
రేపు టీ20 ప్రపంచ కప్ ఫైనల్..
భారత్ vs న్యూజిలాండ్ 10 వాస్తవాలు..
ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ మార్చి 8వ తేదీ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. మూడో T20 ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించాలన్న పట్టుదలతో ఉంది. గతంలో MS ధోని, రోహిత్ శర్మ నాయకత్వంలో 2007, 2024లో గెలిచారు.
ఇండియా vs న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ గురించి మరికొన్ని విశేషాలు..
1. T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన తొలి డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ నిలిచింది.
2. న్యూజిలాండ్ రెండోసారి T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. 2021లో ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
3. భారత్ తన నాలుగో T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. 2007లో పాకిస్తాన్‌పై, 2024లో దక్షిణాఫ్రికాపై గెలిచింది. 2014లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
4. అహ్మదాబాద్‌లో విజయం సాధిస్తే మూడు T20 ప్రపంచ కప్ ట్రోఫీలను గెలుచుకున్న తొలి జట్టుగా భారత్ అవతరించే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లాండ్ (2010, 2022), వెస్టిండీస్ (2012, 2016) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.
5. ప్రస్తుత భారత జట్టులో తొమ్మిది మంది సభ్యులు మునుపటి T20 ప్రపంచ కప్ విజేత లైనప్‌లో ఉన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సంజు సామ్సన్, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, శివం దుబే,కుల్దీప్ యాదవ్ 2024 జట్టులో ఉన్నారు.
6. ఎంఎస్ ధోని (2007),రోహిత్ శర్మ (2024) తర్వాత టి20 ప్రపంచ కప్ గెలిచిన మూడోభారత కెప్టెన్‌గా నిలవాలని సూర్యకుమార్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
7. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ ఎప్పుడూ న్యూజిలాండ్‌ను ఓడించలేదు. 2007, 2016, 2021లో జరిగిన మునుపటి మూడు మ్యాచ్‌లలో కివీస్ గెలిచింది.
8. అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ఈవెంట్ ఫైనల్స్‌కు భారత్ చేరుకోవడం ఇది 15వ సారి. వారి రికార్డు ఆరు విజయాలు (1983, 2007, 2011, 2013, 2024, 2025), ఏడు ఓటములు (2000, 2003, 2014, 2017, 2021, 2023 - రెండుసార్లు), శ్రీలంకతో ఒకసారి ట్రోఫీ పంచుకోవడం (2002)
9. న్యూజిలాండ్ ఎనిమిదో ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌కు చేరుకుంది, రెండు (2000, 2021) గెలిచి, ఐదు (2009, 2015, 2019, 2021, 2025) ఓడిపోయింది.
10. భారత్, న్యూజిలాండ్ జట్లు T20I లలో 30 సార్లు తలపడ్డాయి.

