
స్పిన్నర్ లు తిప్పేశారు.. బ్యాట్స్ మన్ లు బాదేశారు..!
స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర పటేల్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ ను బోల్తా కొట్టించారు. భారత్ కు బోణీ చేశారు
కోల్ కతాలో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో భారత జట్టు సునాయాసంగా విజయాన్ని సాధించింది. భారత దేశ స్పిన్నర్లు ఐదు వికెట్లు తీసి, ఇంగ్లాండ్ తక్కువ స్కోర్ చేయడానికి కారణమైతే... అభిషేక్ వర్మ సంచలన బ్యాటింగ్ తో కేవలం 34 బంతుల్లో 79 పరుగుల సునామీ సృష్టించడంతో.. భారత జట్టు విజయం నల్లేరు మీద నడక అయింది. ఐదు మ్యాచ్ల సిరీస్ లో భారత్ బోణీ చేసింది. కోల్కతాలో పరుగుల వరద పారింది. ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన షమీ ఈ మ్యాచ్లో ఆడలేదు. అయినప్పటికీ హర్షదీప్, హార్దిక్ పాండ్యా తమ పేస్ బౌలింగ్ తో నాలుగు వికెట్లు తీశారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర పటేల్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ ను బోల్తా కొట్టించారు. భారత్ కు బోణీ చేశారు
బాగా ఆడిన బట్లర్
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన ఇంగ్లాండ్ జట్టు.  భారత  స్పిన్ బౌలింగ్ ముందు తలవంచింది. హర్షదీప్ మొదటి వికెట్ తీసుకున్నాడు. నాలుగు  వికెట్లు కోల్పోయినప్పటికీ  ఆస్ట్రేలియా మర్యాదపూర్వకమైన స్కోర్ ను  మెయింటైన్ చేసింది.  మొదటి పది ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును బట్లర్ ఆదుకున్నాడు,  క్రమంగా స్కోర్ ను   పెంచుకుంటూ పోయాడు. జోష్ బట్లర్  నిలకడగా  బ్యాటింగ్  చేస్తూ 12 ఓవర్లో  అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  అయితే అదే ఓవర్లో  బెతెల్ రూపంలో ఇంగ్లాండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది.  తరువాత దిగిన  జోవర్తన్   ఎక్కువసేపు నిలబడలేదు. భారత జట్టు   వైస్ కెప్టెన్ అక్సర్ బౌలింగ్లో అవుట్ అయి వెనుతిరిగాడు
ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ బట్లర్ మాత్రం. చక్కటి బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ జట్టు గెలిచే అవకాశాలను మెరుగుపరుస్తూ చివరకు  వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో  మిడ్ వికెట్ లో నితీష్ రెడ్డి కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  నితీష్ రెడ్డి మంచి బ్యాట్స్ మన్ మాత్రమే  కాకుండా మంచి ఫీల్డర్ అని కూడా రుజువు చేశాడు. మిడ్ వికెట్ నుంచి కొంత దూరం పరిగెత్తి బంతి నేలకు తాగే లోపు  బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. దాంతో  కెప్టెన్  బట్లర్ గొప్ప ఇన్నింగ్స్  ముగిసింది. బట్లర్ 44 బంతుల్లో 68 పరుగులు  పరుగులు చేసి జట్టు ఆశావాహమైన స్కోరు చేయడానికి సహకరించాడు.
తర్వాత బ్యాటింగ్ దిగిన రషీద్ బౌలర్ అయినప్పటికీ తన బ్యాటింగ్ తో, ఇంగ్లాండ్ జట్టు జట్టులో చివరి వరకు బాటింగ్ ఉందని  చూపించాడు. ఇంగ్లాండ్ జట్టు నిలకడగా ప్రతి ఓవర్ కి ఆరు పరుగుల రన్ రేట్ ను చివరి వరకు మేనేజ్ చేస్తూ  వచ్చింది .
హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో  ఇంగ్లాండ్ జట్టు  బ్యాట్స్మెన్ ఆర్చర్ ను  అవుట్ చేశాడు.   చివరి ఓవర్ లో సాధించిన 11 పరుగులతో ఇంగ్లాండ్ జట్టు కొంతవరకు  ఆశాజనకమైన 132 పరుగులు సాధించి, అవకాశాన్ని సజీవంగా ఉంచుకుంది.
