బంగ్లాను ఆటాడుకున్న తమిళ తంబీ
x

బంగ్లాను ఆటాడుకున్న తమిళ తంబీ

చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో తొలిటెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత్ ఘన విజయం సాధించింది. లంచ్ లోపే అతిథ్య జట్టుకు ఆలౌట్ చేసిన టీమిండియా..


బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ లో భారత్ జట్టు 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు(6/88) వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు కుప్పకూలింది. మూడో రోజు 158/4 తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన జట్టు 234 పరుగులకు ఆలౌట్ అయింది.

అసాధ్యమైన రీతిలో 515 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన బంగ్లా లక్ష్యానికి చాలాదూరంలోనే ఆగిపోయింది. కెప్టెన్ నజ్ముల్ శాంటో ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.
మూడు వికెట్లు తీసిన జడేజా..
ఉదయం ఆట ప్రారంభం కాగానే శాంటో, షకీబుల్ హసన్(25) నిదానంగా ఆట ప్రారంభించారు. వీరిద్దరు ఐదో వికెట్ కు 48 పరుగులు జోడించారు. మొదటి గంటలో సిరాజ్ అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. అనేకసార్లు షకిబ్, శాంటో బంతిని మిడిల్ చేయడంలో విఫలం అయ్యారు. దీనితో ఫ్రస్టేట్ అయిన సిరాజ్, శాంటోను కవ్వించే ప్రయత్నం చేశాడు. జడేజా బౌలింగ్ లో షకీబ్ స్టంపింగ్ అవకాశాన్ని పంత్ జారవిడిచారు. ఈ జోడిని చివరకు అశ్విన్ విడదీశాడు.
అశ్విన్ తెలివిగా సంధించిన బంతిని ఢిపెండ్ చేయడానికి ప్రయత్నించగా ఎడ్జ్ తీసుకుని బ్యాక్ వర్డ్ షార్ట్ లెగ్ లో ఉన్న యశస్వి జైశ్వాల్ చేతిలో పడింది. ఈ వికెట్ తో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఐదు వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ 37 సార్లు తీసినట్లు అయింది. ఐదు వికెట్లు అత్యధిక సార్లు తీసిన జాబితాలో షేన్ వార్న్ తో కలిసి అశ్విన్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అందరికంటే అత్యధికంగా ముత్తయ్య మురళీధరన్ 67 సార్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ కు చెందిన రిచర్డ్ హ్యాడ్లీ 36 సార్లు ఈ ఘనత సాధించి మూడో స్థానంలో ఉన్నాడు.
అల్ రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ ను జడేజా వెనక్కి పంపాడు. తరువాత ఓ అద్భుత బంతితో దూకుడు మీద ఉన్న కెప్టెన్ శాంటోను కూడా పెవిలియన్ చేర్చాడు. ఆఫ్ స్టంట్ ఆవల పడిన బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో భూమ్రా కి చేతికి చిక్కాడు. చివరి వికెట్ హసన్ మమ్మద్ ను క్లీన్ బౌల్డ్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ కు తెరదించాడు. దీనితో తన టెస్ట్ కెరీర్ లో 299 వికెట్లు చేరాయి.
రెండో టెస్ట్ కాన్పూర్ లో ఈ నెల 27న ప్రారంభం కానుంది. రెండో టెస్టుకు ఇంకా జట్టును ప్రకటించలేదు.
బంగ్లాకు తత్వం బోధపడిందా?

పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. తొలి టెస్ట్ లో పాకిస్తాన్ ఓవర్ కాన్పిడెంట్ తో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయగా, బంగ్లాదేశ్ అనూహ్యంగా భారీ స్కోర్ సాధించింది. దీనితో రెండో ఇన్నింగ్స్ లో పాక్ ఆటగాళ్లు ఒత్తిడి లోనై చిత్తయ్యారు. ఇలా తొలి టెస్ట్ లో గెలిచిన బంగ్లా.. రెండో టెస్ట్ లోనూ విజయం సాధించింది.

దీనితో భారత్ తోనూ జరిగే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తామని బంగ్లా కెప్టెన్ ప్రకటించారు కూడా. అనుకున్నట్లుగానే తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా బౌలర్ల ధాటికి 144 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. జడేజా కూడా బ్యాట్ ఝలిపించడంతో భారత్ 376 పరుగులకు ఆలౌట్ అయింది. తరువాత బంగ్లాదేశ్ ను కుప్పకూల్చి పట్టు బిగించింది.


Read More
Next Story