భారత క్రికెటర్లకు రెండువందల కోట్ల నష్టం
x
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

భారత క్రికెటర్లకు రెండువందల కోట్ల నష్టం

ఆన్ లైన్ గేమింగ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన ఫలితం


రియల్ మనీ ఆన్ లైన్ గేమ్ లను నిషేధించే చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించడంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ, గిల్ సహ ఇతర భారత క్రికెటర్లకు సంవత్సరానికి రూ. 150- 200 కోట్లు నష్టపోనున్నట్లు ఒక నివేదిక తెలిపింది.

ఆన్ లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యూలేషన్ బిల్లు 2025 ను ఆగష్టు 21న పార్లమెంట్ ఆమోదించింది. ఆన్ లైన్ మనీ గేమ్ లకు సంబంధించిన ప్రకటనలను నిషేధించడం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అలాంటి గేమ్ లకు నిధులను బదిలీ చేయకుండా నిరోధించడం ఈ బిల్లు లక్ష్యం.

ప్రభుత్వం దీనిని ఇతర రకాల ఆన్ లైన్ గేమ్ లను ప్రొత్సహిస్తూ, నియంత్రిస్తూనే ఆన్ లైన్ మనీ గేమ్ ముప్పుల నుంచి పౌరులను రక్షించడానికి ఒక మైలురాయి చర్యగా ప్రశంసించింది. త్వరిత డబ్బు సంపాదించడానికి ఆన్ లైన్ మనీ గేమ్ ఒక మార్గం అవి ప్రచారం చేస్తుకుంటున్నాయి. ఇది సాధారణ ప్రజలకు ఒక వ్యసనంగా మారింది. అనేక కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుని చిన్నాభిన్నం అయ్యాయి. అందుకే ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
కోహ్లీ సంపాదన..
కొత్త చట్టం ఫలితంగా డ్రీమ్ 11 భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ గా నిష్క్రమించింది. భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా డ్రీమ్ 11 తో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. భారత టెస్ట్ కెప్టెన్ గిల్, సిరాజ్, జైస్వాల్, రుతురాజ్, రింకు సింగ్, సౌరవ్ గంగూలీ మై 11 సర్కిల్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.
కోహ్లీ కాంట్రాక్ట్ సంవత్సరానికి రూ. 10 నుంచి 12 కోట్లు ఆర్జిస్తున్నారు. రోహిత్, ధోనీ లు సంవత్సరానికి ఆరు నుంచి ఏడు కోట్లు సాధిస్తున్నారు. చిన్న ఆటగాళ్లు దాదాపు కోటీ రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు వాటిని నిషేధించడంలో క్రికెటర్లు దాదాపు రూ. 150 నుంచి 200 కోట్ల మధ్య నష్టపోయే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
ఐపీఎల్ జట్లకు నష్టాలు..
గేమింగ్ కంపెనీలు కొన్ని ఐపీఎల్ టీమ్ లను స్పాన్సర్ షిప్ వ్యవహరిస్తున్నాయి. ఈ జట్లు కూడా రూ. 10 -20 కోట్ల వరకూ నష్టపోతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రకటనల పరిశ్రమ సంవత్సరానికి దాదాపు రూ. 8 నుంచి 10 వేల కోట్ల నష్టపోతున్నాయి.
‘‘మొత్త ప్రకటన ఖర్చుల పరంగా ఈ గేమింగ్ కంపెనీలు మార్కెట్ లో దాదాపు 7-8 శాతం వాటా ఉంది. దాదాపు 80 శాతం అదృశ్యమవుతాయి. ఎందుకంటే రియన్ మనీ గేమింగ్ మొత్తం గేమింగ్ మార్కెట్ లో 75 -80 శాతం వాటా షేర్ ఉంది.
వీటి వలన డిజిటల్ ప్రకటనల ఖర్చులలో దాదాపు 15-20 శాతం అదృశ్యమవుతాయి. ఎందుకంటే డిజిటల్ ప్రకటనలలో వారి వాటా ఎక్కువగా ఉంటుంది’’ అని ఎలారా క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కరణ్ తౌరానీ నివేదికలో పేర్కొన్నారు.
Read More
Next Story