టీ20 లకు మరొక క్రికెటర్ గుడ్ బై.. ఎవరా ఆటగాడు..
x

టీ20 లకు మరొక క్రికెటర్ గుడ్ బై.. ఎవరా ఆటగాడు..

భారత్ టీ20 కప్ లో విశ్వవిజేతగా నిలవగానే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లిలు తమ టీ20 కెరీయర్ కు వీడ్కోలు పలికగా, తాజాగా స్పిన్ ఆల్ రౌండర్


భారత జట్టు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత టీ20 వరల్డ్ కప్ ను గెలిచింది. దశాబ్ధం తరువాత ఐసీసీ టైటిల్ కరువును తీర్చుకుంది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి కప్ గెలవగానే తమ రిటైర్ మెంట్ ను ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చేరాడు.

బార్బడోస్ లోని బ్రిడ్జిటౌన్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ తన టీ20 కెరీర్ లో చివరిదని జడేజా ప్రకటించారు. రవీంద్ర జడేజా వయస్సు ప్రస్తుతం 35 సంవత్సరాలు. ఈ ఐసీసీ టోర్నమెంట్ లో జడేజా ఆశించిన మేర ప్రదర్శన చేయలేడు. దీంతో రిటైర్ మెంట్ ఇవ్వడానికి ఇదే సరైన సమయమని భావించి ఈ ప్రకటన చేశారు. దీంతో టీ20 క్రికెట్ నుంచి రిటైరైన క్రికెటర్ల సంఖ్య మూడుకు చేరింది.

ఆదివారం జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. జడేజా ఇలా రాసుకొచ్చాడు. “ సంతోషంతో ఉన్న హృదయంతో నేను టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నాను. ఇక నుంచి అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకుంటాను. నేను ఎల్లప్పుడు దేశం కోసం ఉత్తమమైన ప్రతిభను అందించాను. ఇతర ఫార్మాట్ కు అందుబాటులో ఉంటాను. T20 ప్రపంచకప్‌ను గెలవడంతో నా కల నిజమైంది, ఇది నా T20 అంతర్జాతీయ కెరీర్‌లో పరాకాష్ట. నాకు మద్ధతు అందించిన అందరికి ధన్యవాదాలు.
2009లో శ్రీలంకపై టీ20ల్లో అరంగేట్రం చేసిన జడేజా ఇప్పటి వరకూ 74 మ్యాచ్‌లు ఆడి 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో జడేజా విఫలం అయ్యాడు. మరో వైపు యువ ప్రతిభ దూసుకురావడంతో వారికి అవకాశం ఇవ్వడానికి సీనియర్లు తమంతట తామే తప్పుకుంటున్నారు.
ఇప్పటికే విరాట్, రోహిత్ కూడా యువ ప్రతిభకు అవకాశం ఇవ్వడానికే టీ20 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గత కొద్ది కాలంగా సీనియర్ క్రికెటర్లు టీ20 సిరీస్ లో ఆడట్లేదు. 2022 లో ఆస్ట్రేలియాలో జరిగిన సెమీస్ లో ఓటమి తరువాత పాండ్యా నేతృత్వంలో యువటీమ్ ను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కోచ్ గా రాహూల్ ద్రావిడ్ కూడా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.
Read More
Next Story