
కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్
ఐపీఎల్ వేలం: ఎవరూ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ ?
ఇద్దరు అనామక ఆటగాళ్ల కోసం రూ. 28 కోట్లను సీఎస్కే ఎందుకు ఖర్చు చేసింది
అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో అనామక ఆటగాళ్లపై సీఎస్కే కోట్లు ఖర్చు చేసింది. ఉత్తర ప్రదేశ్ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ ను రూ. 14.20 కోట్లకు కొనుగోలు చేసింది. వీర్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు.
ఈ యువ ఆల్ రౌండర్ ను రవీంద్ర జడేజా స్థానంలో సీఎస్కే ఆడించబోతోంది. రవీంద్ర జడేజాను సీఎస్కే రాజస్థాన్ రాయల్స్ కు అప్పగించింది. జడ్డూలాగే వీర్ కూడా ఎడమచేతి వాటం స్పిన్నర్, బ్యాట్స్ మెన్.
ఈ 20 ఏళ్ల యువ ఆటగాడు నోయిడా సూపర్ కింగ్స్ తరఫున యూపీ టీ20 లీగ్ లో మంచి ప్రదర్శన చేశాడు. ఇంతకుముందు వీర్ సీఎస్కే ట్రయల్స్ లో కూడా కనిపించాడు.
ఇప్పటి వరకూ తొమ్మిది టీ20 మ్యాచ్ల్లో వీర్ 167.16 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. అలాగే 12 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫితో పాటు ఉత్తరప్రదేశ్ అండర్ -23 మ్యాచ్ లలో కూడా ఆడాడు.
రాజస్థాన్ కు చెందిన మరో ఆల్ రౌండర్ కార్తీక్ శర్మను కూడా సీఎస్కే భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ 19 ఏళ్ల టీనేజర్ కోసం కూడా రూ. 14.20 కోట్లను ఖర్చు చేసింది.
ఈ ఆల్ రౌండర్ కూడా 160 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగలడు. డెత్ ఓవర్లలో బిగ్ హిట్టర్ గా పేరు పొందాడు. కార్తీక్ తన ప్రతిభతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లను ఆకట్టుకున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20లలో రాజస్థాన్ తరఫున ఐదు మ్యాచ్లలో 160.24 స్ట్రైక్ రేట్ తో 133 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 11 సిక్సర్లు బాదాడు.
Next Story

