ఐసీసీ టీ20 ప్రపంచకప్: ఫైనల్ చేరిన భారత్
x
సంజూ శాంసన్

ఐసీసీ టీ20 ప్రపంచకప్: ఫైనల్ చేరిన భారత్

హై స్కోరింగ్ థ్రిల్లర్ లో ఏడు పరుగులతో విజయం సాధించిన టీమిండియా


Click the Play button to hear this message in audio format

టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. ఆదివారం అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ లో భారత్, న్యూజిలాండ్ తో తలపడతుంది.

గురువారం సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్ మరోసారి చెలరేగి ఆడాడు. సూపర్ ఎయిట్ లో వెస్టీండీస్ పై ఆడిన గేమ్ నే మరోసారి రిపీట్ చేశాడు.
ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ వేస్తున్న బౌన్సర్ సవాల్ ను అధిగమించాడు. కేవలం 42 బంతుల్లోనే ఏడు సిక్స్ ల సాయంతో 89 పరుగులు సాధించాడు. శాంసన్ పాటు మిగిలిన బ్యాట్స్ మెన్ కూడా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది.
కానీ ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జాకబ్ బెథెల్ (48 బంతుల్లో 105) చెలరేగి సెంచరీ సాధించి భారత శిబిరంలో గుబులు రేపాడు. మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను తిరిగి పోటీలోకి తెచ్చిన ఘనత ఈ బార్బడోస్ కుర్రాడికే దక్కుతుంది.
ఎక్కడా తొణకకుండా భారత బౌలర్లకు సవాల్ విసిరాడు. దీనితో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 246 పరుగులు సాధించింది. చివరి ఓవర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడం కూడా భారత్ విజయానికి ప్రధాన కారణాలలో ఒకటి.
18 ఓవర్ లో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చిన బూమ్రా ఇంగ్లాండ్ పై ఒత్తిడి పెంచాడు. చివరి ఓవర్ లో ఇంగ్లాండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా, దూబే 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీనితో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

విఫలమైన అభిషేక్.. చెలరేగిన దూబే..

ఈ టోర్నమెంట్ వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ మరోసారి తన చెత్త ఫామ్ ను కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్ లో భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకునే అలవాటును వదులుకోలేకపోతున్నాడు.
ఈ మ్యాచ్ లో కూడా విల్ జాక్స్ బౌలింగ్ భారీ షాట్ ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అయితే వన్ డౌన్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 39)తోడుగా సంజూ శాంసన్ భారీ షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ జంట రెండో వికెట్ కు 45 బంతుల్లోనే 97 పరుగులు జోడించి భారీ స్కోర్ కు పునాది వేశారు.
పవర్ ప్లేలో భారత్ ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. 10 ఓవర్లలో రెండు వికెట్లకు 119 పరుగులు చేసింది. కిషన్ ను రషీద్ వెనక్కి పంపిన తరువాత శివమ్ దూబే (25 బంతుల్లో 43) ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
మరొక ఎండ్‌లో ఉన్న సామ్సన్, శామ్ కరన్, జేమీ ఓవర్టన్‌తో సహా ఇతర బౌలర్లపై కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు 19వ ఓవర్లో తిలక్ వర్మ (7 బంతుల్లో 21) మూడు సిక్సర్లు బాదడంతో ఆర్చర్ నాలుగు ఓవర్లలో 61 పరుగులు ఇచ్చుకున్నాడు.
చివరి ఓవర్లో జాక్స్ ఆఫ్ స్పిన్ తో ఇంగ్లాండ్ బౌలింగ్ లో రాణించగా, హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27) రెండు సిక్సర్లు బాదడంతో భారత్ స్కోర్ 250 దాటింది. చివరి ఐదు ఓవర్లలో భారత్ 76 పరుగులు సాధించింది. బౌలింగ్ విషయంలో వరుణ్ చక్రవర్తి తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు.
Read More
Next Story