భారత్- పాకిస్తాన్ మ్యాచ్: న్యూయార్క్ పిచ్ పైనే అందరి దృష్టి
x

భారత్- పాకిస్తాన్ మ్యాచ్: న్యూయార్క్ పిచ్ పైనే అందరి దృష్టి

భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఆడక దశాబ్ధం పైనే అయింది. అయితే ఐసీసీ నిర్వహించే పోటీల్లో మాత్రం రెండు దేశాలు హోరాహోరీగా తలపడుతూ..


రేపు సూపర్ సండే.. క్రికెట్ అంటే ఆసక్తి ఉన్న ప్రతి అభిమానికి రేపు బిగ్ డేనే.. ఎందుకంటే చిరకాల ప్రత్యర్థులు గా ఉన్న భారత్- పాకిస్తాన్ లు రేపు న్యూయార్క్ వేదికగా తలపడబోతున్నాయి. ఐసెన్‌హోవర్ పార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది.

విండీస్ లో ఇంతకుముందు నిర్వహించిన ఐసీసీ ఈవెంట్లు కూడా ఇలానే చప్పగానే సాగాయి. ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచకప్ కూడా ఇలానే ఉంది. దీనికి ఊపు తెచ్చేది భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే అని విశ్లేషకులు అంటున్నమాట. అయితే ఇరు జట్ల ఆటగాళ్ల ను ఇక్కడి డ్రాప్ ఇన్ పిచ్ లు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి ఆటగాళ్ల దృష్టి కంటే పిచ్ ఎలా ప్రవర్తిస్తుందన్న దానిమీదనే అందరి కళ్లు ఉన్నాయి.

