టీ20 వరల్డ్ కప్: సూపర్ ఎయిట్ లో సంచలనం, ఆసీస్ ను ఓడించిన ఆఫ్ఘన్లు
x

టీ20 వరల్డ్ కప్: సూపర్ ఎయిట్ లో సంచలనం, ఆసీస్ ను ఓడించిన ఆఫ్ఘన్లు

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న సూపర్ ఎయిట్ మ్యాచుల్లో ఆదివారం ఉదయం అద్బుతం చోటుచేసుకుంది. మాజీ ఛాంపియన్ ఆసీస్ కు ఆఫ్ఘన్ జట్టు షాక్ ఇచ్చింది.


టీ20 ప్రపంచకప్ లో సంచలనం నమోదు అయింది. మాజీ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఆఫ్ఘన్ జట్టు ఓడించింది. దీంతో సాదాసీదాగా జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లకు ఒక ఊపు వచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో ఆఫ్ఘన్ జట్టు న్యూజిలాండ్ కు షాక్ ఇవ్వగా, ఇప్పడు ఆస్ట్రేలియా వంతు వచ్చింది. అయితే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా బౌలర్ మాజీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వరుసగా రెండో మ్యాచ్ లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా కమిన్స్ హ్యాట్రిక్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఆఫ్ఘన్ బౌలర్ గుల్బాదిన్ ప్రపంచకప్ లో గుర్తుంచుకునే( 4/20) ప్రదర్శన చేశారు. దీంతో ఆస్ట్రేలియా పై 21 పరుగుల తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. పిచ్ స్లోగా ఉండి బ్యాటింగ్ కష్టంగా మారింది. ఈ వికెట్ పై మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు సాధించింది. బదులుగా ఆస్ట్రేలియా 19. 2 ఓవర్లలో 127 పరుగులక ఆలౌట్ అయింది.
దీంతో గ్రూప్ 1 లో సెమీస్ రేస్ ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్ ను భారత్ తో తలపడబోతోంది. ఆసీస్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ ను తప్పక గెలవాల్సిందే. ఆఫ్ఘన్ మరో మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఇప్పుడు ఆసీస్ ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవాలని కోరుకోవాలి. లేదంటే దానికి ముప్పు తప్పదు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ ఇప్పటికే అనధికారికంగా సెమీస్ చేరుకున్నట్లే అయింది.
ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) తొలి వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి మంచి పునాది వేశారు. అయితే ప్యాట్ కమిన్స్ వరుస ఓవర్లో హ్యాట్రిక్ నమోదు చేసి ఆఫ్ఘన్ జట్టు భారీ స్కోర్ సాధించకుండా కట్టడి చేశారు. కమిన్స్ కు ఇది ఈ ప్రపంచకప్ లో వరుసగా రెండో హ్యాట్రిక్.
అయితే ఛేజింగ్ లో ఆసీస్ కూడా ట్రబుల్ కు గురి అయింది. పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 32 పరుగులే చేసింది. అయితే గ్లెన్ మాక్స్‌వెల్ 41 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే గుల్భాదిన్ నాయబ్ సరైన సమయంలో బౌలింగ్ కు దిగి మ్యాచ్ ను టర్న్ చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, ఆప్ఘన్ ను ఓడించింది. అప్పుడు గ్లెన్ మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు కూడా మ్యాక్సీనే జట్టు గెలుపు కోసం పోరాడిన ఫలితం లేకుండా పోయింది.
నవీన్ ఉల్ హాక్ ఆరంభం..
ఆఫ్ఘన్ బౌలర్ నవీన్ ఆరంభంలోనే డేంజరస్ బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో డక్ అవుట్ గా హెడ్ పెవిలియన్ చేరాడు. తరువాత కెప్టెన్ మిచెల్ మార్ష్ ను తెలివిగా బోల్తా కొట్టించాడు. తరువాత మరో ఒపెనర్ వార్నర్ ను నబీ వెనక్కి పంపాడు. వెంటనే వికెట్లు పడటంతో ఆసీస్ ఆత్మరక్షణలో పడింది. పవర్ ప్లే ముగిసే నాటికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులే సాధించింది. ఈ వరల్డ్ కప్ లో ఇదే ఆ జట్టు అత్యల్ప స్కోర్.
తరువాత బ్యాటింగ్ కు వచ్చిన మ్యాక్స్ వెల్, స్టాయినిస్ ఇన్సింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశారు. ఇద్దరు స్వేచ్చగా సింగిల్స్ తీస్తూ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశారు. అయితే తరువాత బౌలింగ్ కు దిగిన గుల్భాదిన్ స్టాయినిస్ ను వెనక్కి పంపాడు. 12, 13 ఓవర్లో ప్రమాదాన్ని ముందే ఊహించిన మ్యాక్స్ వెల్ సిక్సర్లతో ఛేజింగ్ ను త్వరగా ముగించే ప్రయత్నం చేశాడు. అయితే గుల్భాదిన్ 15 ఓవర్లో మ్యాక్సీ ని పెవిలియన్ పంపి మ్యాచ్ ను ఆప్ఘన్ ను వైపు తిప్పాడు. తరువాత ఆసీస్ బ్యాటింగ్ ఆర్ఢర్ పరుగులు సాధించడానికి అపసోపాలు పడింది. చివరగా హెజిల్ వుడ్ ను ఆజ్మతుల్లా ఔట్ చేయడంతో కాబూలీవాలాలు ఆనందంలో మునిగిపోయారు.
కింగ్స్ టన్ లోని ఈ పిచ్ లో ఎప్పుడు కూడా ఛేజింగ్ చేసిన జట్టు గెలుపొందలేదు. అయినా ఆసీస్ టాస్ గెలిచి కూడా ప్రత్యర్ధిని బ్యాటింగ్ కు ఆహ్వనించింది. ఈ ఓవర్ కాన్పిడెన్స్ ఆ జట్టును దెబ్బతీసింది. ఈ వరల్డ్ కప్ లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 120 పరుగులు సాధిస్తే ఈ పిచ్ పై గెలిచిన రికార్డులు ఉన్నాయి.
Read More
Next Story