ఆఫ్ఘనిస్తాన్ విజయంపై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్
x

ఆఫ్ఘనిస్తాన్ విజయంపై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్

బాగా ఆడారంటూ ఎక్స్ లో ట్వీట్లు


పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫి లో ఇంగ్లాండ్ పై ఎనిమిది పరుగుల తేడాతో ఆప్ఘనిస్తాన్ విజయం సాధించడంపై క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపించింది. ఇక నుంచి మీ విజయాలు గాలివాటం కాదని, అవి విజయాలుగానే పరిగణిస్తామని అన్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా కాబుల్ జట్టు విజయం పై స్పందించారు.

లాహోర్ లో నిన్న జరిగిన మ్యాచులో ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 325 పరుగులు సాధించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు సాధించాడు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ రెండు బంతులు ఉండగానే 317 పరుగులకు ఆలౌట్ అయింది. అల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ 5/58 చెలరేగడంతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ విజయం తో ఆఫ్ఠన్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ పరాజయంతో ఇంగ్లాండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.
‘‘అంతర్జాతీయ క్రికెట్ లో ఆప్ఘనిస్తాన్ స్థిరమైన ఎదుగుదల స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇక నుంచి మీరు వారి విజయాలను ఎప్పూడు గాలివాటంగా చెప్పలేరు, వారు ఇప్పుడు దీనిని అలవాటుగా మార్చుకున్నారు’’. అని క్రీడా ప్రపంచం సామాజిక మాధ్యమాల్లో ఆఫ్ఘన్ క్రికెటర్లను పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు.
సచిన్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. ‘‘ ఇబ్రహీం జద్రాన్, అద్బుతమైన సెంచరీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్భుతంగా ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ కు మరో చిరస్మరణీయ విజయాన్ని అందించారు. బాగా ఆడారు’’ అని మాస్టర్ బ్లాస్టర్ అన్నాడు.
ఆఫ్ఘన్లను ప్రశంసిస్తూనే భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఉపఖండ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతుందని విమర్శించారు.
‘‘ ఆఫ్ఘన్లు మీరు అద్భుతంగా ఆడతారు. కమ్మల్ కార్టీ, ఇంగ్లాండ్ తరఫున ఎటువంటి సాకులులేకుండా ఉపఖండంలో ఆడటాన్ని సీరియస్ గా తీసుకోండి. అప్పుడే మీరు ఛాంపియన్ ట్రోఫిలో ఆడటానికి జట్టుగా గుర్తింపు పొందుతారు’’ అని శాస్త్రి రాసుకొచ్చాడు.
2023 ప్రపంచకప్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కు మెంటర్ గా పనిచేసిన భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా సోషల్ మీడియాలో జట్టును అభినందించి, జట్టును ఈ ప్రసిద్ద విజయానికి అభినందించాడు.
‘‘ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ విజయానికి అర్హులు ఎందుకంటే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల మనస్సు దోచుకున్నారు. ’’ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ లెజెండ్ షోయబ్ అక్తర్ కూడా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ దశను దాటి ముందుకు సాగాలని ఆకాంక్షించాడు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా కాబుల్ జట్టు ను ప్రశంసించారు. తమ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేదని అన్నాడు. ఆఫ్ఘన్ అద్బుతంగా ఆడుతోంది. వారు పూర్తిగా ఈ విజయానికి అర్హులు. ఇంగ్లాండ్ చాలాకాలంగా వైట్ బాల్ గేమ్ సరిగా ఆడట్లేదు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఫలితం ఆశ్యర్యం కలిగించదని ఆయన ఎక్స్ లో రాసుకొచ్చారు.
Read More
Next Story