స్టేడియం కిక్కిరి పోతుందా?
ఆదివారం నాటి మ్యాచ్ ప్రేక్షకులను భారీగా స్టేడియంలో రప్పిస్తుందని ఐసీసీ భావిస్తోంది. ఈ స్టేడియం సామర్థ్యం 34 వేలుగా ఉంది. మ్యాచ్ లన్నీ చాలా లో స్కోరింగ్ గా సాగుతుండటంతో ఎవరికి టీ20 క్రికెట్ పై ఆసక్తి కలిగించడం లేదు. ఈ విషయాన్ని ఐసీసీ కూడా అంగీకరించింది. నిజానికి భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఆశేషంగా అభిమానులు హజరవుతారు. అందుకు తగ్గ ఏర్పాట్లే ఇక్కడ ఐసీసీ కల్పించింది. కాకపోతే టికెట్ రేట్లు విపరీతంగా ఉన్నాయని విమర్శలు వ్యక్తం అయ్యాయి.
ఈ స్టేడియంలో ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు మాత్రమే 100 పరుగుల మార్కును అధిగమించాయి. క్రికెట్ ను అమెరికాలో విస్తరించాలనే లక్ష్యంతో ఐసీసీ ఈవెంట్ ను ఇక్కడ ప్లాన్ చేసింది. అయితే ఇప్పుడు జరిగే లో స్కోరింగ్ గేమ్ లు ఏ మాత్రం సహాయపడతాయని మాజీలు ప్రశ్నిస్తున్నారు.
డ్రాప్-ఇన్ పిచ్‌లు సరిగ్గా..
అడిలైడ్ ఓవల్ గ్రౌండ్స్‌మెన్ డామియన్ హగ్ పర్యవేక్షణలో ఏప్రిల్‌లో తయారు చేసిన నాలుగు డ్రాప్-ఇన్ పిచ్‌లు ఇంకా సరిగ్గా స్థిరపడలేదని నిఫుణులు చెబుతున్నారు.
జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ కు బ్యాటింగ్ సమయంలో అస్థిర బౌన్స్ కారణంగా చేతికి గాయమైంది. వెంటనే రోహిత్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇది ఆటగాళ్ల ఆందోళనను పెంచింది.
"నిజాయితీగా చెప్పాలంటే పిచ్ నుంచి ఏమి ఆశించాలో తెలియట్లేదు. పరిస్థితులు ఇలానే ఉన్న మేము మా ఆటపై దృష్టి పెడతాం, ఇది మా ఆటగాళ్లకి మంచి అనుభవంగా మారుతుంది' అని ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత రోహిత్ చెప్పాడు.
ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ అనంతరం పిచ్ లపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఐసీసీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. "నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు ఉపయోగించిన పిచ్‌లు మేమంతా కోరుకున్నంత నిలకడగా లేవని ఐసిసి గుర్తించింది" అని ప్రకటనలో పేర్కొంది.
భారత్ కు లాభిస్తుందా?
పాకిస్థాన్ జట్టు నసావు స్టేడియంలో పరిస్థితులకు ఇంకా అలవాటు పడలేదు. దీనికి తోడు పసికూన యూఎస్ఏ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ అనూహ్యంగా ఓడిపోయింది. ఈ షాక్ నుంచి ఇంకా పాక్ కోలుకోలేదు. ప్రయాణ బడలికో , షాక్ వల్లో పాకిస్తాన్ ఇంకా గ్రౌండ్ లోకి దిగకుండా ఒక రోజంతా హోటల్ గదులకే పరిమితం అయ్యారు.
ఫలితంగా, బాబర్ ఆజం, అతని స్క్వాడ్‌కు పరిస్థితులకు అలవాటు పడటం ఓ సవాల్ అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ఓడిపోతే వారికి సూపర్ 8 కు వెళ్లడం చాలా కష్టంగా మారుతుంది.
భారత్ ఇప్పటికే తన తుది జట్టుపై ఓ అంచనాకు వచ్చే ఉంటుందనిపిస్తోంది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో చైనామన్ బౌలర్ కుల్దీప్ ను తప్పించి అదనంగా స్పెషలిస్ట్ బౌలర్ ను తీసుకుంది.
ఆదివారం పాక్ తో జరిగే మ్యాచ్ లో కూడా ఇలాంటి వ్యూహం అనుసరిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా మ్యాచ్ ఉపయోగించని సెంటర్ టర్ఫ్‌లో ఆడాలని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా- నెదర్లాండ్స్ జూన్ 8న నసావు స్టేడియంలో ఒక గేమ్ ఆడుతున్నాయి కానీ వేరే పిచ్ పై ఈ గేమ్ జరగబోతోంది.
అయితే, కుల్దీప్ ఇటీవలి ఫామ్ పాకిస్థాన్ పై అతడి కున్న ఆధిపత్యం దృష్ట్యా, తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే జడేజా, అక్షర్ పటేల్ లో ఎవరో ఒకరు బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. రోహిత్ - విరాట్ కోహ్లి ఓపెనర్లుగా కొనసాగుతారు, రిషబ్ పంత్ నం.3 స్లాట్‌ను తీసుకోవడంతో బ్యాటింగ్ హిట్టర్లతో ఉంది.
ఒత్తిడిలో పాకిస్థాన్
పసికూన చేతిలో పరాజయం నుంచి కోలుకుని తిరిగి తమదైన గేమ్ ను ఆడటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. అయితే యూఎస్ఏ తో జరిగిన మ్యాచ్ లో ఓటమిపై బౌలర్లు కారణం అని బాబర్ ఆరోపించారు. అయితే తాను కెప్టెన్ గా 43 బంతుల్లో 44 పరుగులు సాధించాడు. దీనిపై విమర్శలు వ్యక్తం అయ్యాయి.
బాబర్ తన ఆటతీరును మెరుగు పరుచుకోవాలని అనుకుంటున్నాడు. ఇటు భారత్ పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ భూమ్రా దళం పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ ను పరీక్ష పెట్టడానికి సిద్ధం అవుతోంది. అటూ పాకిస్తాన్ పేస్ దళం షాహిన్ ఆఫ్రిదీ నేతృత్వంలోని భారత బ్యాటింగ్ లోతును పరీక్షించడానికి సిద్ధం అయింది.
మ్యాచ్‌కు తీవ్రవాద ముప్పు
ఐసీసీ ఈ వెంట్ కు మొదట పాకిస్తాన్ లోని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. దీనితో స్థానికంగా ఉన్న అధికారులు ఈ మ్యాచ్ పై కఠినమైన భద్రతా చర్యలను అమలు చేశారు.
Nassau కౌంటీ పోలీస్ కమిషనర్ పాట్రిక్ రైడర్, ఇటీవలి మీడియా మాట్లాడుతూ.., విస్తృతమైన ఏర్పాట్లను ప్రెసిడెంట్-స్థాయి భద్రతతో పోల్చారు.
"కొన్నాళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మేము ఆతిథ్యం ఇచ్చినప్పటితో పోల్చితే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భద్రత స్థాయి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది" అని రైడర్ చెప్పారు.
అతను గేమ్ కోసం సమగ్ర భద్రతా ఏర్పాట్లలో నసావు కౌంటీ పోలీస్, సఫోల్క్ కౌంటీ, న్యూయార్క్ రాష్ట్రం, అలాగే FBI, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్, US కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్‌తో సహా ఏజెన్సీల ప్రమేయాన్ని కూడా ధృవీకరించాడు.
స్క్వాడ్స్
భారత్: రోహిత్ శర్మ (సి), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్: బాబర్ ఆజం (సి), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షామాన్ అఫ్రిదీ, యు ఖాన్
భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది


Read More
Next Story