బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్?
x
ఢిల్లీ ఆటగాడు.. మిథున్ మన్హాస్

బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్?

గత నెలలోనే అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన రోజర్ బిన్నీ


ప్రపంచంలోనే అత్యధిక ధనిక బోర్డుగా పేరున్న బీసీసీఐకి తదుపరి అధ్యక్షుడిగా ఢిల్లీ మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ముందు వరుసలో ఉన్నారు. ఈ నెల 28న రాజధానిలో జరిగే తదుపరి ఏజీఎం సమావేశంలో కొత్త ఆఫీస్ బేరర్ల ఎన్నుకోనున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించని మన్హాస్, బీసీసీఐ అధ్యక్ష పదవికి మాత్రం అందరి మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. 2019 లో బీసీసీఐ రాజ్యాంగ సవరణ తరువాత వరుసగా కొత్తవారికి బీసీసీఐ అధ్యక్ష పదవికి అవకాశాలు వస్తున్నాయి.
భారత్ క్రికెట్ లోని కీలక నిర్ణయాల కోసం సమావేశమైన బోర్డు సభ్యులు కోశాధికారి, ఐపీఎల్ చైర్మన్లతో సహ పలు రంగాలకు అభ్యర్థులపై చర్చించారు. రోజర్ బిన్నీ పదవీకాలం గత నెలతో ముగిసింది.
ఆయన వయస్సు 70 కి చేరుకుంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ఆయన ఈ పదవిలో కొనసాగకూడదు. కొత్త ఆమోదించిన జాతీయ క్రీడా బిల్లు నిర్వాహాకులు 75 సంవత్సరాల వరకూ సేవలందించడానికి అనుమతి ఇచ్చింది. అయితే అది అమలులోకి రావడానికి ముందే ఆయన పదవీకాలం ముగిసింది.
ఇటీవల కాలాల్లో బోర్డు మాజీ క్రికెటర్లను అధ్యక్షులుగా ప్రాధాన్యం ఇస్తోంది. అక్టోబర్ 2022 నుంచి 2025 వరకు రోజర్ బిన్నీ పదవీకాలానికి ముందు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మూడు సంవత్సరాలు అధ్యక్షుడిగా వ్యవహరించారు.
ఈ రోజు జరిగే ఏజీఎం మన్హాస్ క్రికెట్ డైరెక్టర్ గా పనిచేసిన జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నామినీగా హజరవుతారు. ఇతర ప్రతినిధులలో కర్ణాటక తరఫున మాజీ స్పిన్నర్ రఘురామ్ భట్, పంజాబ్ తరఫున హర్భజన్ సింగ్ ఉన్నారు. 2019 నుంచి 2022 వరకూ బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన సౌరభ్ గంగూలీ బెంగాల్ కు ప్రాతినిధ్యం వహిస్తారు.
గత నెలలో బిన్నీ పదవీకాలం ముగియడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా కార్యదర్శి దేవజిత్ సైకియా తో పాటు రాజీవ్ శుక్లాతో సహ ఇతర కీలక ఆఫీస్ బేరర్లు తమ పదవులను నిలబెట్టుకుంటారని తెలుస్తోంది.
మిథున్ మన్హాస్ ఎవరూ?
భారత్ దేశవాశీ క్రికెట్ లో ఒక ప్రముఖ ఆటగాడు మిథున్ మన్హాస్. 1997-98 సీజన్ లో అరంగ్రేటం చేశాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్, వీవీఎస్, గంగూలీ కాలంలో ఢిల్లీ తరఫున నమ్మకమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా పేరు పొందాడు.
2007-08 లో మన్హాస్ ఢిల్లీ జట్టు రంజీ ట్రోఫి గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్ లో 57.56 సగటుతో 921 పరుగులు సాధించాడు. కుడి బ్యాట్స్ మెన్, బౌలింగ్ గా సేవలందించాడు.
కొంతకాలం వికెట్ కీపర్ గా కూడా కెరీర్ కొనసాగించాడు. 157 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడి 45.82 సగటుతో 9, 714 పరుగులు సాధించాడు. అందులో 27 సెంచరీలు, 49 హఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, పూణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో కలిసి ఆడాడు.
ఆటపై లోతైన అవగాహన ఉన్న ఆయన మైదానం బయట, వెలుపల తన నాయకత్వ పాటవాలను నిరూపించుకున్నాడు. ఇప్పుడు భారత క్రికెట్ ప్రధాన పాలక మండలిని దాని తదుపరి అధ్యాయంలోకి నడిపించే శిఖరాగ్రంలో నిలిచాడు.
Read More
Next Story