సెమీస్ లో భారత ప్రత్యర్థి ఇంగ్లాండ్
x

సెమీస్ లో భారత ప్రత్యర్థి ఇంగ్లాండ్

విండీస్ పై ఘన విజయం సాధించిన భారత్, అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్


Click the Play button to hear this message in audio format

టీ20 వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ లో భాగంగా వెస్టీండీస్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సెమీ ఫైనల్ కు చేరుకుంది. మార్చి 4 న ఇంగ్లాండ్ తో భారత్ ముంబై లో తలపడనుంది.

తొలుత టాస్ గెలిచిన టీమిండియా, విండీస్ కు బ్యాటింగ్ కు అప్పగించింది. మొదటి ఓవర్ కాస్త నిదానంగా ఆడిన విండీస్ తరువాత తమదైన శైలిలో బ్యాటింగ్ ప్రారంభించింది. రోస్టన్ ఛేజ్, కెప్టెన్ షై హోప్ మంచి ప్రారంభం అందించారు. ఒక్క రూథర్ ఫోర్డ్ మినహ వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లు బాదడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. కొంతకాలంగా ఫామ్ తో తంటాలు పడుతున్న అభిషేక్ శర్మ 11 బంతులు ఆడి కేవలం పది పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. వన్ డౌన్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ కూడా రెండు ఫోర్లు బాదినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. ఈ దశలో మరో ఒపెనర్ సంజూ శాంసన్ కు తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(18) ఇన్నింగ్స్ ను నిర్మించాడు. ముఖ్యంగా సంజూ(97, 12x4, 4x6) భారీ షాట్లతో విండీస్ బౌలింగ్ పై విరుచుకుపడ్డాడు.
తరువాత వచ్చిన తిలక్ వర్మ కూడా ఎదురుధాడి ప్రారంభించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే చివరి రెండు ఓవర్లలో కొంచెం టెన్షన్ నెలకొంది. విజయానికి 18 పరుగుల దూరంలో భారీ షాట్ కు ప్రయత్నించి హార్ధిక్ పాండ్యా , హోల్డర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే దూబే వచ్చి రాగానే రెండు ఫోర్లు బాది ఒత్తిడి తగ్గించాడు. ఇక చివరి ఓవర్ లో విజయానికి ఏడు పరుగులు అవసరం కాగా, మొదటి బంతినే సంజూ శాంసన్ సిక్స్ బాదగా, రెండో బంతిని ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు.
Read More
Next Story