ఐపీఎల్ వేలం: పంత్ కోసం పోటాపోటీ.. రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన..
ఐపీఎల్ వేలంలో భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ భారీ ధర పలికాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం కావడం..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. లక్నో పంత్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు చెల్లించింది. గత సీజన్ లో పేలవ ప్రదర్శన కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ గ్రూప్ దశను దాటలేకపోయింది. దీనితో కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఓవర్ గోయెంకా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అలాగే మరో భారత బ్యాట్స్ మెన్ అయ్యర్ పై కూడా ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి.
ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయ్యార్ ను పంజాబ్ రూ. 26. 25 కోట్లకు దక్కించుకుంది. ఇంతకుముందు ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ పేరిట అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు నమోదు అయి ఉంది. గత సీజన్ లో స్టార్క్ కోసం కేకేఆర్ 24 కోట్లు చెల్లించింది. అయితే ప్రస్తుతం ఈ ఏస్ బౌలర్ ను కేవలం రూ. 11. 75 కోట్లకే ఢిల్లీ సొంతం చేసుకుంది.
అలాగే పేసర్ అర్ష్ దీప్ సింగ్ కోసం కూడా 18 కోట్లకు పంజాబే కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ రూ. 15 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.
ఐపీఎల్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతోంది. 204 స్థానాల కోసం ఈ వేలంలో 577 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో చాలామంది ఆటగాళ్లు తమ కనీస మద్దతు ధరను రూ. 2 కోట్లని పేర్కొన్నారు.
గత ఐపీఎల్ లో కోల్ కత కెప్టెన్ గా జట్టును విజయపథంలో నడిపిన అయ్యార్ కు వేలంలో మంచి ధర పలికింది. పంజాబ్, ఢిల్లీ పూర్తిగా తమ జట్లను ప్రక్షాళన చేయాలని నిశ్చయించుకోవడంతో వాటి వద్ద భారీగా డబ్బు మిగిలింది. ఆ జట్లు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి పేరున్న ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.
Next Story