133 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్  కు దిగిన భారత్ జట్టు దాటిగా ఆడుతూ  మొదటి రెండు ఓవర్లలో నే 23 పరుగులు చేసింది. మొదటి  ఓవర్ లో ఒక్కపరుగే సాధించిన జట్టు, శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్ తో   పరుగుల వరద పారించింది. రెండవ ఓవర్లో శాంసన్ ఒక సిక్స్ 4 ఫోర్ లతో 22 పరుగులు చేయడం తో భారత్ బ్యాటింగ్ ప్రారంభమైంది.  రెండో  ఓవర్ లో భారత బ్యాట్స్మెన్ తమ  మనోగతాన్ని స్పష్టం చేశారు. దానికి నిదర్శనం అభిషేక్ శర్మ  extra cover దిశగా అలవోకగా సాధించిన సిక్సర్.  నింపాదిగా అడడం ఇష్టం లేదని ఇద్దరు ఓపెనర్లు తమ బ్యాటింగ్ తో స్పష్టం చేశారు. 133 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ముగించే ఉద్దేశం కనబడింది.
కొంత ప్రయత్నం చేసిన ఆర్చర్
చివరకు భారతదేశ జట్టు  పరుగుల  వరదకు ఆర్చర్ అడ్డుకట్ట వేశాడు . షార్ట్  పిచ్ బంతిని  మిడ్ వికెట్ మీదగా బౌండరీ దాటించాలన్న ప్రయత్నంలో సింపుల్  క్యాచ్ ఇచ్చి శాంసన్  పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ ఆశలు సజీవంగా ఉంచుతూ జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా శాంసన్ బాటలోనే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొదటి ఓవర్ లో ప్రభావం చూపించలేకపోయిన ఆర్చర్ మూడో ఒవర్ లో రెండు వికెట్లు తీసి మ్యాచ్ ను కాసింత   రసవత్తరంగా మార్చాడు.
పరుగుల సునామి సృష్టించిన అభిషేక్ శర్మ
అభిషేక్ శర్మ బ్యాటింగ్ జోరును అలాగే కొనసాగించాడు.  ఇంగ్లాండ్ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రషీద్ మొదటి ఓవర్లో రెండు సిక్స్ లు కొట్టాడు. రషీద్ ఆ ఓవర్ లో 16 పరుగులు ఇచ్చాడు  ఒక దశలో తిలక్ వర్మ అవుట్ అయ్యే అవకాశాన్ని  ఇంగ్లాండ్ చేజార్చుకుంది.  అభిషేక్ వర్మ కేవలం 20 బంతుల్లో  అర్థ శతకం  సాధించాడు.   ఇంగ్లాండ్ తో ఇది భారత తరఫున  రెండో వేగవంతమైన సెంచరీ.
9 ఓవర్లలో భారత జట్టు 93 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చెల్లింది . దీనికి కారణం అభిషేక్ శర్మ తుఫాను ఇన్నింగ్స్ . సిక్స్ లు,  ఫోర్ ల సునామి సృష్టించాడు. దాంతో పది ఓవర్లలో భారత జట్టు 100 పరుగులు సాధించింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప  భారత జట్టు విజయం నామమాత్రం అయింది.
11 ఓవర్లో అభిషేక్ వర్మ ఇంగ్లాండ్ బౌలర్ ఆ ఆట్కిన్ సన్  బౌలింగ్లో ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి  తన అభిమతాన్ని మరోసారి  స్పష్టం చేశాడు.  మ్యాచ్ ను 15 ఓవర్ల లోపల ముగించాలని నిర్ణయించుకున్నట్లు అనిపించింది. అభిషేక్ శర్మ   ఇంగ్లాండ్ అత్యుత్తమ  బౌలర్ రషీద్ ను ఆడుకున్నాడు.  చివరకు 34 బంతుల్లో 79 పరుగులు చేసి, భారత్ జట్టు విజయాన్ని  నామ మాత్రం చేసి పెవిలియన్  చేరాడు .
భారత జట్టు చివరికి  43 బంతులు మిగిలి ఉండగా కేవలం మూడు వికెట్లు కోల్పోయి అలవోకగా విజయం సాధించింది.
స్కోర్ బోర్డ్:
ఇంగ్లాండ్ బ్యాటింగ్:
132 పరుగులు/10 వికెట్లు (20 ఓవర్లు)
బట్లర్ 68 పరుగులు (44 బంతులు)
భారత్ బౌలింగ్:
హర్ష దీప్ 2 వికెట్లు (4 ఓవర్లు)
హార్దిక్ పాండ్య 2 వికెట్లు (4 ఓవర్లు)
వరున్ చక్రవర్తి 3 వికెట్లు (4 ఓవర్లు)
అక్సర్ పటేల్ 2 వికెట్లు (4 ఓవర్లు)
భారత్ బ్యాటింగ్:
133 పరుగులు/ 3 వికెట్లు (12.5 ఓవర్లు)
అభిషేక్ శర్మ 79 పరుగులు (34 బంతులు)
శాంసన్ 26 పరుగులు (20 బంతులు)
ఇంగ్లాండ్ బౌలింగ్:
ఆర్చర్ 2 వికెట్లు (4 ఓవర్లు)
ఆదిల్ రషిద్ 1 వికెట్ (2 ఓవర్లు)
Next Story




