టీ20 వరల్డ్ కప్: పాక్ పై భారత్ ఘన విజయం
x
వికెట్ తీసిన ఆనందంలో భారత ఆటగాళ్లు

టీ20 వరల్డ్ కప్: పాక్ పై భారత్ ఘన విజయం

ఏ దశలోనూ పోటీ ఇవ్వని దాయాదీ జట్టు, టీమిండియా చేతిలో చిత్తు చిత్తు, సూపర్ ఎయిట్ కు క్వాలిఫై


Click the Play button to hear this message in audio format

చిరకాల ప్రత్యర్థిపై భారత్ విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా కొలంబో వేదిక గా జరిగిన ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా 61 పరుగుల తేడాతో దాయాదీని మట్టికరిపించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ ప్రారంభించిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా విధ్వంసక ఒపెనర్ అభిషేక్ శర్మను పెవిలియన్ కు పంపాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్ భారీ షాట్ కు ప్రయత్నించి మిడ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అభిషేక్ ఈ వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లలో బరిలోకి దిగగా, రెండింటిలో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

ఇషాన్ విధ్వంసం..

అభిషేక్ తొలి ఓవర్ లోనే అవుట్ అయినప్పటికీ మరో ఒపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. దొరికిన బంతిని దొరికనట్లు బాదుతూ పాక్ బౌలింగ్ దళాన్ని కకావికలు చేశాడు.
మొదట షాహీన్ ఆఫ్రీదీ బౌలింగ్ లో సిక్స్ తో బాదుడు ప్రారంభించిన ఈ బీహార్ బ్యాట్స్ మెన్, తరువాత బౌలర్ ఎవరనేది చూడకుండా మైదానం నలువైపులా షాట్లు బాదాడు. ఈ క్రమంలో 27 బంతుల్లోనే హఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇషాన్ వరుసగా రెండు మ్యాచ్ లలో హఫ్ సెంచరీ సాధించడం గమనార్హం. ఇషాన్ దూకుడుతో పవర్ ప్లే పూర్తి చేసే సమయానికి భారత్ 62 పరుగులు సాధించింది. ఇషాన్ ఉన్నంత సేపు స్కోర్ బోర్డ్ రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది. అయితే సల్మాన్ ఆయుబ్ బౌలింగ్ భారీ షాట్ కు యత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
తరువాత నిదానంగా బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్స్ మెన్ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోర్ బోర్డును ముందుకు తెచ్చాడు. అయితే సయీమ్ ఆయుబ్ ఒకే ఓవర్ లో తిలక్ వర్మ, హర్థిక్ పాండ్యాను పెవిలియన్ చేర్చి భారత శిబిరంలో గుబులు రేపాడు. ఇషాన్ కిషన్ తరువాత దూబే మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు.

పోటీ ఇవ్వలేకపోయిన పాకిస్తాన్

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 114 పరుగులకే చాప చుట్టేసింది. పాకిస్తాన్ స్కోర్ బోర్డులో ఒక్క పరుగు కూడా చేరకుండానే ఒపెనర్ ఫర్హాన్ ను హర్థిక్ పెవిలియన్ చేర్చాడు. తరువాత బౌలింగ్ కు వచ్చిన బూమ్రా వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి పాక్ పై ఒత్తిడి పెంచాడు.
తరువాత బ్యాట్స్ మెన్ తమ వికెట్ ను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ మాత్రమే 44 పరుగులు సాధించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ చెప్పుకోదగ్గ ఇన్సింగ్ ఆడలేకపోయారు. భారత బౌలర్లతో బూమ్రా, హార్డిక్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ తలో రెండు వికెట్లు తీశారు.
Read More
Next Story