
అండర్ 19 ప్రపంచకప్: సెంచరీ సాధించిన ఆరోన్ జార్జ్
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత్
టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేదన
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ పై ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఒపెనర్ ఆరోన్ జార్జ్ చేసిన అద్బుతమైన సెంచరీతో భారత్ రికార్డు ఛేజింగ్ ను పూర్తి చేసింది. శుక్రవారం హరారేలో జరిగఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఫైసల్ ఖాన్, ఉజైరుల్లా నియాజై చెరో సెంచరీ సాధించారు. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 310 పరుగులు చేశారు. దానితో టోర్నీ చరిత్రలోనే అతిపెద్ద ఛేజింగ్‌ను భారత కుర్రాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే జార్జ్ ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి రావడంతో పాటు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రేలు చెలరేగడంతో భారత్ 41 ఓవర్లలో ఛేదన పూర్తి చేయగలిగింది.
సూర్యవంశీ విధ్వంసం..
భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత్ కు ఒపెనర్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. కేవలం 33 బంతుల్లోనే 68 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. మరో వైపు మరో ఒపెనర్ వీలు చిక్కినడప్పుల్లా బౌండరీలు సాధిస్తూ ముందుకు సాగాడు.
సూర్యవంశీ 25 బంతుల్లో తన అర్ధ సెంచరీని సాధించాడు. వైభవ్ ధాటికి భారత్ 10 ఓవర్లలో బోర్డులో 90 పరుగులు సాధించింది. వైభవ్ పెవిలియన్ చేరిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే కూడా బ్యాట్ ఝలిపించడంతో స్కోర్ బోర్డు వేగం తగ్గలేదు.
ఈ క్రమంలో మాత్రే కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగిలిన లాంఛనాన్ని మల్హోత్రా పూర్తి చేశాడు. క్లుప్తంగా స్కోర్లు ఇండియా v ఆఫ్ఘనిస్తాన్.. హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 310/4 (ఫైసల్ ఖాన్ 110, ఉజైరుల్లా నియాజై 101 నాటౌట్; కనిష్క్ చౌహాన్ 2/55, దీపేష్ దేవేంద్రన్ 2/64) ఇండియా 41.1 ఓవర్లలో 311/3 (ఆరోన్ జార్జ్ 115, వైభవ్ సూర్యవంశీ 68, ఆయుష్ మాత్రే 62; నూరిస్తానీ ఒమర్జాయ్ 2/64, వాహిద్ జద్రాన్ 1/67)
Next Story

