
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ : 19 సిక్సర్లు బాదిన ఢిల్లీ కెప్టెన్
68 బంతుల్లో 181 పరుగులు.. తమిళనాడుపై ఢిల్లీ భీభత్సం..
ఇండోర్ లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి టీ20 టోర్నమెంట్ లో ఢిల్లీ కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య తమిళనాడుపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ కేవలం 68 బంతుల్లోనే 181 పరుగులు చేసి, భారత్ టీ20 చరిత్రలో కొత్త రికార్డులు లిఖించాడు.
డాలీ కాలేజ్ గ్రౌండ్ లో ఆర్య చేసిన అద్బుత విన్యాసం.. టీ20 క్రికెట్ లో ఒక భారతీయ బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను నమోదు చేసేలా చేసింది. ఇది అతని ఆటను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లి దేశంలోని అత్యంత విధ్వంసకర యువ బ్యాటర్లలో ఒకడిగా తనను తాను నిరూపించుకునేలా చేసింది.
కేవలం 36 బంతుల్లోనే..
ఆర్య బ్యాటింగ్ పుణ్యామా అని తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఆర్య ఇన్నింగ్స్ లో కేవలం ఏడు ఫోర్లు మాత్రమే ఉన్నాయి. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడే 25 ఏళ్ల ఆర్య, ఆరంభం నుంచి అడ్డుకోలేని విధంగా చెలరేగిపోయాడు. పవర్ ప్లే లోనే ఎనిమిది సిక్సర్లు బాదాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అతని భీకరమైన బ్యాటింగ్ తో తమిళనాడు బౌలింగ్ దళం కకావికలమైంది.
ఆర్య అద్భుతమైన ఇన్నింగ్స్ లో అతని అసాధారణమైన పవర్ హిట్టింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అతను కొట్టిన 19 సిక్సర్లతో ఒక టీ20 ఇన్నింగ్స్ లో ఫిన్ అలెన్ నెలకొల్పిన 19 సిక్సర్ల ప్రపంచ రికార్డును సమం చేశాడు. తద్వారా ఈ ఢిల్లీ స్టార్ ఈ ఫార్మాట్ లోని అత్యంత విధ్వంసకర ప్రదర్శనకారులలో ఒకడిగా నిలిచాడు.
ఈ ఇన్నింగ్స్ తో ఆర్య ఇంతకుముందు భారత ఒపెనర్ కేఎల్ రాహుల్ నెలకొల్పిన 151 నాటౌట్ టీ20 రికార్డును సమం చేశాడు. తద్వారా ఈ ఢిల్లీ స్టార్ ఈ ఫార్మాట్ లోని అత్యంత విధ్వంసకర ప్రదర్శనకారులలో ఒకడిగా నిలిచాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో తన సంచలన ప్రదర్శనలతో ఇప్పటికే వార్తల్లో నిలిచిన ఆర్య, తన ప్రతిభ కేవలం సామర్థ్యానికి మించినదని మరోసారి నిరూపించుకున్నాడు.
ఒక టీ20 మ్యాచ్ లో 181 పరుగులు చేయడం అద్భుతం. అలా చేస్తూనే క్రికెట్ లోని అత్యధిక సిక్సర్ల రికార్డులను సవాల్ చేయడం అనేది పూర్తిగా వేరే విషయం.
భారత బ్యాటర్లు.. చేసిన అత్యధిక టీ20 స్కోర్లు..
181 - ప్రియాంశ్ ఆర్య - ఢిల్లీ వర్సెస్ తమిళనాడు, 2026
151 నాటౌట్- కేఎల్ రాహుల్ - ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, 2026
151 నాటౌట్- తిలక్ వర్మ - హైదరాబాద్ వర్సెస్ మేఘాలయా 2024
టీ20 ఇన్నింగ్స్ లలో అత్యధిక సిక్సర్లు..
ఫిన్ అలెన్ -19 సిక్సర్లు - శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ వర్సెస్ వాషింగ్టన్ ఫ్రీడమ్, 2025
ప్రియాంశ్ ఆర్య - 19- ఢిల్లీ వర్సెస్ తమిళనాడు, 2026
క్రిస్ గేల్- 18- రంగపూర్ రైడర్స్ వర్సెస్ ఢాకా డైనమేట్స్, 2017
సాహిల్ చౌహన్- 18- ఎస్టోనియా వర్సెస్ సైప్రస్ 2024
Next Story
