
IPL 2025.. టాస్ గెలిచి.. బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
ఐపీఎల్ 2025 సీజన్ మొదలైంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్)లో ఈ రోజు (మార్చి23న) జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తొలి ఐపీఎల్ చాంపియన్లు కాగా, 2016 విజేత అయిన SRH గత సంవత్సరం రన్నర్-అప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
సన్‌రైజర్స్ హైదరాబాద్ XI జట్టు సభ్యులు..
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హైన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్‌జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.
ఇంపాక్ట్ సబ్‌లు: సచిన్ బేబీ, జయదేవ్ ఉనద్కట్, జీషాన్ అంసారీ, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్.
రాజస్థాన్ రాయల్స్ XI జట్టు సభ్యులు..
యశస్వి జైస్వాల్, శుభం దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), శిమ్రాన్ హెట్‌మైర్, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణా, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్హక్ ఫరూఖీ.
ఇంపాక్ట్ సబ్‌లు: సంజూ శాంసన్, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాష్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, క్వెనా మాఫాకా.