సచిన్‌కు BCCI లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు
x

సచిన్‌కు BCCI లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు

"2024 సంవత్సరానికి సీకే నాయుడు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు అందుకోనున్నారు.


Click the Play button to hear this message in audio format

ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌(Sachin Tendulkar) ఖాతాలోకి మరో అవార్డు చేరింది. BCCI లైఫ్‌టైం అచీవ్‌మెంట్అవార్డ్ (Lifetime Achievement Award) ఆయనను వరించింది. రేపు (ఫిబ్రవరి 1న) జరిగే బోర్డు వార్షికోత్సవంలో ఈ పురస్కారాన్ని సచిన్‌ అందుకోనున్నారు.


51 ఏళ్ల టెండూల్కర్.. ఇండియా తరఫున 664 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. 200 టెస్టులు, 463 వన్డేలు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచారు. టెస్ట్ మ్యాచ్‌ల్లో 15,921 పరుగులు, వన్డే‌ల్లో 18,426 పరుగులతో అద్భుత ప్రదర్శన కనపర్చారు. అయితే తన కెరీర్‌లో కేవలం ఒకే ఒక్క టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ మాత్రమే ఆడారు. ఈ అవార్డును 2023లో భారత మాజీ ప్రధాన కోచ్ రవి శాస్త్రి, ప్రఖ్యాత వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్‌కు ప్రదానం చేశారు.


సీకే నాయుడు గురించి..

భారత తొలి కెప్టెన్ కటారీ కనకయ్య నాయుడు గౌరవార్థం ఈ పురస్కారాన్ని 1994లో ఏర్పాటుచేశారు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ.. సీకే నాయుడు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ పేరిట అవార్డు ప్రవేశపెట్టింది. 1895 అక్టోబర్ 31న నాగ్‌పుర్‌లో జన్మించిన నాయుడు పాఠశాల రోజులనుంచే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ చూపేవారు. రంజీ ఆటగాడిగా మంచి గుర్తింపు పొందారు. భారత క్రికెట్ జట్టు టెస్ట్ మ్యాచ్‌లకు మొట్టమొదటి కెప్టెన్ కూడా ఆయనే. తన 62 ఏళ్ల వయసులోనూ రంజీ ట్రోఫీలో ఆడి తన సత్తా చాటారు. ఆ మ్యాచ్‌లో 52 పరుగులు చేశారు. ఆపై రిటైర్ అయ్యాక జట్టు సెలక్టర్‌గా, రేడియోలో కామెంటర్‌గానూ చేశారు.1955లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.


Read More
Next Story