
టీ20 వరల్డ్ కప్: చరిత్ర సృష్టించిన టీమిండియా
టీ20 వరల్డ్ కప్ నూ వరుసగా రెండోసారి ముద్దాడిన భారత్
టీమిండియా చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ను ముద్దాడింది. అహ్మాదాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 96 పరుగుల తేడాతో గెలిచింది.
టాస్ గెలిచిన కివీస్ జట్టు మొదట భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వనించింది. అయితే ఈ నిర్ణయం తప్పని మన ఒపెనర్లు నిరూపించారు. ముఖ్యంగా ఫైనల్ వరకూ సరిగా ఆడని అభిషేక్- సూపర్ ఫామ్ లో ఉన్న సంజూ శాంసన్ తుఫాన్ వేగంతో పరుగులు సాధించారు. వచ్చిన బంతిని వచ్చినట్లే బాదుతూ మిస్సైల్ వేగంతో స్కోర్ బోర్డును పరుగెత్తించారు.
ఈ జోడి తొలి వికెట్ కు 98 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అభిషేక్ హఫ్ సెంచరీ(52) సాధించాడు. సంజూ శాంసన్(89) కూడా ధాటిగా ఆడాడు. అభిషేక్ అవుట్ అయిన తరువాత వచ్చిన ఇషాన్ కిషన్(54) కూడా బాదడం మొదలు పెట్టడంతో భారత్ తొలి పది ఓవర్లలోనే 150 పరుగులు సాధించింది.
వీరు సాధికారికంగా ఆడుతుండటంతో ఓ దశలో టీమిండియా 300 పరుగులు సాధిస్తుందని అనిపిస్తుంది. అయితే 15 ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన జిమ్మి నీషన్ ఒకే ఓవర్ లో సంజూ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ లను పెవిలియన్ పంపి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు.
దీనికి అనుకున్నన్నీ పరుగులు బోర్డు మీద పెట్టలేకపోయారు. హర్డిక్ పాండ్యా, తిలక్ వర్మ ను న్యూజిలాండ్ బౌలర్లు భారీ షాట్లు ఆడకుండ నిలవరించగలిగారు. అయితే చివరి ఓవర్ లో దూబే ఏకంగా రెండు సిక్స్ లు, మూడు ఫోర్లు బాదడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 255 పరుగులు సాధించింది. చివరి ఓవర్లో శివం దూబే న్యూజిలాండ్ ను ఉతికి ఆరేశారు. 8 బంతుల్లో 26 పరుగులు బాదారు

