కోహ్లీ మానసికంగా భలే స్ట్రాంగ్
x
ఆండీ ఫ్లవర్

కోహ్లీ మానసికంగా భలే స్ట్రాంగ్

నేటీ ఐపీఎల్ ప్రారంభం..సన్ రైజర్స్ తో ఆర్సీబీ ఢీ


Click the Play button to hear this message in audio format

విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నాడని, మానసికంగా దృఢంగా ఉన్నాడని ఆర్సీబీ కోచ్ ఆండీ ప్లవర్ అన్నారు. నేటి నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆండీ మీడియాతో మాట్లాడారు.

డిఫెండింగ్ ఛాంపియన్‌లుగా టోర్నమెంట్‌లోకి అడుగుపెడుతున్నప్పటికీ, తమ జట్టు కొత్త దృక్పథంతో ఈ కొత్త సీజన్‌ను ప్రారంభిస్తుందని అన్నారు. ‘‘ నిజంగా మేము గత ఏడాది ఛాంపియన్లమే కానీ మేమంతా కొత్త సవాళ్ల కోసం ఎదురుచూస్తున్నాము. జీవితంలో మార్పు ఎప్పుడూ ఉంటుందనేది ఒక సత్యం.
మేము ఇప్పుడు ఒక విభిన్నమైన జట్టుగా ఉన్నాము, ఆటగాళ్లకు ఒక సంవత్సరం వయసు పెరిగింది. మా ప్రత్యర్థులు కొన్ని విధాలుగా బలం ఫుంజుకున్నారు. పరిస్థితులు కూడా భిన్నంగా ఉండవచ్చు, కాబట్టి ఈ ఐపీఎల్ సవాలు గత ఐపీఎల్‌కు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
మేము దాని గురించి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము” అని ఫ్లవర్ అన్నారు. చిన్నస్వామి స్టేడియంలో జట్టు అనుభవాలను గురించి మాట్లాడుతూ, ఈ వేదికపై గత మ్యాచ్‌ల నుంచి జట్టు విలువైన పాఠాలు నేర్చుకుందని ఫ్లవర్ పేర్కొన్నాడు.
“గత సంవత్సరం చిన్నస్వామిలో మేము మా మొదటి మూడు మ్యాచ్‌లలో ఓడిపోయాము. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాము. ఈసారి కూడా పరిస్థితులు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. మేము వాటిని అంచనా వేయాలి ” అని కోచ్ అన్నారు.
కోహ్లీ పట్టుదలపై ఫ్లవర్ మాట్లాడుతూ, జట్టులోని నాయకత్వ బృందం గురించి కూడా మాట్లాడాడు. కెప్టెన్ రజత్ పాటిదార్, వైస్ కెప్టెన్ జితేష్ శర్మలను ప్రశంసించాడు. “రజత్ కెప్టెన్సీ చేపట్టిన తొలి ఏడాదే ఆర్‌సీబీని ట్రోఫీ వైపు నడిపించడం చాలా అద్భుతం.
అతను అందరికీ బాగా నచ్చే వ్యక్తి, డ్రెస్సింగ్ రూమ్‌లో అతనికి మంచి గౌరవం ఉంది. అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు, దీనిని బౌలర్లు ఎంతగానో మెచ్చుకుంటారు. జితేష్ కూడా చాలా మంచి డిప్యూటీ. అతను చురుకైనవాడు, వ్యూహాత్మకంగా అవగాహన ఉన్నవాడు. వికెట్ల వెనుక నుంచి ఆటను చాలా వరకు గమనిస్తాడు, కాబట్టి వికెట్ల చుట్టూ వారిద్దరూ కలిసి పనిచేయడం జట్టుకు ఎంతో విలువైనది,” అని ఆయన అన్నాడు.
“విరాట్ మానసికంగా చాలా మంచి స్థితిలో కనిపిస్తున్నాడు. అతను తనపై తనకు చాలా నమ్మకంతో ఉన్నాడు. ఇంకా గెలవాలనే కసితో ఉన్నాడు. శిక్షణలో అతను బంతిని కొట్టే తీరు చూస్తుంటే, అతను తన అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు,” అని ఫ్లవర్ అన్నారు.

తొలి మ్యాచ్ కు హేజిల్ వుడ్ అందుబాటులో....

ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ హేజిల్ ఉడ్ అందుబాటులో ఉండడని, తమకు బలమైన స్ఠానిక బౌలర్లు అందుబాటులో ఉన్నారని కోచ్ చెప్పుకొచ్చారు. “జట్టులోని భారత సీమర్లతో మేము సంతోషంగా ఉన్నాము. రసిఖ్ (సలాం) గత ఏడాది కంటే ఇప్పుడు మెరుగైన బౌలర్, అతను తన ఆటను మెరుగుపరుచుకోవడానికి చాలా కష్టపడ్డాడు.
మంగేష్ (యాదవ్)ను జట్టులోకి తీసుకోవడం కూడా మాకు సంతోషాన్నిచ్చింది. ఇటీవల అభినందన్ (సింగ్) కనబరుస్తున్న ప్రగతి మాకు ప్రోత్సాహాన్నిచ్చింది. ఈ టోర్నమెంట్‌లో వారికి అవకాశాలు లభిస్తాయి. ఈ ముగ్గురికి జట్టును మంచి స్థితిలో నిలబెట్టే గుణాలు ఉన్నాయి,” అని ఫ్లవర్ అన్నారు.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గురించి కూడా ఫ్లవర్ తాజా సమాచారం అందించారు. "హేజిల్‌వుడ్ నిన్న వచ్చాడు, అతను ఫిట్‌గా కనిపిస్తున్నాడు. అతను తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటం, మా సమావేశాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.
అతను ఇప్పుడే వచ్చాడు కాబట్టి రేపటికి సిద్ధంగా ఉండడు, కానీ మేము అతని ఫిట్‌నెస్‌ను నిశితంగా పర్యవేక్షిస్తాము. అతను త్వరలో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టడం కోసం ఎదురుచూస్తున్నాము " అని కోచ్ ఆంఢీ ప్లవర్ అన్నారు.
Read More
Next Story