల క్రితం క్రికెట్ మ్యాచ్ జరిగింది. దానిని పునరుద్దరించడానికి ప్రస్తుతం ఐసీసీ ప్రయత్నిస్తోంది. 1844 లో న్యూయార్క్ వేదికగా కెనడా- అమెరికా మధ్య తొలిసారిగా క్రికెట్ మ్యాచ్ జరిగింది.
Read More
Next Story