
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ప్రివ్యూ: ఫైనల్ కు చేరేదెవరూ?
భారత్ ను ఆందోళనకు గురి చేస్తున్న బౌలింగ్
భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. తొలి సెమీస్ లో భాగంగా నేడు చారిత్మక ఈడెన్ గార్డెన్స్ లో సౌత్ ఆఫ్రికాతో న్యూజిలాండ్ తలపడబోతోంది. రేపు ముంబైలోని వాంఖడే వేదికగా భారత్, ఇంగ్లాండ్ తో ఆడుతోంది. రెండు జట్ల విజేతలు ఆదివారం అహ్మాదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ లో ఆడతారు.
ఈ టోర్నమెంట్ లో ఢిపెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ మొదట ఫేవరేట్ గా అనుకున్నారు. కానీ అది టోర్నీలో తనదైన ముద్ర వేయలేకపోయింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సరిగా రాణించలేక ఇబ్బందిపడుతోంది. ఇప్పుడు పటిష్ట ఇంగ్లాండ్ ను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. సూపర్ ఎయిట్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తరువాత అది ముగ్గురు లెప్ట్ హ్యాండర్ల కాంబినేషన్ ను మార్చుకుంది. సంజూ శాంసన్ ను ఒపెనర్ గా పంపి విజయవంతమైంది.
అరంగేట్రం చేసిన 10 సంవత్సరాల తర్వాత, వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌లో సామ్సన్ చివరకు కెరీర్ లో చిరస్మరణీయమైన 97 నాటౌట్‌తో ఆడాడు. ఇది అతని ఆత్మవిశ్వాసం పెంచిందనే చెప్పాలి.
అయితే ఇంతకుముందే ఇదే శాంసన్ ను ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ ఇబ్బంది పెట్టాడు. వరుస షార్ట్ పిచ్ బంతులతో శాంసన్ పెవిలియన్ పంపాడు. దీనితో శాంసన్ జట్టులో చోటు కోల్సోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే తీరులో అభిషేక్ శర్మ ఆడుతున్నాడు.
అతనిలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. ఆఫ్ స్పిన్ ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. ఇంగ్లాండ్ పార్ట్ టైమ్ స్పిన్నర్ గా ఉన్న విల్ జాక్స్ కూడా మంచి వికెట్లు సాధిస్తున్నాడు. అలాగే భారత్ పిచ్ లపై ఆదిల్ రషీద్ మంచి ప్రభావం చూపగలడు.
జాతీయ జట్టులోని ప్రస్తుత ముంబై ఇండియన్స్ స్టార్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సెమీఫైనల్‌కు ముందు ప్రధాన నెట్ సెషన్‌లో రెండు గంటలకు పైగా బ్యాటింగ్ చేశారు. జట్టుకు సాయం చేయడానికి మిడిల్ ఆర్డర్‌లోకి వచ్చిన తిలక్ ఇప్పుడు వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు ఉపయుక్తంగా మారాడు.
భయపెడుతున్న బౌలింగ్..
అయితే భారత్ బౌలింగ్ జట్టును భయపెడుతుంది. ఒక్క బూమ్రా తప్ప ఎవరూ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయకపోగా, ధారళంగా పరుగులు సమర్పిస్తున్నాడు. అర్ష్ దీప్ సింగ్, పాండ్యా కూడా ఇదే దారిలో ఉన్నారు. అయితే చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం లేదు.
ఇంగ్లాండ్ మొదట నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో తడబడిన తరువాత గొప్పగా ఫుంజుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో గొప్పగా పోరాడి విజయం సాధించింది.
భారత జట్లు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు సామ్సన్, శివం దుబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.
ఇంగ్లాండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్యూ, ల్యూక్ వుడ్. మ్యాచ్ రాత్రి 7 గంటలకు IST ప్రారంభమవుతుంది.
Next Story

