కష్టాల్లో టీమిండియా.. లంచ్ కి ముందు టాప్ ఆర్డర్ టపా..
x

కష్టాల్లో టీమిండియా.. లంచ్ కి ముందు టాప్ ఆర్డర్ టపా..

పెర్త్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో లంచ్ సమయానికి ముందే ..


ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫి తొలి టెస్ట్ లో టీమిండియా ఎదురీదుతోంది. ఒపెనర్లతో సహ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి చేతులెత్తేయడంతో లంచ్ సమయానికంటే ముందే భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. యువ బ్యాట్స్ మెన్లు యశస్వీ జైశ్వాల్, దేవదత్ పడిక్కల్ కనీసం ఖాతా కూడా తెరవలేదు.

మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 26 పరుగులు చేసి వెనుదిరగగా, కోహ్లి 5 పరుగులు, ధ్రువ్ జురెల్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజు లో రిషబ్ పంత్ తో పాటు వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. కంగారు బౌలర్లలో స్టార్క్, హజిల్ వుడ్ చెరో రెండు వికెట్లు, మిచెల్ మార్ష్ ఓ వికెట్ పడగొట్టారు.

పేస్, బౌన్స్..
టాస్ గెలిచిన టీమిండియా తాత్కలిక కెప్టెన్ బూమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత్ బ్యాట్స్ మెన్ కంగారు బౌలర్లు క్రీజులో కుదురుకోనివ్వలేదు. యంగ్ ఒపెనర్ బౌండరీ సాధించాలని కవర్ డ్రైవ్ కు వెళ్లగా స్లిప లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వన్ డౌన్ బ్యాట్స్ మెన్ దేవదత్ పడిక్కల్ 20 బంతులు ఆడిన ఒక్కపరుగు చేయకుండా హజిల్ వుడ్ సంధించిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న కింగ్ కోహ్లి కూడా చేతులెత్తేశాడు. వికెట్ల పతనాన్ని కొద్ది సేపు పంత్, రాహుల్ ఆపిన మరోసారి ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో వారి సహనాన్ని పరీక్షించారు. చివరకు రాహుల్ ను స్టార్క్ వెనక్కి పంపారు. పెర్త్ పిచ్ పై ఆసీస్ బౌలర్లు మంచి పేస్, బౌన్స్ రాబట్టడంతో భారత్ బ్యాట్స్ మెన్ కు పరుగులు సాధించడం దాదాపు అసాధ్యంగా మారింది.
గత రెండు ఆసీస్ పర్యటనలో భారత్ సిరీస్ గెలిచింది. ప్రస్తుతం జట్టులోని సీనియర్, జూనియర్లు అనే తేడా లేకుండా ఏ ఆటగాడు కూడా ఫామ్ లో లేడు. ముఖ్యంగా భారత్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో చరిత్రలో ఎన్నడూ లేనంగా 0-3 తో భారత్ సిరీస్ కోల్పోయింది. టీమిండియా వచ్చే ఏడాది జరగబోయే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ ను 4-0 తో గెలవాల్సి ఉంటుంది.


Read More
Next Story