
మహేంద్ర సింగ్ ధోని
టీ20 ప్రపంచకప్ లో భారత్ ప్రమాదకరమైన జట్టు.. కానీ?
టాస్ కీలక పాత్ర పోషిస్తుందన్న మాజీ కెప్టెన్ ధోని విరాట్ కోహ్లీ, రోహిత్ కు మద్దతుగా వ్యాఖ్యలు
భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పురుషుల టీ20 ప్రపంచకప్ లో భారతే అత్యంత ప్రమాదకర జట్టు అని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డారు. అయితే మ్యాచ్ లు జరిగే సమయంలో కురిసే మంచు ఫలితాలపై ప్రభావం చూపుతుందని ఎంఎస్దీ చెప్పారు.
‘‘ఇది అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటి. మంచి జట్టుకు ఏం కావాలో అన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫార్మాట్ విషయానికి కొస్తే వారికి అనుభవం ఉంది. ఈ అనుభవం విస్తృతమైనది’’ అన్నారు. అన్ని రంగాలలో జట్టు సమతూకంగా ఉందని చెప్పారు.
‘‘వారు ఒత్తిడిలో ఆడారు. నాకు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే రాత్రి కురిసే మంచు అంటే ఇష్టం లేదు. మంచు ఫలితాలను మారుస్తుంది. కాబట్టి ఆడే సమయంలో టాస్ కీలకంగా మారే అవకాశం ఉండటం నన్ను బయటపెడుతుంది’’ అని ధోని చెప్పారు.
కోహ్లీ, రోహిత్ కు మద్దతు..
వచ్చే వన్డే ప్రపంచకప్ లో రోహిత్, కోహ్లీ ఆడటంపై తన మద్దతు తెలిపాడు. వన్డే ప్రపంచకప్ లో ఆడేది వారు ఎవరికి వారు నిర్ణయించుకుంటారని పేర్కొన్నారు. వయస్సు ప్రమాణం కాదు, ప్రదర్శన, ఫిట్ నెస్ ముఖ్యమని తెలిపారు.
తను 24 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చానని దేశం గురించి ఆడుతున్న సమయంలో ఎప్పుడూ తన వయస్సు గురించి ఎవరూ అడగలేదని చెప్పారు. తాను ఇప్పటికీ అంటే 44 ఏళ్ల వయస్సులో క్రికెట్ ఆడుతున్నానని చెప్పారు.
‘‘రోహిత్ అయిన, విరాట్ అయిన లేదా రాబోయే తరాలలో వచ్చేవారు అయిన వారు తదుపరి ప్రపంచకప్ ఆడేది లేనిది వారు నిర్ణయించుకుంటారు. వారు బాగా ఆడుతుంటే, దేశానికి మంచి చేయాలనే తపన ఉంటే ఎందుకు చేయకూడదు’’ అని ధోని పేర్కొన్నారు.
జట్టు ఎంపిక విషయంలో ఒకే ప్రమాణం ఉంటుందని, అది ఆటే అని చెప్పారు. సరిగా ఆడని సమయంలో కచ్చితంగా ప్రశ్నిస్తారని వివరించారు. ఆటలో 20 సంవత్సరాల అనుభవం ఉన్న ఆటగాళ్లు అరుదుగా దొరుకుతారని సచిన్ ను ఉద్దేశిస్తూ చెప్పారు.
ధోనిని టైల్, స్టోన్ ఇన్ స్టాలేషన్ కంపెనీ అయిన ఎంవైకే లాటిక్రేట్ ఆధ్వర్యంలోని కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ నియమించుకుంది. ఈసందర్భంగా స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టర్ జతిన్ సఫ్రూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story

