ఆటగాళ్ల బదిలీకి ఐపీఎల్ పాలక మండలి ఆమోదం
x

ఆటగాళ్ల బదిలీకి ఐపీఎల్ పాలక మండలి ఆమోదం

ఇక నుంచి పంజాబ్ కు హార్దిక్, ముంబై కి అర్ష్ దీప్ సింగ్


Click the Play button to hear this message in audio format

ఐపీఎల్ సీజన్ కు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆకర్షణీయమైన ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్ కు మారగా, అర్ష్ దీప్ సింగ్ పంజాబ్ నుంచి ముంబైకి మారాడు. ప్రస్తుతం హార్ధిక్ కు ముంబై నుంచి 16 కోట్లు అందుకుంటూ ఉండగా, ఇప్పుడు పంజాబ్ లో మాత్రం రూ. 18 కోట్లు అందుకోబోతున్నాడు. అర్ష్ దీప్ సింగ్ అక్కడ ఇక్కడ రూ. 18 కోట్లు అందుకోనున్నాడు. పాండ్యా ట్రేడ్ తో తాను నాలుగు ఐపీఎల్ టైటిల్లు గెలుచుకున్న ఎంఐ ఫ్రాంచైజీతో అతని రెండవ ఇన్నింగ్స్ కు తెరపడనుంది.

2015 లో తొలిసారిగా ఎంఐలో చేరిన పాండ్యా 2015, 2017, 2019, 2020 లో జట్టు టైటిల్ గెలుచుకున్న సమయంలో కీలక పాత్ర పోషించాడు. 2024 లో పాండ్యా తిరిగి ఎంఐకి వచ్చిన పాండ్యా.. రోహిత్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. కానీ తరువాత ముంబై ఘోరంగా విఫలమైంది.
అతను 162 ఐపీఎల్ మ్యాచ్ లలో 146.28 స్ట్రైక్ రేట్ తో 2,995 పరుగులు చేసి 82 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉండగా అర్ష్ దీప్ పీబీకేఎస్ తో ఎనిమిది సీజన్ల తరువాత ఎంఐకి మారాడు. అతను 2019 లో అదే ఫ్రాంచైజీలో తన ఐపీఎల్ అరంగ్రేటం చేశాడు. 96 మ్యాచ్ లలో 111 వికెట్లు తీశాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
Read More
Next Story