Rachin Ravindra
x
Rachin Ravindra

న్యూజిల్యాండ్ బౌలర్ రచిన్ రవీంద్ర దెబ్బకు విలవిల్లాడిన శ్రీలంక

బ్యాట్స్ మెన్ విజృంభించాల్సిన టీ20 ఫార్మాట్ లో ఒక బౌలర్ విజృంభిస్త ప్రత్యర్ధి జట్టు ఏ విధంగా విలవిల్లాడుతుందో రచిన్ బౌలింగే నిదర్శనం


పొట్టిక్రికెట్ టీ20లో బ్యాట్స్ మెన్ దే రాజ్యం. అసలీ ఫార్మాట్ మొదలుపెట్టిందే బ్యాట్స్ మెన్ విజృంభణకోసం. ఇలాంటి ఫార్మాట్లో ఒక బౌలర్ విజృంభిస్తే ప్రత్యర్ధి జట్టు విలవిల్లాడాల్సిందే. ఇపుడు విషయం ఏమిటంటే బుధవారం కొలంబోలో జరిగిన (T20)సూపర్ 8 మ్యాచ్ లో(New Zealand) న్యూజిల్యాండ్ బౌలర్(RachinRavindra) రచిన్ రవీంద్ర బౌలింగ్ దెబ్బకు (Sri Lanka)శ్రీలంక బ్యాట్స్ మెన్ విలవిల్లాడిపోయారు. నిజానికి కివీస్ స్పినర్లకన్నా శ్రీలకంలోనే మంచి స్పిన్నర్లున్నారు. అయితే కొలంబో పిచ్ నుండి సింహళం బౌలర్లు సరైన అడ్వాంటేజ్ తీసుకోలేకపోయారు. ఇదేసమయంలో కివీస్ బౌలర్ రచిన్ మాత్రం బ్రహ్మాండంగా అదరగొట్టేశాడు.

మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేసింది. నిజానికి టీ20లో 168 పరుగులు ఏమంతా పెద్ద స్కోర్ కాదు. ఈ స్కోర్ చేరకుండా ప్రత్యర్ధిని కట్టడిచేయటం చాలా కష్టమే. ఓవర్ కు 10-12 పరుగులు చేస్తున్న సమయంలో ఓవర్ కు కివీస్ 8 పరుగులు మాత్రమే చేయటం తక్కువస్కోరనే చెప్పాలి. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీర చెరో మూడు వికెట్లు తీసుకుని కవీస్ ను తక్కువస్కోరుకే కట్టడిచేశారు.

అయితే 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంకకు కవీస్ బౌలర్ రచిన్ ఆరంభంలోనే పెద్ద షాకిచ్చాడు. శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ ను రచిన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ సీఫర్డ్ 11 పరుగులకే పెవిలియన్ కు పంపారు. ఇక్కడి నుండి రచిన్ వీరవిహారం మొదలైంది. పవన్ రత్నాయకే 10 పరుగులకే రచిన్ బౌలింగ్ లో రెండో వికెట్ గా దొరికిపోయాడు. తర్వాత శానక 3 పరుగులకే రచిన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

ఆతర్వాత వచ్చిన హేమంత కూడా రచిన్ బౌలింగులో 3 పరుగులకే ఔటైపోయాడు. అంటే నలుగురు కీలక బ్యాట్స్ మెన్ కుశాల్ మెండిస్, పవన్ రత్నాయకే, శానక, హేమంత ను రచిన్ ఔట్ చేయటంతో శ్రీలకంకు ఓటమి తప్పలేదు. బ్యాట్స్ మెన్ విజృంభించాల్సిన టీ20 ఫార్మాట్ లో ఒక బౌలర్ విజృంభిస్త ప్రత్యర్ధి జట్టు ఏ విధంగా విలవిల్లాడుతుందో రచిన్ బౌలింగే నిదర్శనం.

Read More
Next Story