టీ20 పోరులో పాక్ పై నమీబియాకే భారత్ మద్దతు
x
Pakistan and Namibia captains in T20 Tournament

టీ20 పోరులో పాక్ పై నమీబియాకే భారత్ మద్దతు

నమీబియా టోర్నమెంటు నుండి నిష్క్రమించటమే కాకుండా పాక్ ను కూడా లాక్కెళ్ళిపోతుంది.


టీ 20 టోర్నమెంటులో బుధవారం జరగబోతున్న మ్యాచ్ లో నమీబియా గెలవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు పాకిస్ధాన్-నమీబియా మధ్య కొలంబోలో మ్యాచ్ మొదలవబోతోంది. టోర్నమెంటులో రాజమార్గంలో నిలవాలంటే ఈరోజు నమీబియాతో మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్ దాయాదికి కీలకమే. ఈ టోర్నమెంటులో ఇప్పటికే పాకిస్ధాన్ 3 మ్యాచ్ లు ఆడింది. వీటిల్లో రెండింటిని గెలిచి ఒకదాంట్లో ఓడిపోయింది. అందుకనే పాక్ నెట్ రన్ రేట్ -0.403 ఉంది. ఇక నమీబియా విషయం చూస్తే 3 మ్యాచ్ లు ఆడి అన్నింటిలోను ఓడిపోయింది. అందుకనే ఈ జట్టు నెట్ రన్ రేటు -2.443 ఉంది. అంటే ఈ జట్టు ఆల్రెడీ టోర్నమెంటునుండి బయటకు వెళ్ళిపోయినట్లే. కాబట్టి ఈరోజు మ్యాచ్ లో నమీబియా గెలిచినా ఒకటే ఓడినా ఒకటే.

కాని, పాకిస్ధాన్ కు మాత్రం అలాకాదు. టోర్నమెంటులో నిలవాలంటే పాక్ జట్టు ఈరోజు మ్యాచ్ గెలవాలి. వర్షం కారణంగా డ్రా అయినా టోర్నీలో నిలుస్తుంది కాని రాజమార్గంలో మాత్రం కాదు. మొత్తంమీద మ్యాచ్ గెలిచినా, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా పాక్ రెండో ప్లేసులోకి వస్తుంది. ఎలాగంటే ఇపుడు పాయింట్లను చూసుకుంటే పాక్-అమెరికా జట్లు చెరి 4 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. నమీబియా పైన పాక్ గెలిస్తే 6 పాయింట్లతో రెండో ప్లేసులోకి దూసుకువస్తుంది. అదే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడైనా పాక్ 5 పాయింట్లతో అమెరికాను అధిగమిస్తుంది. అప్పుడు మొదటి ప్లేసులో ఇండియా, రెండో ప్లేసులో పాక్ ఉంటాయి. అమెరికా టోర్నమెంటు నుండి బయటకు వెళిపోతుంది.

భారత్ అభిమానుల కోణం


ఇపుడు విషయం ఏమిటంటే నమీబియా విషయాన్ని పైనే చెప్పుకున్నాము. ఆఖరి మ్యాచ్ లో గెలిచినంత మాత్రాన నమీబియా టోర్నమెంటులో ఏమీ ఉండదు. అందుకని పాక్ పై గెలవటానికి నమీబియా తెగించి ఆడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తెగించి ఆడేటపుడు పాక్ కు షాక్ ఇచ్చిందంటే రెండు జట్లూ టోర్నమెంట్ నుండి బయటకు వెళ్ళిపోవాల్సందే. నమీబియా టోర్నమెంటు నుండి నిష్క్రమించటమే కాకుండా పాక్ ను కూడా లాక్కెళ్ళిపోతుంది. ఇదే జరగాలని భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

టోర్నమెంటులో ఏ రూపంలో కూడా ఇండియాకు పాక్ జట్టు మళ్ళీ ఎదురుపడకూడదని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. క్రికెట్ అంటేనే ‘గేమ్ ఆఫ్ అన్ సర్టెనిటి’ అని అందరికీ తెలుసు. పాక్ జట్టు ఏ రోజు ఎలాగ ఆడుతుందో ఎవరూ ఊహించలేరు. భారత్ జట్టు ఏ టీముతో ఓడినా పర్వాలేదు కాని పాక్ తో మాత్రం ఓడకూడదని సగటు భారత అభిమాని కోరుకుంటారు అనటంలో సందేహంలేదు. దీనికి కారణాలు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

మ్యాచ్ జరగాల్సిందేనా


ఇదంతా జరగాలంటే ముందు కొలంబోలో వర్షంపడకూడదు. వాతావరణ నిపుణుల ప్రకారం ఈరోజు కొలంబోలో వర్షం పడే సూచనలు ఉన్నాయి. అందుకనే ఈరోజు వర్షంపడకుండా మ్యాచ్ సాఫిగా జరగాలని భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. గ్రూప్ ఏ లో మొదటిస్ధానంలో ఇండియా 6 పాయింట్లతో 3.05 నెట్ రన్ రేటుతో మొదటిప్లేసులో ఉంది. రెండో ప్లేసులో 4 పాయింట్లతో +0.787 రన్ రేటుతో రెండో స్ధానంలో ఉంది. మూడో ప్లేసులో పాక్ 4 పాయింట్లు, -0.403 రన్ రేటుతో ఉంది. నెదర్లాండ్స్ 2 పాయింట్లు, -1.352 రన్ రేటుతో నాలుగో ప్లేసులో ఉంది. ఐదో ప్లేసులో 0 పాయింట్లు, -2.433 రన్ రేటుతో నమీబియా ఉంది. మూడో ప్లేసులో ఉన్న పాక్ కు ఐదో ప్లేసులో ఉన్న నమీబియాకు ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్ జరగబోతోంది. అందుకనే నమీబియా తెగించి ఆడే అవకాశముంది. మరి మ్యాచ్ జరిగే విషయంలో భారత అభిమానుల కోరికను వరుణదేవుడు కరుణిస్తాడో లేదో చూడాలి.

పాక్ అభిమానుల కోణంలో

పాక్ అభిమానుల కోణంలో ఈరోజు మ్యాచ్ మరో రకంగా ఉంటుంది. పాక్ గెలిచినా, వర్షం కారణంగా రద్దయినా ఒకటే అన్నట్లుగా పాక్ అభిమానుల్లో ఉంటుంది. అయితే మ్యాచ్ జరిగి తమజట్టు నమీబియా మీద బ్రహ్మాండమైన విజయం సాధించాలని దాయాది అభిమానులు కోరుకుంటున్నారు. నమీబియా మీద గెలవటమే కాకుండా నెట్ రన్ రేటు ఆధారంగా రెండోప్లేసుకు చేరుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. పాక్ గ్రూప్ ఏ లో రెండో ప్లేసుకు చేరుకుంటేనే టోర్నమెంటులో నిలబడుతుంది.

శ్రీలకంలోని పాక్ అభిమానుల్లో చాలామంది ఉదయంనుండే కొలంబోకు చేరకుంటున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. కోలంబోలో జరగబోతున్న మ్యాచ్ లో తమజట్టును ఉత్సాహపరిచేందుకు అభిమానులు స్టేడియంకు చేరకుంటున్నారు. మ్యాచ్ ఏకపక్షంగా జరగాలంటే వర్షం కురవకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. చివరకు ఏమి జరగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story