ఐపీఎల్-2026:  ఖాతా తెరిచిన ఆరెంజ్ ఆర్మీ
x

ఐపీఎల్-2026: ఖాతా తెరిచిన ఆరెంజ్ ఆర్మీ

రాణించిన క్లాసెన్, ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన నితీశ్ కుమార్ రెడ్డి


Click the Play button to hear this message in audio format

సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతా తెరిచింది. కోల్ కత నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆరెంజ్ ఆర్మీ బ్యాట్స్ మెన్ అందరూ చెలరేగి ఆడటంతో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 226 పరుగులు సాధించింది. హెన్రీచ్ క్లాసెన్ క్లాసెన్ హఫ్ సెంచరీతో రాణించాడు. క్లాసెన్ తో పాటు అభిషేక్ శర్మ(48), నితీశ్ కుమార్ రెడ్డి (39) పరుగులు చేశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ కు ఓపెనర్లు అభిశేక్ శర్మ- ట్రావిస్ హెడ్ మెరుపు ఆరంభం ఇచ్చారు. కేవలం 5.2 ఓవర్లలోనే 82 పరుగులు సాధించాడు. భారీ షాట్ ఆడే క్రమంలో హెడ్ పెవిలియన్ చేరాడు. తరువాత ఒకే ఓవర్లలో ముజరబాని కెప్టెన్ కిషాన్ తో పాటు, అభిషేక్ శర్మకు పెవిలియన్ పంపాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొందిన అనికేత్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. అభిశేక్ వర్మ, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో 25 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు.
అయితే క్లాసెన్ తో పాటు నితీశ్ కుమార్(39) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కలిసి బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును 200 పరుగులకు చేర్చారు. ఓ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బౌండరీల వద్ద నితీశ్ కుమార్ ఔట్ అయ్యాడు. అయితే చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు పడటం కూడా ఎస్ ఆర్ హెచ్ భారీ స్కోర్ ను సాధించలేకపోయింది. ముజరబానీ నాలుగు వికెట్లు సాధించాడు.

ఛేజింగ్..

కేకేఆర్ ఛేజింగ్ ను ఘనంగా ప్రారంభించింది. తొలి ఓవర్ వేసిన డేవిడ్ పెయిన్ బౌలింగ్ ను ఫిన్ అలెన్ రెండు సిక్స్ లు, మూడు ఫోర్లతో 25 పరుగులు సాధించాడు. అయితే తరువాత ఓవర్లలో ఫిన్ అలెన్ పెవిలియన్ చేరాడు. మరోసారి స్పిన్ బౌలింగ్ బలహీనతను ఫిన్ బయటపెట్టుకున్నాడు.
అయితే మరోవైపు రఘువంశీ తన దూకుడును కొనసాగించాడు. ఇతనికి మిగిలిన బ్యాట్స్ మెన్ నుంచి తోడు అందలేదు. పది ఓవర్ల వరకూ కేకేఆర్ లక్ష్యం వైపే సాగింది. కానీ ఆ తరువాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సమన్వయంతో కామెరూన్ గ్రీన్, రఘువంశీ రనౌట్ కావడంతో నైట్ రైడర్స్ స్పీడ్ కు బ్రేక్ పడింది.
నితీశ్ కుమార్ రెడ్డి మంచి బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. వరుస ఓవర్లలో వికెట్లు తీసి కేకేఆర్ పై ఒత్తిడి పెంచాడు. ఉనద్కత్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ ఫీల్డింగ్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. మూడు బౌండరీలు వదిలి పెట్టారు. ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన నితీశ్ కుమార్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
Read More
Next Story