బంగ్లాదేశ్ క్రికెటర్ ను విడుదల చేయండి: కేకేఆర్ కు బీసీసీఐ ఆదేశం
x
బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్

బంగ్లాదేశ్ క్రికెటర్ ను విడుదల చేయండి: కేకేఆర్ కు బీసీసీఐ ఆదేశం

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేస్తున్న నేపథ్యంలో క్రికెట్ నియంత్రణ మండలి ముందస్తు చర్యలు


భారత్- బంగ్లాదేశ్ మధ్య రోజు రోజుకి ఘర్షణాత్మక వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో 2026 ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను జట్టు నుంచి తొలగించాలని బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంఛైజీ కేకేఆర్ ను ఆదేశించింది.

గత నెలలో జరిగిన ఆటగాళ్ల వేలంలో సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీపడి వేలంలో ముస్తాఫిజుర్ ను రూ. 9.20 కోట్లకు కోల్ కత నైట్ రైడర్స్ జట్టు కోనుగోలు చేసింది.
అవసరమైతే కేకేఆర్ జట్టుకు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని బీసీసీఐ తెలిపింది. ‘‘కోల్ కత నైట్ రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ ను విడుదల చేయాలని బీసీసీఐ కోరింది. అవసరమైతే వారు అతని స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవచ్చు. ఈ అభ్యర్థన కనుక వస్తే బీసీసీఐ పరిశీలిస్తుంది’’ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు.
ఇటీవల కీలక పరిణామాలు..
కోల్ కత నైట్ రైడర్స్ ను బీసీసీఐ నుంచి ఎందుకు ఇలా అడిగిందని మీడియా బీసీసీఐ కార్యదర్శిని ప్రశ్నించింది. ‘‘ ఇటీవల పరిణామాల కారణంగా’’ అని ఆయన బదులిచ్చారు.
ఇటీవల దేశంలో ఒక హిందువుల హత్య జరుగుతోంది. అక్కడ మైనారిటీల భద్రత పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసిన తరువాత రెహమాన్ భారత్ కు రావడం పట్ల బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది.
ఈ విమర్శలు కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పై కూడా తాకాయి. ప్రస్తుత పరిస్థితి లో బౌలర్ ను కేకేఆర్ లోకి తీసుకోవడం అవసరమా అనే పిలుపును అధికారి బీజేపీకి చెందిన కొంతమంది రాజకీయ లేవనెత్తారు.
రెహమాన్ 2016 నుంచి ఎనిమిది ఐపీఎల్ ఎడిషన్లలో పాల్గొన్నాడు. 2019, 2020 లో ఐపీఎల్ ఆడలేదు. ఇప్పటి వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్, సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలిసారిగా కేకేఆర్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు.
రెండు క్రికెట్ బోర్డులు..
గత సంవత్సరం భారత్, బంగ్లాదేశ్ రెండు దేశాల క్రికెట్ బోర్డులు వైట్ బాల్ ద్వైపాక్షిక సిరీస్ ను వాయిదా వేసుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ లో సిరీస్ జరుగుతుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం వెల్లడించింది.
అయితే బీసీసీఐ మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం అక్కడ పరిస్థితుల దృష్ట్యా క్రికెటర్లను బంగ్లాకు పంపడానికి అంగీకరించకపోవచ్చు. గత ఏడాది ఆగష్టులో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో భారత్ కు శరణార్థిగా వచ్చిన బంగ్లా ప్రధాని హసీనా తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అనేక మంది విద్యార్థులను నిరసనల సందర్భంలో హత్య చేసిందని ప్రత్యేక ట్రిబ్యూనల్ మాజీ ప్రధానికి మరణశిక్ష విధించింది.
భారత్ హైకమిషనర్ ప్రణయ్ వర్మను ఢాకా ఐదుసార్లు పిలిపించగా, బంగ్లాదేశ్ లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్ కూడా బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లాను పిలిపించింది. సంబంధాలను మరింత క్లిష్టతరం చేస్తూ పాకిస్తాన్ తో కూడా బంగ్లాదేశ్ చేతులు కలపడం పరిస్థితి మరింత దిగజారేలా చేసింది.
Read More
Next Story