అరుదైన క్లబ్ లోకి చేరబోతున్నవిరాట్ కోహ్లి
x

అరుదైన క్లబ్ లోకి చేరబోతున్నవిరాట్ కోహ్లి

న్యూజిలాండ్ తో రేపు చివరి లీగ్ మ్యాచ్, కింగ్ కు 300వ అంతర్జాతీయ వన్డే


ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిలో భాగంగా రేపు దుబాయ్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. ఈ వన్డేలో ఆడటం ద్వారా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు.

ఈ వన్డే కింగ్ కు 300 వది కావడం విశేషం. భారత్ తరఫున ఇంతకుముందు ఆరుగురు మాత్రమే 300 వన్డే మ్యాచ్ లు ఆడిన జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఇందులో సచిన్ టెండూల్కర్ అందరి కంటే ఎక్కువగా 463 వన్డే మ్యాచ్ లు ఆడగా, తరువాత స్థానంలో ఎంఎస్ ధోని 350, రాహుల్ ద్రావిడ్ 344, మహ్మాద్ అజారుద్దీన్ 334, సౌరవ్ గంగూలీ 311, యువరాజ్ సింగ్ 304 తో ముందున్నారు.

రేపటి వన్డేలో విరాట్ ఆడటం ద్వారా భారత్ తరఫున 300 వన్డే మ్యాచ్ లు ఆడిన ఏడో ఆటగాడిగా ఖ్యాతికెక్కనున్నారు. మొత్తం మీద అంతర్జాతీయ ఆటగాళ్లపరంగా చూస్తే కోహ్లి 22 వ ఆటగాడు.
ఇప్పటి వరకూ 299 వన్డే మ్యాచులు ఆడటం ద్వారా 14,085 పరుగులు సాధించాడు. కోహ్లి 2008 లో శ్రీలంక వన్డే మ్యాచ్ ద్వారా అరంగ్రేటం చేశారు. ఛేజ్ మాస్టర్ గా విరాట్ కు పేరుంది. ఎవరికి సాధ్యం కానీ రీతిలో 51 వన్డే సెంచరీలు సాధించాడు.
ప్రపంచంలోనే అత్యధిక వేగంగా 14 వేల పరుగులు సాధించాడు. అంతేకాకుండా వేగంగా 8,000, 9 వేలు, 10 వేలు, 11 వేలు, 12 వేలు, 13 వేలు, 14 వేల పరుగులను వేగంగా సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కారు.
కోహ్లి ఎంతగొప్ప ఆటగాడంటే..
కోహ్లి మూడు వందల వన్డే మ్యాచ్ ఆడటంపై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ స్పందించారు. ‘‘అతని ప్రతిభ గురించి చెప్పడానికి మాటలు లేవు. అతను ఎంత గొప్ప ఆటగాడో చెప్పడానికి గణాంకాలు చాలు, దేశానికి అతను ఎంత పెద్ద సేవకుడో వివరించలేము’’ అని రాహుల్ అన్నారు. ఈ మ్యాచ్ లో కోహ్లి సెంచరీ సాధించాలి.. భారత్ విజయం సాధించాలని అన్నాడు.
భారత్ సెమీస్ లో ఎవరితో తలపడుతుంది?
గ్రూప్ బీ లో ఉన్న భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ కు క్వాలిఫై అయ్యాయి. అయితే రేపు జరిగే మ్యాచ్ లో ఎవరూ విజయం సాధిస్తే వారే టాప్ లో ఉంటారు. గ్రూప్ ఏ లో ఉన్న రెండో స్థానంలో జట్టుతో తలపడుతుంది. భారత్, ఆసీస్, దక్షిణాఫ్రికాతో దుబాయ్ వేదికగా మార్చి 4న సెమీస్ లో పాల్గొంటుంది.
Read More
Next Story