సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా
x

సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా

టీ20 వరల్డ్ కప్ లో సోమవారం ఆతిథ్య వెస్టీండీస్ ను దక్షిణాఫ్రికా ఓడించింది. దీంతో గ్రూప్ 2 లో టాపర్ గా నిలిచిన ప్రోటీస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.


టీ20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా, ఆతిథ్య వెస్టీండీస్ ను ఓడించింది. వర్షం కారణంగా ఇక్కడ జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్ లో విండీస్ పై డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ప్రోటీస్ విజయం సాధించింది. దీంతో ప్రోటీస్ దాదాపు పది సంవత్సరాల తరవాత టీ20 క్రికెట్ లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ రోస్టన్ చేజ్ 42 బంతుల్లో 52 పరుగులు సాధించడంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు సాధించింది. అయితే ఛేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 15/2 తో ఉన్న సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది.
అనంతరం దక్షిణాఫ్రికాకు 17 ఓవర్లలో 123 పరుగుల లక్ష్యంగా నిర్దేశించారు. ప్రోటీస్ 16.1 ఓవర్లలోనే ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. దక్షిణాఫ్రికాకు విజయం తేలిగ్గా రాలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీసిన విండీస్, ఏదైన అద్భుతం చేస్తుందా అనిపించింది.
చివర్లో రోస్టన్ ఛేజ్ మూడు వికెట్లు తీసి సౌతాఫ్రికా శిబిరంలో గుబులు రేపాడు. అయితే ఆల్ రౌండర్ యన్ సెన్ చివరి దాకా ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గ్రూప్ 2 నుంచి ఇది వరకే ఇంగ్లండ్ సెమీస్ కు చేరింది. విండీస్ పై విజయంతో దక్షిణాఫ్రికా గ్రూప్ టాపర్ గా నిలిచి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది.
సంక్షిప్త స్కోర్లు: వెస్టిండీస్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 (రోస్టన్ చేజ్ 52, కైల్ మేయర్స్ 35; తబ్రైజ్ షమ్సీ 3/27) దక్షిణాఫ్రికా: 16.1 ఓవర్లలో 7 వికెట్లకు 124 (ట్రిస్టన్ స్టబ్స్ 29, హెన్రిచ్ క్లాసెన్ 12 22; రోస్టన్ 22; , ఆండ్రీ రస్సెల్ 2/19) PTI



Read More
Next Story