కొలంబోలో తీవ్రంగా శ్రమిస్తున్నటీమిండియా
x
సాధన చేస్తున్న భారత ఆటగాళ్లు

కొలంబోలో తీవ్రంగా శ్రమిస్తున్నటీమిండియా

నెట్స్ లో ఇబ్బందిగా కదిలిన అభిషేక్ శర్మ


Click the Play button to hear this message in audio format

కొలంబో వేదికగా మరికొద్ది గంటల్లో భారత్- పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ మరో ఆరుగంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం బీసీసీఐ విడుదల చేసింది.

రెండు జట్ల ఆటగాళ్లు ఆర్ ప్రేమదాస స్టేడియంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు కొలంబోలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మరియు అతని సహాయక సిబ్బంది పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేసింది.
అయితే నిరంతర వర్షం కారణంగా భారత్ సెషన్‌కు ఆటంకం కలిగింది. వర్షం విరామం లేకుండా కురవడంతో టీమ్ ఇండియా ఇండోర్ నెట్స్‌కు వెళ్లి సాధన చేసింది. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన అభిషేక్ శర్మ, ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్లు అయిన కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.
స్పిన్నర్లపై బ్యాటింగ్ పూర్తి చేసిన తర్వాత, 25 ఏళ్ల అతను పేసర్లను ఎదుర్కోవడానికి మరో ఎండ్ లో ఉన్న నెట్స్‌కు మారాడు. అయితే పాదాల కదలికలో వేగంగా లేవు. బలమైన షాట్లు ఆడటానికి ప్రయత్నించిన అవి అంతగా మిడిల్ కాలేదు.
ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచ కప్‌లో USA, నమీబియాపై జరిగిన రెండు మ్యాచ్ లను భారత్ గెలిచింది. పాకిస్తాన్‌పై విజయం సాధిస్తే సూపర్ 8కు నేరుగా అర్హత సాధిస్తుంది. భారత జట్టు కసరత్తులకు సంబంధించి మరిన్ని చిత్రాలు.


















Read More
Next Story