టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా?
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? ఆ ఇండియన్ క్రికెటర్ ఎవరు? సానియా తండ్రి ఏమంటున్నారు?
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇండియన్ క్రికెటర్ మహ్మద్ షమీని పెళ్లాడబోతోందని వస్తున్న వార్తలను ఆమె తండ్రి ఇమ్రాన్ ఖండించారు.
“అవన్నీ వదంతులే.. సానియా అసలు అతన్ని కలవలేదు." అని సానియా తండ్రి ఇమ్రాన్ వివరణ ఇచ్చారు. సానియా, పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ ఈ ఏడాది ప్రారంభంలో విడాకులు తీసుకున్నారు. షమీ కూడా అతని భార్య హసిన్ జహాన్ నుంచి విడిపోయారు.
మాలిక్‌తో విడిపోయినట్లు ప్రకటించిన 5 నెలల తర్వాత సానియా ఇటీవల హజ్‌కు పవిత్ర యాత్రకు సిద్ధమయ్యారు. “నేను పరివర్తన యాత్రకు వెళ్లున్నా. ఏవైనా తప్పులుంటే క్షమించండి” అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
🤲🏽❤️🕋 pic.twitter.com/oKOnQ0FInU
— Sania Mirza (@MirzaSania) June 9, 2024
2023 ODI ప్రపంచ కప్‌లో సత్తా చాటిన షమీపై గృహహింస, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలున్నాయి. భార్య హసిన్ జహాన్ విడిపోయి న్యాయ పోరాటం చేస్తోంది.
Next Story