మోదీతో సమావేశమైన భారత ఉమెన్స్ క్రికెట్ టీమ్
x
ప్రపంచకప్ విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ

మోదీతో సమావేశమైన భారత ఉమెన్స్ క్రికెట్ టీమ్

హనుమాన్ టాటూ, చర్మ సంరక్షణపై ప్రశ్నలు, నవ్వులు పూయించిన క్రికెటర్లు


తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత మహిళల జట్టుతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. భారత మహిళల జట్టు సాధించిన విజయాల గురించి మాత్రమే కాకుండా టాటూలు, చర్మ సంరక్షణ, అమ్మాయిల వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి ప్రధానితో ముచ్చటించారు.

గతవారం నవీముంబై జరిగిన ఫైనల్ లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్ ను ముద్దాడింది. ఈ విజయం తరువాత ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ ఈ బృందంలో ఉన్నారు.
క్రికెట్ అంటే ప్రాణం..
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘2017 లో మేము మిమ్మల్ని కలిసిన సమయం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ సమయంలో మేము ట్రోఫిని సాధించలేకపోయాము. కానీ చాలా సంవత్సరాలు కష్టపడి పనిచేసిన తరువాత మేము ట్రోఫిని సాధించాము, ఇది చాలా గౌరవప్రదమైన విషయం’’ అని చెప్పారు. భవిష్యత్ లో మిమ్మల్ని సార్లు చాలాసార్లు కలిసి ఫొటో దిగడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
2017 మహిళల ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ ఇంగ్లాండ్ చేతిలో తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తరువాత భారత జట్టు ప్రధానమంత్రిని కలిసింది.
‘‘భారత్ లో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు. అది ఒక విధంగా ప్రజల జీవితంగా మారింది. క్రికెట్ లో ఏదైన మంచి జరిగితే యావత్ దేశం సంతోషంగా ఉంటుంది. ఏదైన చిన్న తప్పు జరిగిన దేశం మొత్తం చెడుగా స్పందిస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.
హనుమాన్ టాటూ..
ఈ టోర్నిలో ఉమెన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన ఆల్ రౌండర్ దీప్తి శర్మను, ఆమె హనుమంతుడి టాటూ గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘‘నేను నన్ను నమ్ముకోవడం కంటే, ఆయననే ఎక్కువగా నమ్ముతాను. నేను క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా ఆయన పేరు ఉచ్చరిస్తాను. దానివల్ల నేను సమస్యను అధిగమిస్తాను. నాకు ఆయనపై చాలా నమ్మకం ఉంది’’ అని ఆమె బదులిచ్చింది. ‘‘మీరు ఎప్పుడైన ఇన్ స్టా లో జై శ్రీరామ్ అని రాశారా?’’ అని మోదీ అడగగా, అవును అని దీప్తి శర్మ సమాధానం లభించింది.
మోదీ జీ మీ చర్మ రక్షణ మార్గం ఏందీ?
టాప్ ఆర్డర్ బ్యాట్స్ ఉమెన్ హర్లీన్ డియోల్ .. మోదీ చర్మ సంరక్షణ సీక్రెట్ ఏంటనీ ప్రశ్నించడంతో అక్కడ నవ్వులు పూయించారు. దీనికి ప్రధాని సమాధానమిస్తూ.. నేను దేనీ గురించి పట్టించుకోనూ అని అన్నారు.
స్టార్ బ్యాట్స్ ఉమెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. ప్రధానితో ఇంతకుముందు జరిగిన సమావేశం తమకు ఎలా స్ఫూర్తినిచ్చిందో చెప్పారు. ‘‘మేము 2017 లో ఇక్కడికి వచ్చినప్పుడూ ట్రోఫిని సాధించలేకపోయాము. కానీ అంచనాల గురించి మీరు మమ్మల్ని అడిగిన ప్రశ్న మాకు ఇంకా గుర్తుంది. మీ సమాధానం మమ్మల్ని ఇంకా ప్రేరేపిస్తోంది.’’ అన్నారు.
ప్రపంచకప్ అధ్యాయంలో అనేక కష్టాలు ఎదుర్కోన్నామని వివరించారు. కానీ భారత్ లోనే జరిగిన ప్రపంచకప్ లో విజయం సాధించడం విధిలిఖితమని అన్నారు.
ప్రతిరంగంలోనూ అమ్మాయిలూ ముందు వరుసలో ఉన్నారని, అన్ని చోట్ల వారు విజయదుందుభి మోగిస్తున్నారని మంధాన పేర్కొన్నారు. జేమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. జట్టులో ఐక్యత ఇంతకుముందుకు తాను చూడలేదన్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో బ్రిటన్ రాజు చార్లెస్ ను కలవడానికి జట్టులోని 20 మంది సభ్యులకు మాత్రమే అనుమతి లభించిందని మజుందార్ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి నవంబర్ లో ప్రపంచకప్ ట్రోఫితో ప్రధాని మోదీని కలవాలని ఆలోచనను జట్టు వ్యక్తం చేయడం ప్రారంభించిందని ఆయన అన్నారు.
‘‘మేము జూన్ లో ఇంగ్లాండ్ లో ఉన్నాము. అక్కడ కింగ్ చార్లెస్ ను కలిశాము. 20 మందితో కూడిన ప్రోటోకాల్ ఉంది. సహాయక సిబ్బంది రాలేకపోయారు. చాలామంది ఆటగాళ్లు, ముగ్గురు నైపుణ్యం కలిసిన కోచ్ లు ఉన్నారు. నేను నా సహాయక సిబ్బందికి చెప్పాను. నన్నుచాలా క్షమించండి. కానీ ప్రోటోకాల్ 20 మంది మాత్రమే’’ అని మజుందార్ చెప్పారు.
మీ పాఠశాలకు వెళ్లండి..
దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వర్డ్ ఇచ్చిన క్యాచ్ పట్టి విజయంలో కీలకపాత్ర పోషించిన అమన్ జీత్ కౌర్ తో మోదీ మాట్లాడుతూ.. 2024, టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.
మీకు తెలుసా? సూర్య క్యాచ్ పట్టిన తరువాత కూడా ఇక్కడికి వచ్చాడని మోదీ అన్నారు. ఆటగాళ్లు పూర్వ పాఠశాలలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడాలని కోరారు.
‘‘మీరు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత సహజంగానే ఉత్సాహం, వేడుకలు ఉంటాయి. కానీ కొన్ని రోజుల తరువాత మీరు పట్టభద్రులైన పాఠశాలను సందర్శించి, పిల్లలతో మాట్లాడటానికి ఒక రోజు గడపండి.
వారికి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి’’ అని మోదీ చెప్పారు. ఆ పాఠశాలలు, పిల్లలు జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటారని నేను నమ్ముతున్నాను. మీరు సంవత్సరానికి మూడు పాఠశాలలను ఎంచుకోవచ్చు. అది వారికి, మీకు ఇద్దరికి స్ఫూర్తినిస్తుంది.
Read More
Next Story