
‘ఫిఫా’ ప్రపంచకప్ నుంచి వైదొలిగిన ఇరాన్
ఉత్తర అమెరికా లో జరగనున్న ఫుట్ బాల్ ప్రపంచకప్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్, అమెరికా చంపడంపై, టెహ్రాన్ కీలక ప్రకటన చేసింది. ఉత్తర అమెరికాలో జరిగే ఫుట్ బాల్ ప్రపంచకప్ లో తమ జట్టు పాల్గొనడం లేదని వెల్లడించింది. ఈ మేరకు యువజన క్రీడల శాఖామంత్రి ప్రకటన విడుదల చేశారు.
జూన్ లో జరిగే ప్రపంచ ఈవెంట్ లో ఇరాన్ కచ్చితంగా ఆడుతుందని అంతా భావించారు. అయితే ఇరాన్ క్రీడలు, యువజన మంత్రి అహ్మాద్ డోన్యామాలి ఆ దేశ టెలివిజన్ తో మాట్లాడారు. తన దేశ సాకర్ జట్టు ఆటగాళ్లు అమెరికాలో సురక్షితంగా లేరని మంగళవారం పేర్కొన్నారు.
‘‘ఇరాన్ పై అమెరికా చేసిన దుర్మార్గపు చర్యల కారణంగా వారు కేవలం ఎనిమిది నెలల్లో రెండు యుద్ధాలను తీసుకొచ్చారు. వేలాది మంది ప్రజలను చంపి బలిదానం చేశారు. కచ్చితంగా మేము ప్రపంచకప్ పాల్గొనడం సాధ్యం కాదు’’ అని అతను చెప్పాడు.
ఇరాన్ జూన్ 15 న కాలిఫోర్నియా లోని ఇంగిల్ వుడ్ లో న్యూజిలాండ్ తో, జూన్ 21 న బెల్జియం తో ఆడనుంది. జూన్ 26 సియాటిల్ లో ఈజిప్ట్ లో జరిగే గ్రూప్ మ్యాచ్ ను ముగించనుంది. జూన్ 11న నుంచి జూలై 19 వరకూ కెనడా, మెక్సికో లతో ఈ టోర్నమెంట్ ను అమెరికా నిర్వహిస్తుంది.
ఇరాన్ జాతీయ జట్టు అమెరికాకు రావడానికి అనుమతి ఉంటుందని ఫిఫా అసోసియేషన్ ప్రకటించింది. గతవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. 48 దేశాలు పాల్గొనే ఈ టోర్నమెంట్ లో ఇరాన్ పాల్గొంటే నాకు నిజంగా పట్టింపు లేదని ఆయన అన్నారు.
టోర్నమెంట్ కోసం సన్నాహాల స్థితిని చర్చించడానికి మంగళవారం రాత్రి ట్రంప్ తో సమావేశమయ్యానని, ఇరాన్ ను అమెరికా రావడానికి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చానని ఫిఫా అధ్యక్షుడు జియాని అన్నారు.
Next Story

