పెర్త్ టెస్ట్: విజయం దిశగా భారత్.. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్
x

పెర్త్ టెస్ట్: విజయం దిశగా భారత్.. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్

ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్ లో టీమిండియా విజయానికి చేరువైంది. టీ సమయానికి ఎనిమిదో వికెట్ కోల్పోయింది.


ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా ప్రారంభమైన బోర్డర్ - గవాస్కర్ సిరీస్ తొలి టెస్ట్ లో భారత్ విజయానికి చేరువైంది. రెండో ఇన్సింగ్స్ లో టీ సమయానికి ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 534 పరుగుల కష్టసాధ్యమైన ఛేదనకి దిగిన కంగారూ జట్టు మూడో రోజు సాయంత్రానికే కీలకమైన మూడు వికెట్లు చేజార్చకుని ఓటమిని ఖరారు చేసుకుంది.

ఉదయం కూడా వచ్చి రాగానే ఓపెనర్ ఖవాజను సిరాజ్ వెనక్కి పంపాడు. ఉదయం పూట ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న సిరాజ్ ఖవాజతో పాటు స్టీవెన్ స్మిత్ ను బుట్టలో వేసుకున్నాడు. అయితే మరో ఎండ్ లో ట్రావిస్ హెడ్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. చూడచక్కని షాట్లతో ఓటమి అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు. అతనికి మిచెల్ మార్ష్ చక్కని సహకారం అందించాడు. ఇద్దరు లంచ్ సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించారు.

లంచ్ తరువాత ఓ చక్కని బంతితో ట్రావిస్ హెడ్(89) ను కెప్టెన్ బుమ్రా అవుట్ చేశాడు. తరువాత కొద్ది సేపటికే మిచెల్ మార్ష్ ను అరంగ్రేట బౌలర్ నితీష్ కుమార్ రెడ్డి క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేరీ కి తోడుగా నాథన్ లియాన్ క్రీజులో ఉన్నాడు.


Read More
Next Story